తెలంగాణ వ్యతిరేకులకు వైద్యం చేయం – కలిసి రాని నేతలు కాటికి పోయినోళ్లతో సమానం – కక్షసాధింపులకు దిగితే అత్యవసర సేవలూ ఆపేస్తాం

| September 9, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

అనూహ్యంగా వైద్య సేవలు ఆపేస్తాం

- తెలంగాణ వ్యతిరేకులకు వైద్యం చేయం
- కలిసి రాని నేతలు కాటికి పోయినోళ్లతో సమానం
- కక్షసాధింపులకు దిగితే అత్యవసర సేవలూ ఆపేస్తాం
- ‘టీ న్యూస్’ తో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్

వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు నారాయణుడి(దేవుడి)తో సమానం అని అర్థం. ఇప్పుడా నారాయణులంతా తెలంగాణ ఉద్యమంలో సై అంటున్నారు. ఉద్యమం స్పీడ్‌గా ఉంది జాగ్రత్త అంటూ సీమాంవూధులకు హెచ్చరిక పూర్వక జాగ్రత్తలు చెబుతున్నారు. సకల జనుల సమ్మెలో ప్రాణాలను ఫణంగా పెటె్టైనా తెలంగాణ సాధించుకుని తీరుతామంటున్నారు. ప్రాణమున్న సకల జనులు తెలంగాణ కోసం కలిసొస్తే, కలిసిరానోళ్లు కాటికిపోయినట్లుగానే లెక్కిస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. రాజకీయ చిరునామాలే కాదు.. వాస్తవ చిరునామాలూ చెరిగిపోతాయంటూ ఉద్యమ గీతికలు పాడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ సాధన ఉద్యమం సాగుతుందని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ అన్నారు.తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో డాక్టర్లు ఏ స్థాయిలో ఉద్యమించబోతున్నారో ‘టీన్యూస్’తో వెల్లడించారు. …

తెలంగాణ ప్రజలు చేయబోయే సకల జనుల సమ్మె ప్రపంచ పటంపై ఒక మహాద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ చెప్పారు. దగాపడిన తెలంగాణ జాతి పోరాటం దోపిడీని అరికట్టడానికి, ఆత్మగౌరవం కోసం కదులుతున్నదని అన్నారు. ద్వితీయ శ్రేణి పౌరులుగా 60ఏళ్లగా బతుకుతున్న తెలంగాణబిడ్డలు చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. సమ్మె ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ జాతి మొత్తం ఎదురు చూస్తున్నదని చెప్పారు. ప్రపంచ మొత్తం గమనించేలా కుల, మతాలకతీతంగా సమ్మె సాగబోతున్నదని అన్నారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో ఆయన టీ న్యూస్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ వివరాలు…
AA-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసమ్మెలో మొత్తం మెడికల్ జేఏసీ ఏ స్థాయిలో కలిసి పనిచేయబోతున్నది?
ఇప్పటికే తెలంగాణ వైద్య రంగంలో ఉన్న వారిని సమీకృతంచేయడానికి వైద్య గర్జన నిర్వహించాం. తెలంగాణ మెడికల్ జాక్ కూడా సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నది. మా డిపార్ట్‌మెంట్‌లో దాదాపు 80 శాతం మంది సీమాంవూధులే తిష్ట వేశారు. అర్హులైన తెలంగాణ డాక్టర్లు ఉన్నప్పటికీ ప్రమోషన్లు దక్కడం లేదు. ఇలా అనేక మంది ఇబ్బందులు పడ్డవారున్నారు. వారంతా సమ్మెలో కలిసి వస్తారు. అదే సమయంలో సమ్మెలో పాల్గొన్న ఏ ఒక్కరిపైనైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తెలంగాణలోని అన్ని ఆస్పవూతులతో పాటు గాంధీ, ఉస్మానియాలో అత్యవసర సేవలను కూడా నిలిపివేయడానికి సిద్ధమై ఉన్నాం.

