కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్! – పావులు కదుపుతున్న సీమాంధ్ర నేతలు – హైదరాబాద్‌లేని తెలంగాణ అంగీకరించమని టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం స్పష్టీకరణ

| October 10, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరింత సాగతీసేందుకు ఏం చేయాలి? తెలంగాణకు సంబంధించి ఒక పెద్ద చిక్కుముడి వేసి మళ్లీ అభివూపాయ సేకరణకు పూనుకుంటే ఎలా ఉంటుంది? ఆ చిక్కుముడి సీమాంధ్ర నేతలకు సంతోషం కలిగించేదిగా ఉండాలంటే ఇప్పుడు ఏ అంశాన్ని ముందుకు తెస్తే బాగుంటుంది?.. ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చేవిధంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూనే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వమే తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఇటు కాంగ్రెస్ అధిష్ఠానం, అటు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తున్నదని భావించిన ప్రతిసారీ కొందరు సీమాంధ్ర నేతలు పావులు కదిపి కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి చేయడం పరిపాటయింది. ఇదే అదనుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరిన్ని సమస్యలు సృష్టించడానికి కేంద్రం కూడా ఈ తరహా ప్రతిపాదనలను చేస్తోందనే అనుమానం తెలంగాణ వాదులకు కలుగుతోంది.

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వచ్చిన ప్రతిపాదనలను తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలనే ప్రతిపాదనకు కూడా తెలంగాణవాదులు అంగీకరించడం లేదు. హైదరాబాద్ లేని తెలంగాణ తమకు అవసరం లేదని ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రతిపాద కు బీజేపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీలతో పాటు తెలంగాణ జేఏసీ కూడా వ్యతిరేకత తెలిపాయి. ఇటువంటి ప్రతిపాదన ముందుకు తెస్తే తిరస్కరించాలని ఈ పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన వస్తే కేసీఆర్‌తో చేతులు కలుపుతానని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సమస్యను దాట వేసేందుకు కేంద్రం ఇటువంటి ప్రతిపాదనలు ముందుకు తేవడం వెనుక సీమాంధ్ర నేతల కుట్ర దాగుందని తెలంగాణ వాదులు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పేరుతో సంప్రదింపుల తతంగం నడిపిస్తున్న కేంద్రం మధ్యంతర మార్గం పేరుతో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం పేరుతో ప్రతిపాదించి సమస్యను మరింత జటిలం చేసి తెలంగాణ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి వ్యూహం పన్నిందని తెలుస్తోంది.

రాజధాని కిరికిరి కొత్తేమీ కాదు
రాజధాని కోసం సీమాంధ్ర నేతలు కిరికిరి పెట్టడం కొత్తేమీ కాదని తెలంగాణ వాదులంటున్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్పుడు కూడా అప్పటి మద్రాసు నగరం తమకు కావాలంటూ సీమాంధ్ర నేతలు కిరికిరి పెట్టి తమిళుల ఆగ్రహాన్ని చవిచూశారని వారు తెలిపారు. కర్నూలు రాజధానిగా చేసిన తర్వాత కూడా గుడారాల్లో పాలన సాగించిన సందర్భంలో అక్కడి రాజధానిని తరలించే వరకూ వారు నిద్ర పోలేదు. ఇప్పుడు హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేశామంటూ వింత వాదనలను వినిపిస్తూ హైదరాబాద్ కోసం పావులు కదుపుతున్నారని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

నాలుగు శతాబ్దాల సుదీర్ఘ చరివూతతో పాటు వివిధ మతాల సామరస్య కేంద్రంగా, చారివూతక వారసత్వ సంపద పుణికిపుచ్చుకున్న హైదరాబాద్ తెలంగాణ ప్రాంత గుండె కాయ వంటిదని తెలిసి కూడా దీనిపై మమకారం వదలుకోలేక పోవడం, చివరికి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంత మంటూ వింత ప్రతిపాదనలు చేసి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కు అడ్డుపడడం వారి వ్యూహంగా తెలుస్తోందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకుని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ సాధించే వరకూ పోరాటం అపేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.

SOURCE FROM TNEWS

Related posts:

  1. తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్‌ నేతలు
  2. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
  3. తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
  4. తెలంగాణ వ్యతిరేకులకు వైద్యం చేయం – కలిసి రాని నేతలు కాటికి పోయినోళ్లతో సమానం – కక్షసాధింపులకు దిగితే అత్యవసర సేవలూ ఆపేస్తాం
  5. నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం

Tags:

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


8 − = seven



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.