నిర్బంధ విధినిర్వహణకు విఫలయత్నం, ఖనిలో కార్మికులను బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు, 6వ రోజు వేడెక్కిన సింగరేణి సమ్మె, ఖాకీగని..సింగరేణి

| September 19, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

Police01-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం, రాష్ట్రంలో అంధకారం సృష్టించి…తెలంగాణకు విముక్తి ప్రసాదించేందుకు మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం రెండో అస్త్రాన్ని ప్రయోగించింది. తొలి అస్త్రంగా ప్రయోగించిన కుట్రపవూతాలను దహనం చేయడంతో ఖాకీలను రంగంలోకి దింపింది. కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించినా బలవంతంగా పనులు చేయించేందుకు చేసిన ప్రయత్నాలను సంఘాలు తిప్పికొట్టాయి. శనివారం రాత్రి జరిగిన ఈ కుట్రలను కార్మికులు ఐక్యంగా బద్దలుకొట్టారు. అంకిత భావంతో సమ్మెచేస్తున్న కార్మికులకు సంఘీభావం ప్రకటించేందుకు రెండు రోజుల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సింగరేణికి రానున్నారు.

కేసీఆర్ రాకతో నల్లనేల మరింత వేడెక్కుతుందని కార్మికులు భావిస్తున్నారు. రాజకీయ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, హైదరాబాద్ నుంచి 20 మంది లాయర్ల బృందం కూడా సోమవారం గోదావరిఖనికి వస్తున్నారు. సమ్మె రోజు రోజుకు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా సింగరేణిలో ఉధృతమవుతూ రాజుకుంటూనే ఉంది. ఆరో రోజు సింగరేణిలోని 14 ఓసీలలో 36 భూగర్భ గనులలో సమ్మె కొనసాగింది. 65 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె వల్ల సింగరేణికి ఇప్పటికే 150 కోట్ల ఉత్పత్తికి విఘాతం కలిగింది. కార్మికులు సుమారు 50 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోయారు. సోమగూడెంలో కరపవూతాలను దహనం చేసిన పలువురు కార్మికులపై కేసులు నమోదు చేశారు.

కుట్రను తిప్పికొట్టిన కార్మికులు
గోదావరిఖనిలో శనివారం అర్ధరాత్రి 60 మంది కార్మికులను నాలుగు ఓపెన్‌కాస్టు గనులకు తీసుకెళ్లి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. పని చేసేది లేదని, తాము సమ్మెలో ఉన్నామని తెగేసి చెప్పి మరీ వాపస్ వచ్చేశారు. వీరికి అండగా జేఏసీ, వివిధ కార్మిక సంఘాల నేతలు నిలబడ్డారు. నలుగురు జేఏసీ, టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్ నేతలను కూ డా పోలీసులు అరెస్టు చేసి ఆదివారం తెల్లవారుజామున విడిచిపెట్టారు. పోలీసుల డేగకన్ను ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో కొనసాగుతోం ది. కార్మికుల కోసం ఇండ్ల చుట్టు తిరుగుతూ వారు ఎక్కడ కనబడితే అక్కడ వారిని విధులకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్జీ 1 సీఎస్పీ వద్ద రైల్వే వ్యాగన్లను టెరక్స్‌తో బొగ్గును నింపేందుకు ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు.

అన్ని బాయిల మీద పోలీసుల నిర్బంధానికి వ్యతిరేకంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. సీఎస్పీ రెండు వద్ద పని చేయడానికి తీసుకెళ్లినటువంటి కార్మికులను కుటుంబాలతో సహా వెళ్లి యూనియన్ నాయకులు విడిపించి తీసుకొచ్చారు. మొత్తానికి నిర్బంధం ప్రయోగం చేసి బెదిరించి వారి తో పని చేయిద్దామని పోలీసులు చేసిన ప్రయ త్నం అన్ని చోట్లా విఫలమైంది. శ్రీరాంపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అటు భూపాలపల్లి, బెల్లంపల్లి, రామక్షికిష్ణాపూర్, తాండూరు, ఇల్లందు, మణుగూరులలోనూ కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పోలీసుల, యాజమాన్యం విధానాలకు వ్యతిరేకంగా సోమవారం సింగరేణి అంతటా ర్యాలీలు నిర్వహించాలని, రోడ్డు దిగ్భంద కార్యక్షికమాల్లోనూ పాల్గొనాలని సింగరేణి జేఏసీ పిలుపునిచ్చింది.

ఆదివారమూ అదే వరుస..
Police0-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఆదివారం ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలలో, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు మణుగూరు ఏరియాలలో వారాంతపు సెలవు దినం అయినప్పటికీ యాజమాన్యం ఓపెన్ కాస్టు గనులలో కార్మికులను దింపే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తిప్పి కొట్టారు. పోలీసులు, సింగరేణి అధికారులు ఎంత శ్రమించినప్పటికీ ఓసీలలో కేవలం ఉత్పత్తితో సంబంధం లేని రెండు శాతం కార్మికులు మాత్రమే హాజరయ్యారు. ఇల్లెందు, కొత్తగూడెం భూగర్భ గనుల్లో, సీహెచ్‌పీల్లో సమ్మె సంపూర్ణంగా జరుగుతోంది. కొత్తగూడెం జీకే ఓసీలో నిబంధనలకు విరుద్ధంగా ఓసీల్లో తిరిగే డంపర్ల్లను ప్రధాన రహదారులపై తిప్పుతూ బొగ్గు రవాణా చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ, సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో ఆనందఖని క్రాస్ రోడ్డు వద్ద జీకే ఓసీకి వెళ్లే జాతీయ రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. విధులకు వెళ్లే కార్మికుల జాబితాను సేకరించిన రుద్రంపూర్ జేఏసీ, కార్మిక సంఘాల నాయకులు ఆ ఆపరేటర్ల ఇళ్ల ఎదుట బైఠాయించారు.

