హన్మకొండ రాంనగర్‌లోని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని కేయూ విద్యార్థులు ముట్టడించిన సంఘటనలో అరెస్టయిన 17 మంది విద్యార్థులు పోలీసుల చిత్ర హింసల కు విలవిల్లాడి పోయారు.

| September 9, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

హన్మకొండ రాంనగర్‌లోని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని కేయూ విద్యార్థులు ముట్టడించిన సంఘటనలో అరెస్టయిన 17 మంది విద్యార్థులు పోలీసుల చిత్ర హింసల కు విలవిల్లాడి పోయారు. మంత్రి ఇంటి వద్ద బుధవారం మ ధ్యాహ్నం సుమారు 12 గంటలకు అరెస్టు చేసినప్పటి నుం చి వారికి నరకం మొదలైంది. అరెస్టయిన విద్యార్థులను పోలీసులు 400 కిమీ తిప్పి, 11 పోలీస్ స్టేషన్లకు మార్చి 9 గం టల పాటు చిత్ర హింసలకు గురిచేశారు. చెప్పుకోలేని చోట, చెప్పరాని రీతిలో అమానుషంగా కొట్టారు. ఇష్టమొచ్చినట్టు కుల్లబొడిచారు. దెబ్బలు పైకి కనిపించకుండా ఉండేలా పోలీసులు తమదైన మార్క్‌ను ప్రదర్శించారు.

విద్యార్థులు నడవలేని, కనీసం లేచి నిలబడలేని స్థితికి చేరుకున్నారు. శారరకంగానే కాకుండా, వారిని మానసికం గా కూడా హింసించారు. గతంలో విద్యార్థులు మంత్రి ఇం టిని ఎన్నోసార్లు ముట్టడించారు. ధర్నాలు, ప్రదర్శనలు జరిపారు. అప్పుడు పోలీసులు ఇంతగా విద్యార్ధులపై తమ ప్రతాపాన్ని చూపలేదు. కానీ బుధవారం నాటి సంఘటన లో పోలీసులు అత్యంత క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తించడం చూ స్తుంటే ఉద్యమకారుల పట్ల వారి వైఖరి మారినట్టు స్పష్టం అవుతోంది.

తిప్పి.. తిప్పి… పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసిన అనంతరం మొదట సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి అక్కడ తీవ్రంగా కొట్టారు. డీఎస్‌పీ వెంకటనర్సయ్య పర్యవేక్షణలో విద్యార్ధులపై ఖాకీలు తమ ప్రతాపాన్ని చూపారు. అక్కడి నుంచి జఫర్‌గడ్ పోలీస్ స్టేషన్, రఘునా«థపల్లి, లింగాలఘణపురం, జనగామ, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు పోలీస్‌స్టేషన్లకు తిప్పి… చివరికి రాత్రి సుమారు 12 గంటలకు తిరిగి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

జడ్జీ ఆదేశాలతో హింసకు తెర… పోలీసులు థర్డ్ డిగ్రీ పద్ధతుల ద్వారా విద్యార్థుల ప్రాధమిక హ క్కులను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని జిల్లా బార్ అసోసియేషన్ బాధ్యులు బుధవారం రాత్రి జిల్లా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నారాయణకు ఫిర్యాదు చేశారు. దీం తో స్పందించిన న్యాయమూర్తి పోలీస్ కస్టడీలో ఉన్నవిద్యార్థులను వెంటనే తమ ముందు హాజరుపరచాలని, దీనికి బా«ధ్యులైన సుబేదారి సీఐ, ఎస్ఐ గురువారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. జడ్జి ఆదేశాలతో కంగుతిన్న పోలీసులు ఈ విషయా న్ని వెంటనే తమ ఉన్నతాధికారులకు తెలియచేశారు.

హుటాహుటిన సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీ ఎస్పీ వీరేశ్వర్‌రావు, సీఐ రణధీర్‌లకు అప్పటికే అక్కడికి వచ్చిన కోర్టు బెయిలిఫ్ నుంచి ఆదేశాల ప్రతులను స్వీకరించారు. వెంటనే విద్యార్థులను ఎంజీఎంకు తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు పూర్తయిన అనంతరం తెల్లవారుజామున 5.30 గంటలకు నాల్గవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ నర్సిరెడ్డి ఎదుట హాజరు పరిచారు. ఆయన వారిని వరంగ ల్ సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు పంపారు.

జడ్జీ ఎదుట బాధితుల గోడు… జడ్జీ ఎదుట హాజరైన 17 మంది విద్యార్థులు పోలీసులు తమను ఎలా హింసించారో కన్నీటితో వివరించారు. కేయూ విద్యార్థి జాక్ చైర్మన్ సాదు రాజేశ్, జాక్ నాయకులు యాకూబ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కిశోర్‌లు పోలీసులు విచక్షణా రహితంగా తమను బాదారని జడ్జికి వివరించారు. ఈ సం దర్భంగా యాకూబ్‌రెడ్డి మాట్లాడుతూ పోలీస్‌లు తనను ఏ వి«ధంగా చిత్ర హింసలకు గురి చేసారో కళ్లకు కట్టినట్టు వివరించారు. తనను పోలీసులు ధర్మసాగర్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తర్వాత డీఎస్పీ వెంకట నర్సయ్య, మరో ఆరుగురు కానిస్టేబుళ్లు బట్టలు ఊడదీసి తకబాదినట్టు వివరించారు. శరీరంలోని ప్రతీ అవయవాన్ని గాయపరిచారని తెలిపారు. విద్యార్థులు చెప్పిన ప్రతీ అంశాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు.

తీవ్ర గాయాలతో బాధపడుతున్న యాకూబ్ రెడ్డిని ఎంజీఎంలో చేర్చాల్సిందిగా ఆదేశిస్తూ మిగతా వారిని సెంట్రల్ జైల్‌కు రిమాండ్ చేశారు. కాగా, విద్యార్థుల పక్షా న బార్ అసోసియేషన్ బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా గురువారం విద్యార్థులందరికి న్యాయమూర్తి బెయిల్ మం జూరు చేశారు. రూ.5వేలు, ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై విద్యార్థులను విడుదల చేశారు.

వెల్లువెత్తిన నిరసన విద్యార్థులను అరెస్టు చేసి విచక్షణా రహితంగా పోలీసు లు హింసించడం పట్ల బార్ అసోసియేషన్ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ఇందుకు బాధ్యుడైన డీఎస్పీ వెంకటనర్సయ్యను సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసింది. న్యాయవాదుల నిరాహార దీక్షా శిబిరానికి హాజరైన తెలంగాణ న్యాయవాదుల జాక్ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, కో కన్వీనర్ ప్రహ్లాద్‌లు మాట్లాడుతూ డీఎస్‌పిీ వెంకటనర్సయ్య సీమాంధ్ర తొత్తుగా వ్యవహరిస్తున్నాడనీ, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

source from AndhraJyothi

Related posts:

  1. హన్మకొండలోని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇల్లు ముట్టడి
  2. అమరవీరుల స్థూపం వద్ద హోరెత్తిన తెలం’గానం’
  3. జగన్, విజయమ్మ రాజీనామా ఏది ? -శంకర్ రావు
  4. తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
  5. ‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’

Tags: , , , , , , ,

Category: Warangal News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


4 − = oneRecent PostsWeb Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.