తెలంగాణ కోసం కదం తొక్కిన మహిళలు
గణపురం: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మేము సైతం అంటూ సుమారు రెండు వేల మంది మహిళలు రోడ్డెక్కారు. శుక్రవారం స్వర్ణభారతి మహిళా సమాఖ్యకు చెందిన 200 సంఘాల సభ్యులు బోనాలను నెత్తిన పెట్టి బతుకమ్మ పాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా దేవాలయం నుండి పెట్రోల్ బంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎన్‌టీఆర్ విగ్రహం సమీపంలో మానవహారం ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే పిండి వంటలు చేసి పిల్లలకు పంపిణీ చేశారు. మహిళలు నృత్యాలతో హెరెత్తించారు.
చిన్నారులు తెలంగాణ తల్లి వేషధారణతో అలరించారు. ర్యాలీతో సుమారు రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. కొందరు మహిళలు నెత్తిపై బోనం పెట్టుకొని నృత్యం చేయడం అందరిని ఆకర్షించింది. అనంతరం మహిళా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ఉధృతం చేస్తామని, తెలంగాణ సాధన కోసం కలిసి రాని నేతలను గ్రామాల్లోకి రానివ్వమని ప్రతిన బూనారు. మహిళలు ఒక్కసారిగా మండల కేంద్రానికి తరలిరావడంతో బతుకమ్మ పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సిబ్బంది ఎపిఎం రవిందర్, బాబా, హిమామ్, అయిలయ్య, సహదేవ్, జ్యోతి, 34 గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, 400 సంఘాల సభ్యులు, సీఏలు తదితరులు పాల్గొన్నారు.
Related posts:
- తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దం..
- వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ
- తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.