కుటుంబసభ్యుల కాళ్లు మొక్కి సమ్మెను విచ్ఛిన్నం చేయవద్దని, తెలంగాణ వచ్చేవరకు సమ్మె కొనసాగించాలని కోరారు. కార్యక్షికమంలో జేఏసీ నాయకులు కంచర్ల చంద్రశేఖర్, జీవీకే మనోహర్, మేరెడ్డి జనార్దన్‌డ్డి, సాబీర్‌పాష, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు లట్టి జగన్‌మోహన్, శరభలింగం, నరేంవూదబాబు, విశ్వనాధం, సూరిబాబు, సుదర్శన్‌డ్డి, గుత్తుల సత్యనారాయణ, గూడెళ్లి యాకయ్య, షబ్బీర్, మున్వర్, అన్వర్, కొంకటి కృష్ణ, బావు సతీష్, సందీప్, షరీఫ్, కుమార్ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో తిరగాల్సిన డంపర్లను ఓసీ నుంచి ప్రధాన రహదారుల మీదుగా బొగ్గు రవాణాకు ఉపయోగించడాన్ని జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. డంపర్లను నిలుపుచేయాలని రాస్తారోకో చేశారు. రవాణాశాఖ అధికారులతో మాట్లాడి స్పీకర్ ఫోన్ల ద్వారా మైకులో వినిపించారు. డంపర్లు అనుమతి లేకుండా మెయిన్ రోడ్లపై తిరగరాదని రవాణా శాఖాధికారులు స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా తిరుగుతున్న డంపర్లను సీజ్ చేయాలని కొత్తగూడెం డీఎస్పీకి దేవదాస్ నాగుల్‌కు ఫిర్యాదు చేశారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, తదితరులతోపాటు టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, చంద్రయ్య, బంటు సారయ్య, సంపత్, హెచ్‌ఎంఎస్ నాయకుడు రహీం, ఓజియర్, రాజిడ్డి, కేశవడ్డి, ఐఎఫ్‌టీయూ నాయకుడు టీ శ్రీనివాస్, సంపత్ కుమార్, జాఫర్, దాస్, చాంద్‌పాషా, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు వై గట్టయ్య, వీరభవూదయ్య, మల్లాడ్డి, గోపు సారయ్య, ఐఎన్టీయూసీ నాయకులు డీ అన్నయ్య, కాశీరావు, మహిపాల్ రెడ్డి, కాంపెల్లి సమ్మయ్య, తదితరులు సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నీరేటి రాజయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు పులి రాజిడ్డి, ఆదిరాం నర్సయ్య, తదితరులు వివిధ కార్యక్షికమాల్లో పాలుపంచుకున్నారు.

వ్యూహ రచనలో సంఘాల నేతలు
కొత్తగూడెం రీజియన్‌లో సమ్మెను ఉధృతం చేయడం కోసం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిడ్డి సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, గౌరవ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో సమ్మెను ఉధృతం చేయడం కోసం కార్మిక వర్గంతో మంచిర్యాల ఎమ్మెల్యే జీ అరవింద రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌లు మందమపూరిలో సమ్మెను ఉధృతం చేయడం కోసం ఏఐటీయూసీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. బెల్లంపల్లిలో కార్మిక సంఘాల జేఏసీలు సమావేశమమై సమ్మెను ఉధృతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి.

విద్యుత్‌కష్టాలు యథాతధం
ఎన్టీపీసీ, వీటీపీఎస్, కేటీపీఎస్‌లలో విద్యుత్‌కష్టాలు బొగ్గు కొరత వల్ల యథాతధంగానే ఉన్నాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం కోసం ఎన్టీపీసీ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కోలిండియాలోని సబ్సీడరీల నుంచి కూడా బొగ్గు దిగుమతికి ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిని అడ్డుకోవడం కోసం కార్మిక నాయకులు సిద్ధమవుతున్నారు. మరోవైపు దక్షిణ భారతదేశంలోని నాలుగు వేల చిన్న, పెద్ద పరిక్షిశమలలో మూడు వేల పైచిలుకు పరిక్షిశమలపైన ఆదివారం నాటికి ప్రభావం 70 శాతం వరకు పడ్డట్టు సమాచారం. లక్షలాది మందికి దీని వల్ల ఉపాధి తాత్కాలికంగా కోల్పోయే పరిస్థితి ఉంది. కొన్ని పరిక్షిశమలకు లే ఆఫ్ ఇచ్చినట్లు కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సింగరేణి సమ్మె సెగ అటు ఢిల్లీ పీఠానికే కాదు పారిక్షిశామిక వేత్తలను కూడా తాకింది.

Source from Namaste Telangana

Related posts:

  1. సింగరేణి కార్మికులపై నిర్బంధం ఆపండి- సింగరేణి కార్మికులకు మద్దతుగా యాత్ర – టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన తెలంగాణ అఖిలపక్షం –
  2. సమ్మతో సత్తా చాటిన తెలంగాణ బంద్ – తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు – లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి – ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు –
  3. తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
  4. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్

Tags: , kakigani singareni, singarene employees, singarene employees 6th day samme

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


seven × 6 =



Recent Posts



Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Free Blood Donors Hyderabad, warangal
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.