కేయూ జేఏసీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాల – ములుగురోడ్ జంక్షన్‌లో రాస్తారోకో
కేయూ జేఏసీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు, గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎల్బీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం ములుగురోడ్ జంక్షన్‌లో పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్వీ విభాగం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆందోళన చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీసుస్టేషన్లను, స్టేషన్ల వారీగా విద్యార్థులను కొట్టుకుంటూ తిప్పడం పట్ల విద్యార్థులు తీవ్రంగా ఖండించారు.
విద్యార్థులను కొట్టినందుకు బాధ్యులైన డీఎస్పీ వెంకటనర్సయ్యను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ములుగురోడ్‌లో రాస్తారోకో చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాగా, కేయూ జేఏసీ విద్యార్థులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టిన టీఆర్ఎస్వీ నాయకులపై లాఠీచార్జి చేయడమే కాకుండా టీఆర్ఎస్వీ అర్బన్ ప్రసిడెంట్ మోడెం ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడం అక్రమమని వారు ఆరోపించారు. ఈ రాస్తారోకో, ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు, టీఎస్‌యూ నాయకులు బొడ్డు అనిల్‌కుమార్, వంశీకృష్ణ, బి.రాజేష్, ఎ.రాజేష్, ఎల్బీ కళాశాల విద్యార్థులు శరత్, రాజేశ్, శ్రీనివాస్, నాగరాజు, తరుణ్, ఫిరోజ్, సుమన్, దినేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
No related posts.
Category: Warangal News

Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.