ముఖ్యమంత్రికి మూడొద్దులు – పిట్టకు పెట్టిన బల్దియా ఉద్యోగులు- మద్దతు పలికిన ప్రజలు
సకల జనుల సమ్మెలో రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న బల్దియా ఉద్యోగులు మరోసారి వినూత్న రీతిలో నిరసన తెలిపి ప్రజల మద్దతు పొందారు. ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రులు సైతం మరణించినట్లు ఈ నెల 19న డెత్‌సర్టిఫికెట్లు జారీ చేసి తెలంగాణ వ్యతిరేక శక్తులపై తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చిన బల్దియా ఉద్యోగులు శుక్రవారం ముఖ్యమంత్రికి మూడొద్దుల పిట్టకు పెట్టి తెలంగాణపై తమకున్న బలమైన ఆకాంక్షతోపాటు వ్యతిరేకులపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
బల్దియా జేఏసీ,తెలంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చిన ఉద్యోగులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు దహనసంస్కారాలు చేసిన ఎంజీఎం సెంటర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం మూడొద్దుల పిట్టకు పెట్టేతతంగాన్ని నిర్వహించారు. ఎంజీఎం సెంటర్‌లో పూజారి శాస్త్రోక్తంగా మూడొద్దుల కార్యక్రమాన్ని నిర్వహించారు. పూరి, వడ, దోశ, ఇడ్లీ, మాంసం పెట్టి మూడొద్దులు చేశారు.
ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఐదోరోజూ ఆడబిడ్డలచే ఐదొద్దుల పిట్టకు పెడతామని బల్దియా ఉద్యోగ సంఘం నేత ధర్మరాజు ప్రకటించారు. 40 రోజులుగా సకల జనుల సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఉద్యోగులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎన్ని రోజులైనా రాష్ట్ర సాధనకోసం సమ్మెను ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయాలని చూస్తోందని విమర్శించారు. అరెస్టులు, అక్రమ కేసులతో ఉద్యోగులను భయపెట్టలేరని హెచ్చరించారు. ఈ నిరసన కార్యకరమంలో బల్దియా జేఏసీ నాయకులు ఆర్.విక్రమ్, మాదాసి సాంబయ్య, సంజీవరెడ్డి, బిర్రు శ్రీనివాస్,
గోదుమల రాజు, ఆరెల్లి బిక్షపతి, బొట్ల రమేష్, గౌరీ శంకర్, సాంబయ్య, గిరిబాబు, సింగరిసాంబయ్య, బి.కుమార్, గుండేటి ప్రకాశ్, రవీందర్‌రెడ్డి, యూసుఫొద్దిన్, అబ్బాస్, రావుల ఆనంద్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, శేఖర్, మూర్తి, చీకటి రాజు, ఇజ్రయేల్, సంతోష్, ఐలయ్య, సదారెడ్డి, మధుకర్, మల్లయ్య, సుభద్ర, సరోజన, ప్రమీల, రమ, భాగ్యలక్ష్మీ, మల్లికాబేగం, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మద్దతు…
ఎంజీఎం సెంటర్‌లో ముఖ్యమంత్రి మూడొద్దుల పిట్టకు పెట్టే తతంగానికి ప్రజల నుంచి మద్దతు లభించింది. నాలుగుకూడళ్ల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమానికి దారిన పోయే ప్రజలు తెలంగాణ నినాదాలు చేస్తూ సంఘీభావం ప్రకటించారు. ద్విచక్రవాహనదారులు ఆగి ముఖ్యమంత్రి మూడొద్దుల కార్యక్రమం అయిపోయే అరకు అక్కడే ఉండి తెలంగాణ పై వారికున్ను బలమైన ఆకాంక్షను వ్యక్తంచేశారు. పక్కనే ఉన్న పశుసంవర్దకశాఖ ఉద్యోగులు బల్దియా ఉద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపారు.
బల్దియా ఉద్యోగులు చేసిన ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి ప్రజలు స్వచ్చందంగా మద్దతు తెలపడం తెలంగాణపై ప్రజలకున్న ఆకాంక్ష మరోసారి స్పష్టమైంది.
source from namaste telangana
Related posts:
- సమ్మతో సత్తా చాటిన తెలంగాణ బంద్ – తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు – లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి – ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు –
- మంత్రుల ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న టీ- ఉద్యోగులు
- 40వ రోజుకు చేరిన ‘ప్రత్యేక’ పోరు – సమ్మె కొనసాగిస్తం
- మరింత జోరు సమ్మె – జేఏసీ పిలుపిస్తే అన్ని సంఘాలూ మళ్లీ సమ్మెలోకి: జేఏసీ చైర్మన్ కోదండరాం – కొత్త రూపాల్లో ముమ్మర ఆందోళనలు!
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ సమరయోధుడు మృతి
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.