తెలంగాణ అంటే ఎన్‌కౌంటరే! – ఇది వరంగల్‌లో డీఎస్పీ వార్నింగ్! తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తారా? చంపుతామంటే ఊరుకునేది లేదు – ఎంత మందిని చంపుతారో చూస్తాం

| September 9, 2011 | 1 Comment
 • Tweet
 • Tweet

తెలంగాణ అంటే ఎన్‌కౌంటరే!

-ఇది వరంగల్‌లో డీఎస్పీ వార్నింగ్!
-12 మంది విద్యార్థులపై చిత్రహింసలు..స్టేషన్లకు తిప్పి మరీ చితకబాదారు
- తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తారా?
- విద్యార్థుల అరెస్టు, చిత్రహింసలపై ఆగ్రహం
- జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
- వరంగల్ నగరంలో బస్సు దగ్ధం
- పోలీస్ స్టేషన్లు ముట్టడించిన విద్యార్థులు
- తీరుమారని ఖాకీ.. విద్యార్థులపై లాఠీచార్జ్
- చంపుతామంటే ఊరుకునేది లేదు
- కాజీపేట డీఎస్పీకి ఉద్యమకారుల హెచ్చరిక
- హక్కుల సంఘానికి వెళతామన్న బోయినపల్లి
- ఎంత మందిని చంపుతారో చూస్తాం: పాపిడ్డి

‘అరే తెలంగాణ అంటార్రా? ఇంకోసారి అంటారా? మర్యాదగా.. తెలంగాణ అని ఇంకోసారి అనమం ఊరుకుంటాం. లేదంటే మీ పని అంతే. మిమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తాం. ఏమనుకుంటున్నారో..’ ఇది తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకుగా ఉన్న విద్యార్థి నేతలకు ఓ రక్షకభట అధిపతి ఇచ్చిన వార్నింగ్! విద్యార్థి నేతలకే కాదు.. వారికి మద్దతు పలికిన టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్ రెడ్డికీ అదే గతి పడుతుందని హెచ్చరిక! అది ఎలా ఉంటుందో మచ్చుకు రుచి చూపించారు కూడా! పోలీస్ స్టేషన్‌లో వేసి, రెండు కాళ్లను చాపి.. వాటిపై ఒకరు కూర్చొని, కాళ్లపై రోకలిబండల్లాంటి లాఠీలతో మరికొందరు బాదుతూ, బస్సుపూక్కించి, జిల్లాలోని ఠాణాలన్నీ తిప్పుతూ, అక్కడ సెల్‌లో వేసి చితకబాతుతూ, మార్గమధ్యంలో వాహనంలోనే కుళ్లబొడుస్తూ..

బూతులు తిడుతూ.. బెదిరిస్తూ.. భయవూభాంతులకు గురిచేస్తూ… తెలంగాణ ఉద్యమంపై తమ కసి తీర్చుకున్నారు! ఫలితం.. నలుగురు యువకులు నడవలేని స్థితి! అందులో ఒకరిది మరీ దారుణమైన పరిస్థితి! ఇది వరంగల్ జిల్లా ఖాకీల మార్కు హింస! నరనరాన జీర్ణించుకుపోయిన తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం! తెలంగాణ విషయంలో దోబూచులాడుతున్న మంత్రి పొన్నాలను నిలదీయడం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది! ఆవేశంతో ఆయన ఇల్లు ముట్టడించడం ఘోరమైపోయింది! వెరసి.. 12 మంది విద్యార్థులను రాత్రంతా జిల్లాలోని వివిధ స్టేషన్లకు తిప్పుతూ థర్డ్‌డిగ్రీ చిత్ర హింసలు పెట్టారు! డీఎస్పీ తమను ఎలా బెదిరించిందీ..

