రగులుతున్న తెలంగాణ – 50 బస్సుల అద్దాలు ధ్వంసం.. నకిరేకల్ సీఐ తలకు గాయాలు – శాంతియుత ఉద్యమంలో సీమాంధ్రుల చిచ్చు
ప్రశాంతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో సీమాంవూధులు చిచ్చు రేపారు. ఇరవై రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించిన ప్రైవేటు బస్సులను ఉద్దేశపూర్వకంగా తెలంగాణవాదులను రెచ్చగొ పట్టపగలు నడిపిస్తున్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరుగుతున్న విషయం తెలిసి కూడా సీమాంవూధుల ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులను నడుపుతున్నారు. సోమవారం నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం కొత్తగూడెం నుంచి రామాపురం క్రాస్‌రోడ్డు వరకు తొమ్మిదవ నెంబర్ జాతీయ రహదారిపై వివిధ సంఘాలు అందోళన కార్యక్షికమాలు చేపడుతున్నారు. కోదాడ బైపాస్‌రోడ్డులోని అయ్యప్పస్వామి టెంపుల్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తుండగా అప్పుడే ప్రైవేటు బస్సులు అటు నుంచి వస్తుండటంతో వాటిని అడ్డుకున్నారు. పోలీసులు తెలంగాణవాదులను మూక్ముమ్మడిగా అరెస్టు చేసి అక్కడ నుంచి బస్సులు హైదరాబాద్ వైపుకు పంపించారు.
జేఏసీ నేతల అరెస్టు విషయం తెలుసుకున్న తెలంగాణవాదులు కొమరబండ, ఆకుపాముల, మునగాల వద్ద రాస్తారోకోకు దిగారు. పోలీసు సెక్యూరిటీతో అక్కడకు వచ్చిన బస్సులపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె జరుగుతున్న ఈ సందర్భంలో ఎందుకు బస్సులు నడుపుతున్నారని ప్రశ్నించడంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. దీంతో అగ్రహించిన తెలంగాణవాదులు బస్సులపై రాళ్లు రువ్వడంతో ఎనిమిది బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కేవలం డ్రైవర్‌పై అగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణవాదులు బస్సు ముందు అద్దాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులపై పోలీసు లాఠీచార్జిపై మీడియాలో ప్రచారం కావడంతో తెలంగాణవాదులు పెద్ద ఎత్తున సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రాస్తారోకో చేస్తున్న తెలంగాణవాదులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
అగ్రహించిన తెలంగాణవాదులు సూర్యాపేటలో ఐదు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. పదిమంది తెలంగాణవాదులను అరెస్టు చేశారు. నకిరేకల్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు భారీ ఎత్తున జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రక్షణలో ప్రైవేటు బస్సులు రావడంతో రాస్తారోకో చేస్తున్న తెలంగాణవాదులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో అగ్రహించిన తెలంగాణవాదులు పోలీసుల రక్షణలో వస్తున్న ప్రైవేటు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఉద్యమకారులు పోలీసు జీపుపై రాళ్లు రువ్వడంతో పోలీసుల జీపు అద్దాలు ధ్వంసం అయ్యాయి. జీపులో ఉన్న నకిరేకల్ సీఐ విశ్వవూపసాద్‌కు తలకు గాయం అయ్యింది. దీంతో ఉద్యమ కారులను చెదరకొట్టారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు సుధాకర్, టీటీజేఏసీ నాయకులు అంజయ్యలతో పాటు మరో పదిమందిని అరెస్టు చేశారు.
పోలీసులు సుమారు 15 జీపుల్లో ప్రైవేటు బస్సులకు రక్షణగా ఉంటూ హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. కోదాడ నుంచి నకిరేకల్ వరకు పోలీసులు లాఠీచార్జి చేసుకుంటూ ప్రైవేటు బస్సులకు రక్షణ ఉంటూ నడిపిస్తున్న విషయం ప్రచారం కావడంతో చౌటుప్పల్ వద్ద భారీ ఎత్తున తెలంగాణవాదులు మోహరించి ప్రైవేటు బస్సులను అడ్డకున్నారు. అక్కడ మరో పది బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అడ్డుకున్న మరో 20 మంది ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు రక్షణలో ప్రైవేటు బస్సులను హైదరాబాద్‌కు తరలించారు.
source from namastetelangana
Related posts:
- 30న తెలంగాణ బంద్
- వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- కేయూ జేఏసీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాల – ములుగురోడ్ జంక్షన్‌లో రాస్తారోకో
- సింగరేణి కార్మికులపై నిర్బంధం ఆపండి- సింగరేణి కార్మికులకు మద్దతుగా యాత్ర – టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన తెలంగాణ అఖిలపక్షం –
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.