‘ఏపీ సెట్ -2012’ నోటిఫికేషన్ విడుదల

| April 24, 2012 | 0 Comments
  • Tweet
  • Tweet

- 24 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహణ
- మే 3 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
- జులై 27న రాత పరీక్ష
- ఏపీ సెట్ కమిటీ సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 23 ( టీ న్యూస్):ఆంధ్రవూపదేశ్ స్టేట్ లెవల్ ఎలిజిబులిటీ టెస్ట్ ‘ఏపీ సెట్-2012’ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. రాష్ట్రంలో మెట్టమెదటిసారిగా ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. మొత్తం 24 సబ్జెక్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ సెట్ కమిటీ మెంబర్ సెక్రటరీ రాజేశ్వర్‌డ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీ నుంచీ 6వ తేదీ వరకు రూ. 100 ఆలస్య రుసుముతో, జూన్ 10 వరకు రూ. 200 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెట్ పరీక్ష జులై 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు రుసుము ఓసీ విద్యార్థులకు రూ. 700, బీసీలకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 450. పరీక్షా విధానం, సెలబస్ యూజీసీ నిర్వహించే నెట్ పరీక్ష తరహాలోనే ఉంటుంది.

అభ్యర్థులు 3 పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొదటి రెండు పేపర్లలో అర్హత సాధిస్తేనే మూడో పేపర్‌ను దిద్దుతారు. ఓసీ విద్యార్థులు మొదటి రెండు పేపర్లలో 40 శాతం మార్కుల చొప్పున, మూడో పేపర్లో 50 శాతం మార్కులు సాధించాలి. బీసీ విద్యార్థులు మొదటి రెండు పేపర్లలో 35 శాతం, మూడో పేపర్లో 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మొదటి రెండు పేపర్లలో 35 శాతం, మూడవ పేపర్లో 40 శాతం మార్కులు సాధిస్తే సెట్‌లో అర్హత సాధిస్తారు.
పూర్తి వివరాలకు www.osmania.ac.in, www.apset.org వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు.
040-27097733,27097711 ఫోన్ నెంబర్ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

Tags: , ‘ఏపీ సెట్ -2012’ నోటిఫికేషన్ విడుదల

Category: Careers

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


three + 2 =

car rental services warangal, kazipet, hanamkonda


car rental services warangal, kazipet, hanamkonda
Free Blood Donors Hyderabad, warangal
BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.