ఎలా చిత్రహింసల పాల్జేసిందీ బాధితులు న్యాయమూర్తికి విన్నవించుకోవడతో ఖాకీల కర్కశం సమాజానికి వెల్లడైంది! విద్యార్థుల అరెస్టులు, చిత్రహింసలపై తెలంగాణ భగ్గుమంది! పోరుగల్లు పొక్కిలైంది! డీఎస్పీ కిరాతకాన్ని ఖండిస్తూ విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ఠాణాలను ముట్టడించారు! డీఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ జేఏసీ, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తోడయ్యాయి. డీఎస్పీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించాయి. తెలంగాణ కావాలంటున్న నాలుగున్నర కోట్ల మందినీ ఎన్‌కౌంటర్ చేస్తారా? అని సవాలు చేశాయి!!

ఎన్‌కౌంటర్ చేస్తానన్నాడు!
- ఖాకీ కర్కశాన్ని కళ్లకు కట్టిన విద్యార్థి నేత
- చిత్రహింసలపై న్యాయమూర్తికి వివరాలు
- నడవలేని స్థితిలో స్ట్రెచర్‌పై కోర్టుకు యాకూబ్‌డ్డి
- కిక్కిరిసిన కోర్టు.. మార్మోగిన తెలంగాణ నినాదం
చెయ్యి కదిపితే బాధ! కాలు మెదిపితే నరకం! ఒళ్లంతా పచ్చి పుండు! మాట పెగిలే సత్తవ కూడాలేదు! అయినా మొండితనం.. తెలంగాణ కోసం! తెలంగాణ రాష్ట్ర సాధన కోసం! ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఊకంటి యాకూబ్‌డ్డి. కాకతీయ యూనివర్సిటీలో కెమివూస్టీలో డాక్టరేట్ పొందిన రైతుబిడ్డ. అనునిత్యం తెలంగాణాన్ని గానం చేసే విద్యార్థి నేత. పోలీసుల చిత్రహింసల కారణంగా స్ట్రెచర్ మీద వచ్చాడు! శరీరం సహకరించకున్నా ప్రాణాలు కూడ తీసుకొని, పూసగుచ్చినట్లు పోలీసుల నగ్న స్వరూపాన్ని న్యాయదేవత ముందు నిలబెట్టాడు!

వరంగల్, సెప్టెంబర్ 8 (టీ న్యూస్): ఊకంటి యాకూబ్‌డ్డి. కాకతీయ యూనివర్సిటీలో కెమివూస్టీలో డాక్టరేట్ పొందిన రైతుబిడ్డ. అనునిత్యం తెలంగాణాన్ని గానం చేసే విద్యార్థి నేత. ఖాకీ చెరలో గాయాల పాలైన తీరు హృదయ విదారకరంగా ఉంది. అక్రమ నిర్భంధం ఒకవైపు.. అలవికాని చిత్రహింసలింకొక వైపు.. అసలు సంగతి బయటపడితే అంతం చేస్తామన్న బెదిరింపులు మరోవైపు! ఐతేనేం.. అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసుల నిజస్వరూపాన్ని అదరక, బెదరక న్యాయమూర్తి ముందు ఆవిష్కరించాడు యాకూబ్‌డ్డి. ఒళ్లంతా గాయాలు సలుపుతున్నా, నిలబడడం కాదుకదా మాట్లాడటానికి కూడా శరీరం సహకరించకున్నా ప్రాణాలు కూడ తీసుకొని, పూసగుచ్చినట్లు పోలీసుల నగ్న స్వరూపాన్ని న్యాయదేవత ముందు నిలబెట్టాడు.