సమ్మెకు సకల జనుల ఆమోదం ఉందా…? రాజకీయ పార్టీలు కలిసొస్తాయా?
సకల జనుల సమ్మె అంటేనే తెలంగాణ మొత్తం అని. అందరి ఆమోదం లేదనే వ్యాఖ్యలను సీమాంవూధులు చేసే ప్రచారంగానే చూడాలి. ఇక అధికార కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కర్షకులు, డాక్టర్లు, జర్నలిస్టులు, కులవృత్తి సంఘాలు, మహిళలు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు ఇలా అన్ని జాతులూ సమ్మెకు సిద్ధమై ఉన్నాయి. తెలంగాణలో స్థిరపడిన సీమాంవూధులు కూడా సమ్మెకు మద్దతిస్తామంటూ ఇటీవల ర్యాలీలు, సదస్సులు పెట్టారు. సీమాంవూధలోని జైఆంవూధవాదులు కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.

పాలనా యంత్రాగం స్తంభిస్తేనే సమ్మె సక్సెస్ అవుతుంది కదా? దీనికి మీ వ్యూహమేంటి?
సమ్మె ప్రారంభమైనప్పటి నుండి అన్ని వర్గాలూ కలిసొస్తాయి. ఉద్యోగులు పాలనను స్తంభింపచేస్తారు. దీంతో ప్రభుత్వం అచేతన స్థితికి చేరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ మా సేవలను ఒక్కొక్కటిగా నిలిపేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. అవసరమైతే అత్యవసర సేవలకూ గుడ్‌బై చెబుతాం. ఈ సమ్మె ఉద్దేశం, లక్ష్యం ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర సాధన. గతంలో సమ్మె ఒకసారి విఫలమైందనే వాదన ఉంది..ఆ వాదనలో కొంత నిజముంది. అయితే అప్పటికే ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలింది. సీఎంకే జీతం రాలేదు. ప్రభుత్వం కాళ్లబేరానికి వచ్చి ఉద్యోగులతో చర్చలు జరిపి కథ నడిపించింది. ఈ దఫా అలాంటి పరిస్థితి ఉండదు. ఉద్యోగులతో పాటు ఒకేసారి డాక్టర్లు, విద్యార్థులు, యువకులు, ప్రజలు సమ్మెలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఎవరివి కృత్రిమ ఉద్యమాలో ఈ దఫా తేలిపోతాయి. కపట సమైక్యవాదులకు కళ్లుబైర్లు కమ్మి వారు కాలగర్భంలో కలిసిపోయేలా, వారి కుట్రలు బద్దలయ్యేలా సమ్మె జరగబోతున్నది.

కిందిస్థాయిలో ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది?
ఏ ఉద్యమానికైనా ప్రజల మద్దతు తప్పనిసరి. సమస్యలు, బాధలు అనుభవించేది గ్రామీణ ప్రజలే. వారు పాల్గొన్న ఏ ఉద్యమమైనా సంపూర్ణ విజయం సాధించింది. ఆ దిశలోనే 2009లో తెలంగాణ ఉద్యమం సాగింది. అందుకే డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చిన తెలంగాణ ఆగినా, ఈ దఫా చేయబోయే ఉద్యమంతోనే తెలంగాణ వచ్చి తీరుతుంది. ఈ దఫా ఉద్యమంలో కూడా గ్రామీణ ప్రాంత ప్రజానీకం చేసే ఉద్యమాలే కొండంత అండ.

హైదరాబాద్ కేంద్రంగా ఎందుకు సమ్మె కార్యాచరణను రూపొందించడం లేదు? వాయిదాలు ఎందుకు పడుతున్నాయి?
తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అనూహ్యంగా ఆస్పవూతుల్లో సర్వీసులను నిలిపివేస్తాం. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ ఆస్పవూతుల్లో మా కార్యక్షికమాలను ముమ్మరం చేస్తాం. సీమాంవూధులకు, ముఖ్యంగా తెలంగాణను వ్యతిరేకించే వారికి వైద్య సేవలను నిలిపేస్తాం. సమ్మె ప్రారంభమైనప్పటి నుండి ప్రతి రోజూ హైదరాబాద్ కేంద్రంలో కార్యక్షికమాలు సాగుతూనే ఉంటాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో చేయాల్సిన కార్యక్షికమాలపై మాకు వ్యూహముంది. దాన్ని ఇప్పుడే బయటకు చెప్పం. ఇక వాయిదాల విషయానికొస్తే పులి శత్రువు మీదికి దూకే ముందు రెండడుగులు వెనక్కు వేస్తుంది. అంత మాత్రాన పారిపోయినట్లు కాదు. మరింత గంభీరంగా, పదునైన దెబ్బ కొట్టడానికే. తెలంగాణ ఉద్యమమూ అంతే.

