తెలంగాణా వచ్చేవరకు ఆందోళనలు ఆగవు
సకల జనుల సమ్మె రోజు రోజుకు విస్తరిస్తుంది. 11వ రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా ర్యాలీలు ప్రదర్శనలు, బైకుల ర్యాలీలు జరిగాయి. ఖమ్మం పట్టణంలో తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సర్వీసు సంఘం జిల్లా ర్యాలీని ఫెవిలియన్ గ్రౌండ్ నుంచి బయులుదేరి కలెక్టర్ కార్యలయం వరకు పాదయాత్ర నిర్వహించి మైనార్టీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ రోజు దీక్ష శిబిరాన్ని జెఎసి ఛైర్మన్ కూరపాటి రంగరాజు ప్రారంభించారు. మైనార్టి జిల్లా నాయకుడు యండి జహిరలీ మాట్లాడుతూ శాంతి యుతంగా నడుస్తున్న ఉద్యమని కేంద్ర ప్రభుత్వం మరిశీలించాలని ఉద్యమం హింసమార్గంలో నడిస్తేనే తెలంగాణ ఇస్తామంటే మేము ఆత్మహుతి దళాలుగా ఏర్పాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మహ్మాద్ ఇలియాస్, నయిమ్, అబ్జల్‌మియా, ముజాయిద్ , డాక్టర్ ఆజీన్, మహ్మాద్‌ఖాసిం, యండి హసన్ జిల్లా సెక్రటరీ, తది తరులు పాల్గొన్నారు. దీక్షలో 25 మంది మైనార్టీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో కూర్చొని తెలం గాణ రాష్ర్టం ఏర్పడే వరకు సకల జనుల సమ్మెలో ఉంటామని తెలిపారు.
గ్రానేటు యాజమానుల సంఘం ఆధ్వర్యంలో…
సకల జనుల సమ్మెకు మద్దతుగా సంఘీభావంగా ఈ రోజు గ్రానే టు పరిశ్రమలలో పని చేసే కార్మికులు, యాజమానులు భారీ ర్యాలీ ని నిర్వహించారు. ఈ ర్యాలీని జెఎసి ఛైర్మన్ కూరపాటి రంగరాజు ప్రారంబిచారు. అనంతరం ర్యాలీ ఫెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యయం ఎదురు వరకు డప్పులు, వాద్యలు, కళాకారులతో వైరా రోడ్డు సందడిగా వచ్చి దీక్ష శిబిరం వద్దకు చేరారు. ఈ ర్యాలీ నుద్దే శించి జిల్లా గ్రానైట్ యాజమానుల సంఘం నాయుకులు రాయల నాగేశ్వరావు మాటాడుతూ తెలంగాణ రాష్ర్టం కోసం సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులను ఆదుకుంటాం మీ పరిశ్రమ మీకు పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు.
పంక్షన్ ఆర్గనైజర్ టెంట్‌హౌజ్ అసోషియన్ ఆధ్వర్యంలో…
పట్టణ టెంట్ హౌజ్ అసోసియేషన్ బంద్ పాటించి ర్యాలీగా ఫెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యలయం వరకు వచ్చి సకల జనుల సమ్మెకు ఉద్యోగులకు మేము అండగా ఉంటామని తెలిపా రు. తెలంగాణ రాష్ర్టం వచ్చే వరకు అందరం కలిసి పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్, కార్యదర్శి పాషా, పట్టణ అధ్యక్ష కార్యదర్శి పాపరావు, కార్యదర్శి మాధవరావు తదితరులు పాల్గొనానరు. ఆంధ్రా వారికి టెంట్‌హౌజ్ సమాను అద్దెకు ఇవ్వమని తెలిపారు.
