40వ రోజుకు చేరిన ‘ప్రత్యేక’ పోరు – సమ్మె కొనసాగిస్తం
సకల జనుల సమ్మె శనివారం 40వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు సమ్మె విరమించినా తెలంగాణ ఉద్యమ వాడి, వేడి తగ్గలేదు. రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యోగులు, విద్యుత్, జ్యుడీషియల్ సిబ్బంది తమ విధులను బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. ఉద్యోగుల నిరసనలు, తెలంగాణవాదుల ఆందోళనలతో అన్ని జిల్లాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వపాలన స్తంభించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకునీత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తెలంగాణపై వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, అప్పటివరకు సమ్మె ఆపమని ఉద్యోగ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా లో సమ్మె విరమించినందుకు నిరసనగా ఉద్యమకారులు టీచర్లకు పువ్వులు, గాజులు అందజేశారు.
సీఎం, సోనియా దిష్టిబొమ్మల దహనాలు
నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండలంలోని ముత్తిడ్డిగూడెంలో కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీకి పిచ్చి పట్టిందంటూ తెలంగాణవాదులు ఆయన వేషధారికి రోడ్డుపైనే శస్త్ర చికిత్స చేశారు. మెంటల్ కారణంగానే తెలంగాణ విషయంలో స్పష్టత లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నాంపల్లిలో సీఎం కిరణ్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆలేరులో ఉపాధి కూలీలు మౌన ప్రదర్శన, సూర్యాపేటలో టీ మంత్రులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపవూతాలు సమర్పించారు.
కొనసాగుతున్న న్యాయశాఖ ఉద్యోగుల దీక్ష
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పాలకులు మాయలఫకీర్లు అం టూ మంత్రగాళ్ల వేషధారణతో వినూత్న నిరసన, ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచల్లో తెలంగాణ వ్యతిరేకులు లగడపాటి, రేగా కాంతారావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మం, కొత్తగూడెంలో కోర్టు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. ఖమ్మంలో విద్యుత్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో జేఏసీ నాయకులు నిరసన ప్రదర్శన, ఖమ్మంలో వైద్య ఉద్యోగులు దీక్షలు చేపట్టారు.
నేతల మోసం వల్లే తెలంగాణ ఆలస్యం
రంగాడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డివిజన్‌కు చెందిన గెజిటెడ్ అధికారులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రిలేదీక్ష చేపట్టారు. యాచారంలో ఎంపీడీఓ, తహసీల్దార్‌తోపాటు సిబ్బంది బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కందుకూరు మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర, పరిగిలో ఉద్యోగులు, తెలంగాణవాదులు దీక్ష చేయగా, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కులకచర్లలో జేఏసీ నాయకులు దీక్ష, పూడూరు మండలం మీర్జాపూర్, చెంచుపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర నిర్వహించారు.
ఆదివాసీల భారీ ర్యాలీ
ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లో ఆదివాసీలు ర్యాలీ, జేఏసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లో రాస్తారోకో, తాండూరులో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహ నం చేశారు. నిర్మల్‌లో న్యాయవాదుల గుమస్తాలు, మంచిర్యాలలో జ్యుడీషియల్ సిబ్బంది రిలే దీక్షలు కొనసాగుతున్నా యి. దండేపల్లిలో రెడ్డిపరివార్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. చెన్నూర్‌లో అమరుల ఆత్మశాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ, ఆదిలాబాద్‌లో ఉద్యోగులు రోడ్లు ఊడ్చి, మున్సిపల్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన, నోటికి నల్ల గుడ్డ కట్టుకొని జ్యుడీషియల్ ఉద్యోగులు నిరసన తెలిపారు. టీటీజేఏసీ సమ్మె విరమించడాన్ని నిరసిస్తూ తెలంగాణవాదులు తలమడుగు మం డల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పువ్వులు, గాజులు అందచేశారు. ఖానాపూర్ కలప డిపోలో ప్రతినెల 22న జరిగే వేలంపాటను ఉద్యమకారులు అడ్డుకున్నారు.
ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన
నిజామాబాద్‌లోని ప్రగతి భవన్ ఎదుట చేపట్టిన ధర్నాలో ఉద్యోగులు పాల్గొనగా, పవర్ హౌస్‌లో విద్యుత్ ఉద్యోగులు ధర్నా, నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లాడ్డి, బిచ్‌కుంద, కామాడ్డిలో కోర్టుల వద్ద జ్యుడీషియల్ ఉద్యోగులు దీక్ష చేపట్టారు. కోదండరాం ఇంటిని ముట్టడించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం చర్యను నిరసిస్తూ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంతం చర్యకు నిరసనగా ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పదవికి మీసాల శ్రీనివాస్‌రావు రాజీనామా చేశారు. బోధన్‌లో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన, జక్రాన్‌పల్లిలో మాలలు సమ్మెకు మద్దతుగా ర్యాలీ, బాన్సువాడలో ఉద్యోగులు, జుక్కల్‌లో తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణవాదులు, కామాడ్డి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు.
