జానారెడ్డి తెలంగాణ ద్రోహి
సీమాంధ్ర నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్న జానాడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నాడని టీఆర్‌ఎస్ తూర్పు నియోజకవర్గ ఉద్యమ కో-కన్వీనర్ మరుపల్ల రవి విమర్శించారు. ఆదివారం కరీమాబాద్ చెట్లవారిసెంటర్‌లో జానాడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులకు ఆశపడి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి మర్రి చెన్నాడ్డి ద్రోహం చేస్తే నేడు జానాడ్డి ద్రోహం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.
రాష్ట్ర ఏర్పాటుకోసం తెలంగాణ ఉద్యోగులంతా సమ్మె చేస్తుంటే జానాడ్డి సమ్మెను విరమించాలని చెప్పడం మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. సీమాంధ్ర ముఖ్యమంవూతితో కుమ్మకై్క జానాడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు.
ఉద్యమంలోకి కలిసిరాకుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం ఆందోళనకారులను మిల్స్‌కాలనీ పో లీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ నాయకుడు కొమ్మిని సురే ష్, టి.నర్సింగరావు, పి.రాజేష్, పి.సత్యనారాయణ, డి.నాగరాజు, వి.కుమార్, జి.రమణ, ఎండి.దస్తగిర్, పి.భోగేశ్వర్, ఎల్.నర్సింగరావు, పి.మల్లయ్య, జి.రాజు, ఆంజనేయులు, కె.రమే ష్, ఆన్వేష్, పాల్గొన్నారు.
source from tnews
Related posts:
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
- వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- తెలంగాణ కోసం కదం తొక్కిన మహిళలు
- ‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.