న్యాయవాదులు, తెలంగాణవాదులు అనుక్షణం ఉత్కం చూస్తుండగా.. వందలాదిగా మోహరించిన పోలీసు బలగాల మధ్య యాకూబ్‌డ్డి అంబుపూన్స్‌లో అదాలత్‌కు రాగానే కోర్టు కోర్టంతా జైతెలంగాణ నినాదమయ్యింది. క్షతగావూతుడైన యోధుడిని చూసి ఉద్యమకారులు, కొడుకు దేహంపై కమిలిన గాయాల్ని తడుముతూ కన్నీరొలికించిన కన్నతండ్రి! కంటతడిపెట్టని నయనం లేదు. ‘నీత్యాగం వృథాకాదు, నీ స్వప్నం నిజం కాకపోదు’ అని వెన్నుతట్టిన సహచరుల కరస్పర్శల తదుపరి స్టెచర్‌పైనే కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తికి, యాకూబ్‌డ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

నీ పేరేమిటి?
యాకూబ్‌డ్డి
మీ తండ్రి పేరేమిటి?
సమ్మిడ్డి.
మిమ్ముల్ని ఎక్కడ అరెస్టు చేశారు?
సుబేదారిలో.
ఎన్ని గంటలకు అరెస్టు చేశారు?
12 గంటలకు.
మిమ్ముల్ని ఎక్కడ నిర్బంధించారు?
సుబేదారిలో.
తర్వాతేం జరిగింది?
మమ్ములందర్ని ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్కడేం జరిగింది?
దుఃఖం..!! సార్ అక్కడ నా బట్టలు విప్పించారు. ఒకరి తర్వాత ఒకరు చిత్రహింసలకు గురిచేశారు. సార్ భరించలేని బాధ అవుతున్నది సార్.
దేనితో కొట్టారు?
కర్రలతో సార్.
ఎవరు కొట్టారు?
డీఎస్పీ వెంకవూటాంనర్సయ్య, ఇంకో ఆరుగురు పోలీసులు సార్.
ఎక్కడ కొట్టారు?
ఒళ్లంతా కొట్టారు సార్. పురుసాల మీద కూడా కొట్టారు సార్.. ఒల్లంతా ఒకటే నొప్పి సార్.
ఆ తర్వాత?
మీ కోసం ఫోన్ చేస్తున్న పెద్ది సుదర్శన్‌డ్డిని కూడా ఒదిలిబె లేదు.. ఇదే రూంలో మీలాగే ఆయన సంగతి కూడా చూస్తామని బెదిరించారు
ఆ తర్వాత?
చాలా సేపు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పారు సార్.
ఆ తర్వాత?
ఎంజీఎం ఆస్పత్రి నుంచి కోర్టుకు వస్తుంటే అంబుపూన్స్‌లో ఎస్కార్ట్ పోలీసులు కూడా పోలీసులకు వ్యతిరేకంగా న్యాయమూర్తి ముందు మాట్లాడితే ఎన్‌కౌంటర్ చేస్తామన్నారు సార్. నాకు ఈ పోలీసులతో ప్రాణభయం ఉంది సార్..

బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నాక, న్యాయవాదుల అభ్యర్థన మేరకు యాకూబ్‌డ్డిని జైలుకు తరలించి తగిన వైద్యం అదించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

source from Namaste Telangana

Related posts:

 1. హన్మకొండ రాంనగర్‌లోని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని కేయూ విద్యార్థులు ముట్టడించిన సంఘటనలో అరెస్టయిన 17 మంది విద్యార్థులు పోలీసుల చిత్ర హింసల కు విలవిల్లాడి పోయారు.
 2. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
 3. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
 4. ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై ఆ ఇద్దరు పోలీసు అధికారులు (కాజీపేట డీఎస్పీ వెంకట్రాం నర్సయ్య, హన్మకొండ సీఐ వెంక అతిగా ప్రవరిస్తున్నారు
 5. తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక

Tags: , , , , ,

Category: Warangal News

Comments (1)

Trackback URL | Comments RSS Feed

 1. Chittibabu says:

  idhi chala goram
  ilantivallani DSP ni champina mana telangana ki nastam ledhu inka labame.
  ilantivallani mana telangana lo ne lekudnda cheyyali…
  vadini ventanne suspend cheyyali….

Leave a Reply


+ six = 7Recent Postscar rental services warangal, kazipet, hanamkonda


car rental services warangal, kazipet, hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.