జెడ్పీ ఆవరణలో ఉద్యోగుల ధూంధాం
మహబూబ్‌నగర్‌లో డ్వామా కాంట్రాక్ట్ ఉద్యోగులు జెడ్పీ మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ, జెడ్పీ ఆవరణలో ధూంధాం నిర్వహించారు. కొందుర్గు మండలం బైరాన్‌పల్లిలో సోనియా దిష్టిబొమ్మను దహనం, కొల్లాపూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన, అచ్చంపేటలో తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. లింగాలలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, నాగర్‌కర్నూల్‌లో ద్రోహులకు పిండ ప్రదానం, తిమ్మాజిపేటలో రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు.
హోరెత్తిన నిరసనలు
వరంగల్ బల్దియా ఆధ్వర్యంలో టీ మంత్రుల ఫ్లెక్సీలపై చెత్తపోసి వినూత్న రీతిలో నిరసన తెలిపా రు. పశుసంవర్ధ్దకశాఖ, ఎన్‌పీడీసీఎల్, పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వడుప్సా పిలుపు మేరకు విద్యార్థులు ప్రధానమం త్రికి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి శ్రీకారంచుట్టారు. టీ మంత్రుల దిష్టిబొమ్మలను పలుక్షిగామాల్లో శవయావూతలు నిర్వహించి నిరసనలు తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు కోర్టుల వద్ద నోటికి నల్లబట్ట కట్టుకొని నిరసన తెలిపారు. ఇందిరాగాంధీ విగ్రహాలకు వినతిపవూతాలు ఇచ్చి సోని యా బుద్ధి మార్చాలంటూ వేడుకున్నారు.
విశ్వవూబాహ్మణుల ప్రదర్శన
మెదక్ జిల్లా పటాన్‌చెరు, నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి, ఖేడ్‌లో ఉద్యోగు లు కళ్లు, చెవులు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. మెదక్‌లో టీఎన్జీఓలు దీక్ష చేపట్టారు. మండలం బొడ్మట్‌పల్లిలో జానాడ్డి, దుబ్బాక, తొగుట, జహీరాబాద్‌లో ఏబీవీ పీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం రాజనర్సింహ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విద్యుత్, కోర్టు, వైద్య సిబ్బంది దీక్షలు కొనసాగించారు. సంగాడ్డిలో విశ్వవూబాహ్మణ మనుమయ సం ఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధూంధాం నిర్వహించారు.
ప్రభుత్వ డ్రైవర్ల సంఘం దీక్ష
కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో డ్రైవర్లు దీక్ష చేపట్టారు. టీఎన్‌జీఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హమీద్, నర్సింహస్వామి మాట్లాడుతూ అధికారులు జరిపిన చర్చలను తిప్పికొట్టినట్లు తెలిపారు. జగిత్యాలలో చేనేత కార్మికులు రాట్నం, మరమగ్గాలతో, కమలాపూర్‌లో మందకృష్ణ డబ్బులకు అమ్ముడుపోయాడంటూ నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ నేతలు చేపట్టిన 24 గంటల దీక్ష శనివారం విరమించారు. టీ చౌక్‌లో కుల సంఘాల ఆధ్వర్యంలో రోడ్డును ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గం కాటారంలో విద్యార్థులు, మహదేవపూర్‌లో మేదర సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ తీయగా, హుస్నాబాద్‌లో దీక్ష కొనసాగింది.
మంత్రి వెంకటడ్డి దిష్టిబొమ్మ దహనం
టీఎన్జీఓ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో మంత్రి రాంరెడ్డి వెంకటడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీకి శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. విద్యుత్‌సౌధలో టీ జేఏసీ సమన్వయకర్త రఘు 72 గంటల దీక్ష ప్రారంభించారు. పర్యాటకశాఖలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. సీపీడీసీఎల్, ఉద్యానవనశాఖ, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయాల్లో ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. ఉస్మానియా దవాఖానలో ప్రభుత్వ డాక్టర్ల జేఏసీ కన్వీనర్ రమేష్ ఆధ్వర్యంలో చండీయాగం, నిలోఫర్‌లో డాక్టర్లు నిరసన ప్రదర్శన, ఔషద నియంవూతణమండలిలో నాలుగో తరగతి ఉద్యోగులకు అధికారులు ఆర్థిక సహాయం, హిమాయత్‌నగర్ పంచాయతీరాజ్ కార్యాలయంలో ధూంధాం నిర్వహించారు.
source from namaste telangana
Related posts:
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- సమ్మె విరమించేదే లేదు : కోదండరాం
- తెలంగాణా వచ్చేవరకు ఆందోళనలు ఆగవు
- రాష్ట్రం వచ్చే దాకా సమ్మె – నేడు అర్ధనగ్న ప్రదర్శనలు – రేపు ర్యాలీలు, ధర్నాలు – 5న మానవహారాలు – 6న జమ్మిచెట్టు ముందు ప్రార్థనలు
- సమ్మె ఆగే ప్రసక్తే లేదు – శాంతియుతంగానే ఉద్యమాన్ని కొనసాగిస్తాం – పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు..దయచేసి జాప్యం వద్దు – తెలంగాణను ప్రకటించండి
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.