సమ్మతో సత్తా చాటిన తెలంగాణ బంద్ – తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు – లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి – ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు –

| September 14, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

సమ్మతో సత్తా చాటిన తెలంగాణ సకలం బంద్ – తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు
- ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు
- అటెండర్లు మొదలు తహసీల్దార్‌ల దాకా
- లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి
- డ్రైవర్లు రాక కదలని కలెక్టర్ల కార్లు
- ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు
- రాష్ట్రం వచ్చేదాకా పోరు తప్పదని ప్రతిన
- ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన జిల్లాలు
- సంక్షోభంలో సీమాంధ్ర సర్కార్
- ఎస్మా విధిస్తే మంత్రులదే బాధ్యత
- జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరిక
- ఇంటికో పది వేసుకుని ఉద్యోగులకిస్తాం
- సమ్మె జీతాలు రాష్ట్రం వచ్చాక వడ్డీతో సహా
- అదనంగా నెల జీతం బోనస్ ఇస్తాం: కేసీఆర్

కరీంనగర్ కన్నెపూరజేసింది.. నల్లగొండ పోరుబాట పట్టింది. మెతుకుసీమలో లొల్లిమొదలైంది.. ఆదిలాబాద్ అదరగొట్టింది. పాలమూరులో సమరోత్సాహం పెల్లుబికింది.. ఖమ్మం కదం తొక్కింది. ఇందూరులో సమ్మె సైరన్ మోగింది.. రంగాడ్డి రణన్నినాదం చేసింది. ఓరుగల్లు హోరెత్తింది.. హైదరాబాద్‌లో సకలం బంద్ అయింది!! ఉద్యోగులు వీరోచిత సమరానికి దిగారు.. పది జిల్లాల ప్రజలు ఉత్త్తుంగతరంగమై కదిలారు! ఉద్యోగులకు సంఘీభావంగా రాస్తారోకోలు చేశారు! చేయి చేయి కలిపారు. అడుగులో అడుగేశారు. పాట పాడారు.. ఆట ఆడారు.. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుదామని తెగేసి చెప్పారు! ఎస్మా గిస్మా జాన్తానై.. తెలంగాణ దేనాహై.. అంటూ పోరు నినాదం చేశారు! రాష్ట్ర సాధన దిశగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తూ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సకల జనం సమ్మెజేసింది.. తెలంగాణ సకలం బంద్ అయింది.. ఘనమైన పోరాట వారసత్వ గడ్డ.. సమ్మెతో తన సత్తా చాటిజెప్పింది! ప్రభుత్వ ఉద్యోగులు
మొదలు.. ప్రైవేటు సంస్థల దాకా..!
అటెండర్లు మొదలు.. గెజిటెడ్ అధికారుల దాకా..! లాయర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వృత్తిదారులు, కార్మికులు.. బీడీ కార్మికులు.. సకల శ్రమజీవులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు… ఒకరనేమిటి? ఒక వర్గమనేమిటి? సబ్బండ వర్ణాలు సీమాంధ్ర సర్కారుపై సమర శంఖం పూరించాయి.. రాష్ట్రమొచ్చేదాక రణమాగదని తెగేసి చెప్పాయి! తెలంగాణ జనులందరినీ జాగృతం చేయడంలో అగ్రభాగాన ఉండే 65వేల మంది సింగరేణి నల్లబంగారం కార్మికులు సై అన్నారు.. యావత్ కోల్‌బెల్ట్‌ను స్తంభింపజేశారు! వెరసి.. పాలన కుప్పకూలింది.. సీమాంధ్ర సర్కారు సంక్షోభంలో పడింది! ఎక్కడ కార్యాలయం గేటు చూసినా తాళాలే! ఎక్కడ విన్నా పోరు నినాదాలే! వందమందో వెయ్యిమందో కాదు.. ప్రభుత్వోద్యోగులే అక్షరాలా నాలుగున్నర లక్షలు! వారికి మద్దతుగా అసంఖ్యాక గొంతుకలు! అందరిదీ ఒకటే డిమాండ్! మా తెలంగాణ మాకియ్యండి! మా నీళ్లు మాకియ్యండి.. మా నిధులు మాకియ్యండి..