స్ర్తీ-శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…
ఐసిడిఎస్ శాఖలో పనిచేయుచున్న అంగన్ వాడి కార్యకర్తలు , సూపర్‌వైజర్ల్ ఉద్యోగులు, బారీ ర్యాలీని నిర్వహించారు. ఫెవిలియన్ గ్రౌండ్‌లో ఈ ర్యాలీని ఛైర్మన్ కూరపాటి రంగరాజు జెండా ఊపిప్రారంభించారు. అనంతరం ర్యాలీ కలెక్టర్ కార్యలయం దీక్ష శిబిరం వరకు చేరింది. ఈ దీక్ష శిబిరంలో ఎఐటియుసి కార్యదర్శి సింగు నర్సింహరావు మాట్లాడినారు. అంగన్‌వాడి కార్యకర్తలందరు సకల జనుల సమ్మెలో పాల్గొన్నాలని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. స్ర్తీ-శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల అధ్యక్షులు నాగార్జున, టిఎన్‌జిఒఎస్ మహిళ విభాగం నాయకులు సరస్వతి , వాణిలు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగుల ర్యాలీ…
ఖమ్మం మున్సిపాలిటీఆలో కింది స్దాయి ఉద్యోగి నుండి పై స్దాయి ఉద్యోగి వరకు సుమారు 500 మంది ఉద్యొగులు మున్సిపాలిటి నుండి బయలుదేరి ఖమ్మం కలెక్టర్ కార్యలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలిని ఉదయం జెఎసి ఛైర్మన్ కూరపాటి రంగరాజు ప్రారంభించారు. ఈ ర్యాలీలో రామచంద్రరావు, కూరపాటి శ్రీనివాసు, కందూకూరి లాలు, వినయ్‌కుమార్, కె రాము మున్సిపల్ టిఎన్‌జిఒఎస్ నాయకులు మున్సిపాలిటి4 ఆర్‌జె సత్యనారాయణ పాల్గొన్నారు. నాల్గవ తరగతి ఉద్యొగుల సంఘం అథ్యక్షుల కొడి లింగయ్య, దీక్ష శిబిరంలో కూర్చున్న వారిని సంఘీభావం తెలిపారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో…
వ్యవసాయశాఖ ఆద్వర్యంలో ఆదర్శ రైతులు అన్ని క్యాడర్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీని జెడి ఆఫీసులో నుండి జెఎసి ఛైర్మన్ రంగరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో వ్యవసాయ శాఖ జిల్లా నాయకులు విడి శంకరయ్య, సీతరాంరెడ్డి, స్రసంగి కె వెంకటేశ్వరరావు, జి సత్యనారాయణ, అచ్చయ్య, ఎన్‌విఆర్ భాస్కర్ రావు, రిటైర్డు ఉద్యోగి టిఎన్‌జిఒ ఎస్ జిల్లా ఉపాధ్యాయులు బాల కృష్ణ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వొంగర వెంకటేశ్వర్లు వ్యవసాయ విస్తరణ అధికా రులు సంఘ జిల్లా అధ్యక్షుడు జి. సత్యనారాయణ, జెడిఎ మినిస్టీరి మ్ సిబ్బంది, ఉద్యానవన శాఖ అధికారి మరియన్న డిషరిస్ సిబ్బం ది ఎపియంఐపి ఆఫీసు సిబ్బంది, ఆదర్శ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, అధ్యక్షుడు సామినేని రాము, కార్యదర్శి బాస్క ర్, దామోదర్‌రెడ్డి, చంద్రాశేఖర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో…
స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి పట్టణ అధ్యక్షుడు వెగ్గళం శ్రీనివాసరావు, కె.పద్మాచారి కె వరప్రసాద్, నరేశ్, ఎస్ వి భద్రం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా న్యూడెమోక్రసి కార్యదర్శి పోటు రంగారావు, సాధినేని వెంకటేశ్వర్ఱావు, సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంత రావు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజెందర్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సింగు నర్సింగరావు, జెఎసి కో-కన్వీనర్ కూరపాటి రంగరాజు తదితరులు ప్రసంగించారు.
Related posts:
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- నేటి నుంచి ప్రైవేటు పాఠశాలల నిరవధిక బంద్, నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్
- తెగించి పోరాడుతాం
- వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
- కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.