ప్రజలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం ఉన్నారు. ఈ సమయంలో కొంత మంది నాయకుల అనారోగ్య కారణాలతో కాలం గడిపేయడం ఎంత వరకు సమంజసం?
తెలంగాణ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదు.. అదే సమయంలో ఎవరికో ఆరోగ్యం బాగోలేదన్న కారణం చూపడమూ సరైంది కాదు. నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలకు దిగుతుంటే అనారోగ్యం సాకుగా చూపి కాలయాపన చేయాలని చూస్తే ప్రజలు కనికరం లేకుండా తాము చేయాల్సింది చేస్తారు.

రాజీనామాల సంక్షోభం వైఫల్యానికి బాధ్యుపూవరు?
మళ్లీ రాజీనామాలకు టీడీపీ, కాంగ్రెస్ ఎందుకు ముందుకు రావమొదటిసారి రాజీనామాల సంక్షోభం విఫలం కావడానికి స్పీకరే కారణం. తెలంగాణ నాయకుల మధ్య ఎప్పుడూ లేని ఐక్యతను చూసి స్పీకర్ రాజీనామాలను తిరస్కరించారు. రెండోసారి రాజీనామాలకు రమ్మంటే వారు ముందుకు రావడం లేదు. రెండింట్లోనూ రాజకీయ నాయకు వైఫల్యమే ఉద్యమ ఉధృతిని పెరగకుండా చేస్తున్నది. ఈ లోటు సకల జనుల సమ్మెతో పూర్తిగా పోతుంది. ఈ సమ్మెతో ప్రజాక్షిగహం కట్టలు తెచ్చుకునే ప్రమాదమూ ఉంది. ఈ సమయంలో రాజకీయ చిరునామాలే కాకుండా, వాస్తవ చిరునామాలు కూడా గల్లంతవుతాయి.

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఏంటి? ఎప్పటి నుండో చెబుతున్న ఆర్థిక వ్యవస్థ దిగ్భంధం సాధ్యమవుతుందా?
తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. పోరాటాల ఖిల్లా. తెలంగాణలో జరిగిన వీరోచిత పోరాటాలే తెలంగాణకు స్ఫూర్తి. అదే సమయంలో లక్ష్యం సాధించడం కోసం విజయవంతమైన ఉద్యమాల వ్యూ హాలను అమలు చేయడంలో ఏమాత్రం తప్పులేదు. ప్రజలు మొ త్తం పన్నులు కట్టడం ఆపేయాలి. మద్యం మానేయాలి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అన్ని మార్గాలపై ప్రజలు టార్గెట్ చేయాలి. చిన్నపాటి సుఖాల కోసం ఉద్యమాన్ని ఫణం గా పెట్టాలా? అని ఒక్కసారి ఆలోచించుకోవాలి.

కాంగ్రెస్, టీడీపీలు కూడా సమ్మెకు మద్దతు తెలిపాయి. వీరికి చిత్తశుద్ధి ఉందా? 100మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా రాని తెలంగాణ, సకల జనుల సమ్మెతో వస్తుందని నమ్ముతున్నారా..?
నమ్మకంతోనే విజయం వరిస్తుంది. నమ్మితేనే ఉద్యమాలు చేయాలి. ప్రజా నాయకులు ముం దుండి ప్రజలను నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది. కొందర్ని చూస్తుంటే వీళ్లు మా నాయకులేనా? అనే అనుమానం కలుగుతున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడవని వారి రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది. అదే సమయంలో కుహనా రాజకీయ నాయకుల స్థానంలో ఉద్యమాల యుగమైన నేటి రోజుల్లో కొత్తతరం నాయకత్వ లక్షణాలతో మున్ముందుకు వస్తున్నది. ఎవరూ ఎవర్నీ అవకాశాల కోసం అడుక్కునే పరిస్థితి లేదు. 100మంది రాజీనామాలు చేసినప్పుడే వాటిని ఆమోదించి ఉంటే తప్పకుండా సంక్షోభం వచ్చేదే. ప్రజలకు దూరంగా నేతలుంటే ప్రజలే ఉద్యమించి సాధించుకుంటారు. ఇందుకు ఈజిప్టే ఉదాహరణ.
రాజకీయపార్టీల మధ్య ఐక్యతకు మీ సంఘ ఆధ్వర్యంలో ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఐక్యత సాధ్యమేనా..?
ఉద్యమ ఐక్యత అన్ని పార్టీలదీ. 60 ఏళ్ల కల, 650 బలిదానాల ఫలితం సాకారమయ్యే వేళ భేషజాలు మరిచి ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కలిసి రావలసిందే. ఈ సమయంలో కలిసిరాని వారు కాటికెళ్లిన వానితో సమానం. ఒక్క రోజులోనే జెండాలు పక్కన పెట్టి ముద్దులాడుకున్న సీమాంవూధులను చూసి మననాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఇక ఉద్యమాల్లో అంతర్గత సంఘర్షణలు సాధారణమే. ఎన్ని ఘర్షణలున్నా అంతిమంగా ప్రజాభివూపాయానికి తలొగ్గాల్సిందే.

కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఉద్యమం చల్లబడిందనే కామెంట్ తెలంగాణవాదుల నుండే వస్తోంది. వారికి మీరేరకంగా ధైర్యానిస్తారు..?
ఉద్యమ వ్యూహాలు ఇలాగే ఉంటాయి. ప్రతిసారి పరిగెత్తి కొండను కొడతా అంటే అన్నిసార్లు సఫలం కాలేము. సమయం చూసి అదను కోసం వేచి అప్పుడు కొట్టాలి. దఫదఫాలుగా ఉద్యమ వ్యూహాలు కొనసాగుతంటాయి. ఈ దఫా ఉద్యమ వ్యూహం సకల జనుల సమ్మె. ఏ క్షణంలోనూ అధైర్యపడొద్దు. ఈజిప్టు తరహాలో ప్రజలంతా రోడ్లపైకి వస్తే పది రోజుల్లో తెలంగాణ వచ్చి తీరుతుంది. అలాంటి ప్రయత్నాల సమ్మేళనమే సకల జనుల సమ్మె.

కొందరు తెలంగాణ కోసం 2014వరకు ఆగాల్సిందే అంటున్నారు. దీనిలో నిజమెంత?
అనుకోవడానికి చాలా ఉన్నాయి. వాస్తవాలను ఎవరూ చర్చించరు. ఇలా చర్చించని సీమాంవూధులు చేస్తున్న ప్రచారమే అది. తెలంగాణ రాకుంటే ఊరుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం సిద్ధంగా లేదు. ఈ దఫా తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ వచ్చి తీరాల్సిందేనన్న కసి, కాంక్షతో ఉన్నారు.

ఈ దఫా ఉద్యమంలో హింస జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి…?
తెలంగాణ ఉద్యమం ప్రశాంత ఉద్యమం. అహింసనే నమ్ముకుని సాగుతున్న ప్రజా ఉద్యమం. తెలంగాణ వారు సీమాంవూధలో చదువుకోవడానికి పోయినా, గుడికి పోయినా కొట్టి పంపారు. కానీ ఇక్కడ కొన్ని లక్షల మంది సీమాంవూధులు ఉన్నారు. ఇప్పటికి ఒక్కరిపై కూడా చేయి చేసుకోలేదు. ఆ పరిస్థితిని సీమాంధ్ర నేతలూ ప్రజలకు కలిగించొద్దు. ఈ దఫా ఉద్యమానికి ముందు కొన్ని నెలలు విశ్రాంతి దొరికింది. ఈ సమయంలో ఉద్యమ వేగం కొంత స్పీడ్‌గానే ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడుంటున్న సీమాంవూధులు సహకరించాలి. తెలంగాణ ఉద్యమం ఏనాడూ ఇక్కడ స్థిరపడ్డ వారికి వ్యతిరేకం కాదు.

source from Namaste Telangana

Related posts:

  1. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
  2. ఉద్యమం ఎప్పుడైనా భగ్గుమంటది: కోదండరాం
  3. తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
  4. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
  5. ఓడి బానిసలవుదామా? నిలిచి గెలుద్దామా? ఫిర్ ఏక్ ధక్కా.. ఏ ధక్కా బిగడ్‌నా నహీ

Tags: , , , , ,

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


9 × six =



Recent Posts



Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.