తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక

| September 7, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

తెగించి కొట్లాడుతం – సకల జనుల సమ్మెకు మద్దతుగా నిరసనలు
- ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మల శవయాత్ర.. దహనం
- తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు
- భారీగా పాల్గొన్న విద్యార్థులు
- మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్
- లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న తెలంగాణవాదులు

తెలంగాణ వచ్చేవరకు తెగించి కొట్లాడుతమని, ప్రజాప్రతి నిధులు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని తెలంగా ణవాదులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో జేఏసీ నాయకుడు సదానందగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు విజయ్‌గౌడ్, బోజిడ్డి, వివేకానంద ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్‌నగర్‌లో ప్రజావూఫంట్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. క్లాక్ టవర్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా లో నిరసనలు మిన్నంటాయి. తెలంగాణ సాధనలో రాజకీయ పార్టీలదే కీలక పాత్ర కావడంతో రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని నేతలు సూచించారు. ఆందోళనల్లో కనకాచారి, రంగరాజు, ఖాజామియా, వెంక కుమారస్వామి, నరేందర్, విద్యాసాగర్, తిరుమలరావు, రవీందర్, విశ్వం, సతీ ష్, వెంకటరామారావు పాల్గొన్నారు.

మెదక్ జిల్లాలో జేఏసీ, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కొల్చారం, మెదక్‌లో ర్యాలీ నిర్వహించి మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నారాయణఖేడ్‌లో రాజీవ్‌చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వరంగల్ జిల్లా పరకాల, మహబూబాబాద్, జనగామ, నర్సంపేట, ములుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో దిష్టిబొమ్మలకు శవయావూత నిర్వహించి దహనం చేశారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం అర్బన్ అధ్యక్షుడు బోడ డిన్నా ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో, పోచమ్మమైదాన్ సెంటర్‌లో టీఆర్‌ఎస్ నాయకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలను దహనం చేశారు. రంగాడ్డి జిల్లా తాండూరులో విద్యార్థులు కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి, హోంమంత్రి సబిత, ఎమ్మెల్యే మహేందర్‌డ్డి దిష్టిబొమ్మలతో శవయాత్ర, రాస్తారోకో నిర్వహించి దహనం చేశారు. పరిగిలో విద్యార్థులు తెలంగాణకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కార్యక్షికమంలో విద్యార్థి జేఏసీ నాయకులు సతీష్, శివ, రాజు, అనిల్ పాల్గొన్నారు.

మేడ్చల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్‌లో ప్రదర్శన నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్షికమంలో ఎమ్మెల్సీ నారదాసుతోపాటు విద్యార్థి జేఏసీ నేతలు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. కార్యక్షికమంలో జేఏసీ కన్వీనర్ జి. వెంక టీఆర్‌ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జి అనీల్‌కుమార్, జేఏసీ వైస్ చైర్మన్ చక్రరామరాజు పాల్గొన్నారు. ఎస్‌జేఏసీ ఆధ్వర్యంలో, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వేర్వేరుగా రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌డ్డి, నియోజకవర్గ కన్వీనర్ వీరవూపసాద్, టీఆర్‌ఎస్వీ నాయకులు హరీష్‌డ్డి పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి, ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. నిర్మల్‌లో ఎమ్మెల్యే మహేశ్వర్‌డ్డి, ఎంపీ రాథోడ్ రమేష్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంనాథ్, జేఏసీ నాయకులు సత్యనారాయణగౌడ్, విజయ్‌శంకర్ పాల్గొన్నారు. బెజ్జూర్ మండలం నుంచి సకల జనుల సమ్మెకు మద్దతుగా ప్రచార కార్యక్షికమాలు చేపట్టారు. కార్యక్షికమంలో మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి, కిషోర్ పాల్గొన్నారు. నిజామాబాద్‌లో జేఏసీ అధ్యక్షుడు గోపాల్‌శర్మ, టీన్‌ఎజీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్‌లో పీడీఎస్‌యూ నాయకులు, నవీపేటలో జేఏసీ నాయకులు, బాల్కొండలో టీఆర్‌ఎస్ నాయకులు ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.

source from Namste Telangana

Related posts:

  1. తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
  2. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
  3. బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ
  4. ‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’
  5. 13న రాజీనామా చేయనున్న కొండా సురేఖ

Tags: , , ,

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


5 × six =Recent Postscar rental services warangal, kazipet, hanamkonda


car rental services warangal, kazipet, hanamkonda
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.