సమ్మె ఆగే ప్రసక్తే లేదు – శాంతియుతంగానే ఉద్యమాన్ని కొనసాగిస్తాం – పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు..దయచేసి జాప్యం వద్దు – తెలంగాణను ప్రకటించండి

| October 3, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

‘శాంతి అహింసలకు మారుపేరయిన మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ నుంచి ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగులను సమ్మె విరమణ చేయమని కోరడానికి బదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయండి. ఇంకెంత కాలం సంప్రతింపులు జరుపుతారు. ప్రణబ్ ముఖర్జీ, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఆజాద్ నివేదిక ఇలా ఇంకెన్ని కమిటీలు కావాలి. తెలంగాణ ప్రజలు ఇంకెంత కాలం వేచి ఉండాలి. ఇది తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించడం కాదా? ఇంకెంత కాలం సాగతీస్తారు. గత పదకొండున్నర సంవత్సరాల ఉద్యమంలో ఎక్కడా హింస జరగలేదు. అదే పద్ధతిన అహింసా మార్గాన ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రాజ్‌ఘాట్ నుంచి ఇదే సందేశాన్ని ప్రజలందరికి తెలియజేస్తున్నాం. ఉద్యమాన్ని అహింసా మార్గాన ప్రజా స్వామ్యబద్ధంగా శాంతియుతంగా కొనసాగిస్తాం. ఇక సమయాన్ని వృధా చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సత్వరమే ప్రకటించాలని ప్రధానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద ఆదివారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, జేఏసీ భాగస్వామ్య పక్షాల నేతలు ఆదివారం రెండు గంటల మౌన దీక్ష జరిపారు. ఇటీవల జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం సంఘ సేవకుడు అన్నా హజారే రాజ్‌ఘాట్‌లో చేసిన దీక్షను తలపునకు తెస్తూ ఢిల్లీలో కేసీఆర్, జేఏసీ నేతలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిపిన మౌనదీక్ష జాతీయ స్థాయిలో అందరి దృష్టిని మరల్చింది. దీక్ష ముగించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమిస్తున్నది. సకల జనుల సమ్మె 20వ రోజుకు చేరింది. బస్సులు నడవడం లేదు. స్కూళ్లు బంద్ అయ్యాయి. పాలన స్తంభించినా ఇంకెంత కాలం కేంద్రం ప్రేక్షక పాత్ర హిస్తుంది. మా లక్ష్యం నెర వేరేదాకా సమ్మెను కొనసాగిస్తాం’’ అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

source from namaste telangana

Related posts:

  1. ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
  2. తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్‌ నేతలు
  3. నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
  4. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా? – సర్కారుకు గద్దర్ సవాల్
  5. వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి

Tags:

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


four + = 6



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.