దమ్ము ఆడియో

| March 31, 2012 | 0 Comments
  • Tweet
  • SumoMe
  • Tweet
ఎన్టీఆర్‌-త్రిష జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలోని ‘దమ్ము’ ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. ఆడియో తొలి ప్రతిని ఎం.ఎం.కీరవాణి ఆవిష్కరించి ఎన్టీఆర్‌కి అందించారు. శ్రీనువైట్ల ట్రైలర్స్‌ను ఆవిష్కరించారు. రాజమౌళి, శ్రీనువైట్ల, కోట శ్రీనివాసరావు, కార్తీక, కె.ఎ.వల్లభ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

విభజించి..పాలించి… వేడుక అట్టహాసం…ఆలోచన విహీనం! ఎన్టీఆర్‌ సినిమా అంటే అభిమానులకు ఓ పెద్దపండుగ. అదీ ‘సింహా’ వంటి భారీహిట్‌నిచ్చిన బోయపాటితో సినిమా అంటే…ఆ అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఎంతోకా లానికి వస్తున్న ఎన్టీఆర్‌ సినిమా అంటే అభిమానుల్లో ఓ ఉత్సుకత. అలాంటి ఈ పెద్ద పండుగకు రాకుండా.. అటు అభిమానులను ఇటు మీడియాను నిలువరించి..క్షమాపణలు చెప్పాల్సిన స్థితి తెచ్చుకోవడం నిర్మాత స్వయంకృతాపరాధం. ఆడియో వేడుక ఘనంగానే నిర్వహించినా..ప్రతిసారీ ప్రచారా నికి వాడుకునే మీడియాను ఈసారి మరీ ఘోరంగా చిన్నచూ పు చూశారు.

సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ ప్రముఖ నిర్మాత చేయాల్సిన పని ఇది కాదు. విభజించు.. పాలించు అన్న సూత్రం సినిమారంగంలో లేనే లేదు. ఒకవేళ బి,సి వర్గం ప్రేక్షకులు ఈ సినిమాని విభజించి చూడా ల్సి..వస్తే పరిస్థితి ఏమిటన్నది సదరు నిర్మాత ఊహించగలిగిందే. మీడి యా ఈజ్‌ వన్‌. ‘బతకండి అంటే ఎవడూ వినడు. ఇపుడు కోత వచ్చింది.. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు’… ‘దమ్ము’ లోని డైలాగ్‌ ఇది. రాత మార్చేదెవరు? అనే దానికి జవాబు కూడా ఇక్కడే ఉంది.

Category: Cinema News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply
Recent Posts

Free Blood Donors Hyderabad, warangal
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.