మా ఉద్యోగాలు మాకే వదిలేయండి! ఇవే నినాదాలతో జనం రోడ్లపైకి వచ్చారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లాలన్నీ దద్దరిల్లించారు. కార్యాలయాలకు తాళాలేశారు. తెలంగాణ జెండాపూగరేశారు! పలు జిల్లాల్లో డ్రైవర్లు రాక కలెక్టర్ల కార్లు కదల్లేదు.. సీఎస్ నిర్వహించిన తెలంగాణ జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫన్స్‌కు కలెక్టర్లు వెళ్లలేని స్థితి! ఉద్యోగానికి ఎవరొచ్చారు? ఎవరు రాలేదు? అన్న లెక్కలు తీయబోయి రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగమే బొక్కబోర్లా పడింది! ఆ సమాచారం ఇచ్చేందుకూ ఎవరూ లేని స్థితి! ఒక్క సచివాలయంలోనే భిన్నమైన పరిస్థితి! ఆ పరిస్థితే ఓ నగ్న సత్యాన్ని బట్టబయలు చేసింది! సచివాలయంలో 80 శాతం సీమాంధ్ర ఉద్యోగులే నిండిపోయిన వైనాన్ని కళ్లముందు మరోసారి నిలబెట్టింది! 20శాతమే ఉన్నా..

తెలంగాణ ఉద్యోగులు సమ్మెకు దిగారు. అన్ని శాఖల్లో కలియదిరుగుతూ తెలంగాణ ఆకాంక్షలను ప్రతిధ్వనింపజేశారు.. తోటి ఉద్యోగుల నుంచి సంఘీభావాన్ని సంపాదించారు! తొలి రోజు సమ్మెతో సర్కారీ ఖజానాకు తెలంగాణ జిల్లాల నుంచి 20 కోట్ల రూపాయల రెవెన్యూ ఆగిపోయింది. ఐదేళ్ల పసిపాప నుండి 80 ఏళ్ల వృద్ధుల దాకా సమ్మెకు సైదోడుగా నిలిచారని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణలోని 65 వేల మంది సింగరేణి కార్మికులు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 6 లక్షల మంది బీడీ కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు. తెలంగాణ రాజకీయ ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచేందుకు సంసిద్ధం కావాలని, మంత్రులు విధులను బహిష్కరించాలని, రాజీనామాలు చేయాలని, తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరేవిధంగా తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమించాలని కోదండరాంవిజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై ఎస్మా
ప్రయోగిస్తే అందుకు మంత్రులదే బాధ్యతని స్పష్టం చేశారు. ఎస్మా వంటి నిర్బంధ చట్టాలకు, పోలీసుల మోహరింపులకు ఉద్యోగులు భయపడే ప్రసక్తి లేదని ఉద్యోగసంఘాల నాయకులు స్వామిగౌడ్, దేవీవూపసాద్, శ్రీనివాస్‌గౌడ్, సీ విఠల్ తేల్చి చెప్పారు. సమ్మె కారణంగా జీతాలు కోల్పోయే ఉద్యోగులకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చారు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల జీతాలు చిన్నమొత్తాల పొదుపులో ఉన్న చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సమ్మె కాలానికి వడ్డీతో సహా చెల్లిస్తామని, అదనంగా నెల జీతం బోనస్ ఇస్తామని ప్రకటించారు. సమ్మెకాలంలో ఇబ్బందులు పడకుండా ఇంటికి పది చొప్పున వసూలు చేసి ఉద్యోగుల కుటుంబాలు నడిపిస్తామని హామీ ఇచ్చారు! చినుకు చినుకు తుదకు వరదైనట్లు..

ఉధృతంగా మొదలైన సకల జనుల సమ్మెను మహోధృతం చేసేందుకు 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ కానున్నాయి.. 16వ తేదీ నుంచి ఉపాధ్యాయులు.. 19 నుంచి ఆర్టీసీ కార్మికులు రంగంలోకి దిగుతున్నారు! మధ్యలో 18వ తేదీన ఉత్తర దక్షిణ భారతావనికి సంబంధాలు తెంచేసే స్థాయిలో జాతీయ రహదారుల దిగ్బంధం జరగబోతున్నది!

source from Namaste Telangana

Related posts:

  1. నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
  2. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
  3. సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
  4. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
  5. తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం

Tags: , , , , , , ,

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


5 × = ten



Recent Posts



Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.