సీమాంధ్రుల కుట్రలకు తలొగ్గుతున్న కేంద్రం – పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి – అవినీతి నల్లధనంను వెలికి తీయాలి – అధిక ధరలను తగ్గించాలి
సీమాంధ్ర నాయకుల కుట్రలకు తలొగ్గి కేంద్రం తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తోందని సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు టి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ చేపట్టిన 24గంటల దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలి విడత ఉద్యమంలో 700 మందికిపైగా అమరులయ్యా న్నారు.
గత 39 రోజులుగా సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సకల జనుల సమ్మె జరుగుతోన్న కేంద్రం స్పందించకపోవడంపై ద్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని అడిగిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కేసులు పెట్టడం అమానుషమైన చర్యన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులకు అనుకూలమని ప్రణబ్‌కమిటీకి లేఖ ఇచ్చారని, అయిన సంప్రదింపులు, చర్చలు, కమిటీలపేరు తెలంగాణ ఏర్పాటు జాప్యం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
తెలంగాణ ఇవ్వమంటే కేంద్రంలోఉన్న సోనియాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్రబలగాలను పంపిందని వెంకట్రాములు మండిపడ్డారు. ఇప్పటికైన కేంద్రం వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించుకోవడానికి ఎలాంటి త్యాగాలకైన సిద్ధమేనని అన్నారు.
-విదేశాల్లోన్ని నల్లధనాన్ని వెలికితీయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్‌రావు
విదేశాల్లోని స్విస్‌బ్యాంకుల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని వెంటనే వెలికితీయాలని సీపీఐ దేశవ్యాప్త ఉద్యమం చేస్తోందన్నారు. దేశంలోఉన్న అవినీతిని బయటపెట్టేందుకు, ఎంతటివారినైనా విచారించడం కోసం పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును వెంటనే తీసుకరావాలని డిమాండ్ చేశారు.
ఒక వైపున నిత్యవసర వస్తువులు సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితిలేదన్నారు. వెంటనే పెగిరిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలన్నారు. ప్రజలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు సమరశీల పోరాటలకు సన్నద్ధం కావాలని శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు.
-సాయుధపోరాట స్పూర్తితో ఉద్యమించాలి: మడత కాళిదాసు, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి
ప్రజలు నాటి తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో ఉందమించాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షపోరాటంలోకి రావాలన్నారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులను అడ్డుకోవాలని కాళిదాసు పిలుపునిచ్చారు.
ఈ దీక్షలలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, జిల్లా సమితి నాయకులు టి.సత్యం, మోతె లింగారెడ్డి, ఎస్.కరుణాకర్, మేకల రవి, సదా క్ష్మి, జంపాల రవీందర్, అక్కపల్లి రమేశ్, వీరగంటి సదానందం, ఐత సదానందం, నాయకులు జన్ను మేశ్, బాలనర్సయ్య, శ్రీవిద్య, సుగుణ, పుష్ప, మల్లయ్యలతోపాటు సుమారు ఐదు వందల సీపీఐ కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు.
source from namaste telangana
Related posts:
- ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
- మందకృష్ణ సీఎంకు కాపలా కుక్క-తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఈదురు వెంకన్న
- వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
- తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే
- రగులుతున్న తెలంగాణ – 50 బస్సుల అద్దాలు ధ్వంసం.. నకిరేకల్ సీఐ తలకు గాయాలు – శాంతియుత ఉద్యమంలో సీమాంధ్రుల చిచ్చు
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.