బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ

| September 7, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెరలేచింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక నగారా మోగింది. టీడీపీ మాజీ నేత పోచారం శ్రీనివాస్‌డ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి అక్టోబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. బాన్సువాడతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఓ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. బాన్సువాడ ఉప ఎన్నిక కోసం ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 26 తేదీ వరకు నామినేషన్‌లను స్వీకరించనున్నారు. 27న ఎన్నికల అధికారులు నామినేషన్‌లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 ఆఖరి గడువు. అక్టోబర్ 13న ఉప ఎన్నిక జరుగనుంది.

17వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడిస్తారు. ఈవీఎంలతో ఈ ఎన్నికను నిర్వహించనున్నారు. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మోసపూరిత రెండు కళ్ల్ల వైఖరిని అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే పునాదిగా అవతరించిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు వేలాదిమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంట నడిచారు. బాన్సువాడ ఉపఎన్నికలో పోచారం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా, తెలంగాణ వాదమే ప్రధాన ఎజెండాగా పోటీ చేయనున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రజావూపతినిధులంతా రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రముఖంగా తెరపైకి వచ్చిన తరుణంలో జరుగునున్న ఈ ఉప ఎన్నిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ కోసం పదవులుకు రాజీనామా చేసిన నేతలను భుజాలపై ఎత్తుకొని ఘనవిజయం అందిస్తామని ప్రజలు ముక్తకం చెబుతున్నారు.

అయినా కాంగ్రెస్, టీడీపీ నేతలు రాజీనామాలకు సిద్ధపడటం లేదు. పదవులు పట్టుకొని వేలాడుతున్నారు. తెలంగాణ కోసం వందమందికి పైగా ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను స్పీకర్ మూకుమ్మడిగా తిరస్కరించడంతో మళ్లీ రాజీనామా చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు ముందుకు రాకపోవడంపై తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం పదవిని, మోసపూరిత విధానాన్ని అనుసరిస్తున్న సీమాంధ్ర పార్టీని వీడిన పోచారానికి ఈ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చే అపూర్వ విజయంతో.. రాజీనామాలు చేయని నేతల తీరులో మార్పు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసిన 12 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మరథం పట్టారు. పోచారం విషయంలో అదే విజయం పునరావృతమవుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి.

source from Namste Telangana

Related posts:

  1. 13న రాజీనామా చేయనున్న కొండా సురేఖ
  2. ‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’
  3. సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి – ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం – రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
  4. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
  5. ఉద్యమం ఎప్పుడైనా భగ్గుమంటది: కోదండరాం

Tags:

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


3 × = fifteen



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


car rental services warangal, kazipet, hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.