తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని పాలకుర్తి ఎమ్మెల్యే, టిటి డిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి స్పష్టం చేశారు. శుక్రవారం పాలకుర్తిలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టిటిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా జరిగింది. దీక్షా శిభిరానికి మహిళలు బోనాలు, బతుకమ్మలతో హిందు యక్షగానం, గాయని మధుప్రియ కళా ప్రదర్శనతో తెలంగాణ ప్రజల సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమ్రోగింది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలకు చిత్తశుద్ది లేదని, ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల కెసిఆర్‌కు చిత్తశుద్ది ఉంటే ఈ నెల 28న ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి అసెంబ్లీకి రావాలని, తాము కూడా అదే రోజు రాజీనామాలతో అసెంబ్లీకి రావడానికి సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
సకలజనుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి తీసుకువచ్చిన తాము ముందుండి పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ది, తెలంగాణ ప్రాంత అభివృద్ది కోసం తాను అహర్నిషలు కృషి చేస్తానని, తెలంగాణ పట్ల తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కలిసి వచ్చే గద్దర్, విమలక్కలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి గోదావరి జలాల ద్వారా నీరు అందిస్తానని, ఈ ప్రాంతానికి గోధావరి జలాలు రావడానికి తాను ఎంతో కృషి చేశానని అన్నారు.
Related posts:
- తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
- వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.