పయ్య కదలదు.. తొవ్వ సాగదు, సీమాంధ్ర దారులన్నీ క్లోజ్, నేడు, రేపు క్యాబ్స్ కూడా బంద్, సకలం దిగ్బంధం
తెలంగాణ పోరు రహదారులపై పరుగుపూత్తుతోంది. మరో చారివూతక సన్నివేశానికి తెర లేపుతోంది. తెలంగాణ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయడానికి సకల జనులు సమర శంఖం పూరించారు. ఉత్తర,దక్షిణాది రాష్ట్రాల మధ్య రాకపోకలను పూర్తిగా స్తంభించి వేసేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణకు దారితీసే సీమాంధ్ర దారులన్నీ మూత పడనున్నాయి. సకల జనుల సమ్మె పతాక స్థాయికి చేరుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జరుగుతున్న సకల జనుల సమ్మె సోమవారం నుంచి ఉధృత రూపం దాల్చనుంది. గత వారంరోజులుగా సాగుతున్న సమ్మె సోమవారం నుంచి కీలక ఘట్టానికి చేరుకోనుంది. రహదారుల దిగ్బంధానికి రాజకీయ జేఏసీ పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రాంతానికి దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోనున్నాయి.
రహదారుల దిగ్బంధనాన్ని సక్సెస్ చేయడానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు, బీజేపీ, న్యూడెమోక్షికసీ నాయకులు తమ కేడర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఉత్తర- దక్షిణ రాష్ట్రాలకు ప్రధాన ద్వారమైన ఆదిలాబాద్ శివారులోని పెన్‌గంగా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ వరకు ఉన్న కాశ్మీర్ టూ కన్యాకుమారి జాతీయ రహదారులను పూర్తిగా దిగ్బంధించడానికి సిద్ధమయ్యారు. ముంబై టూ కోదాడ జాతీయ రహదారి, నిజామాబాద్ టూ ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారి మొదలుకొని ఇతర దారులన్నీ మూతపడనున్నాయి. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వృత్తిసంఘాలు కదనరంగంలో దూకడంతో సమ్మె ఉధృతంగా మారింది. దీనికి సింగరేణి కార్మికులు తడాఖా చూపడంతో దక్షిణ భారత దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూత పడే స్థితికి చేరుకున్నాయి.
సకల జనుల సమ్మెను అణిచి వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు పన్నుతోంది. సింగరేణిలో పోలీసు దమనకాండకు నిరసనగా తెలంగాణలోని అన్ని జేఏసీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో తెలంగాణవ్యాప్తంగా 10వేల బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయి రవాణా వ్యవస్థ స్తంభించే పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ డిపోలన్నింటికి తాళాలు వేయనున్నారు. 23వ తేదీ అర్ధరాత్రి నుంచి 25వ తేదీ అర్ధరాత్రి వరకు 48గంటలపాటు తెలంగాణలోని ఆటోలన్నీ బంద్ కానున్నాయి. దీంతోపాటు ఆటో డ్రైవర్లు 24న, పదవులకు రాజీనామాలు చేయని ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి 25న మండల, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ఊరేగింపు, బహిరంగ సభను నిర్వహించనున్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ మోటార్ క్యాబ్స్ సోమ, మంగళవారాల్లో బంద్ పాటించనున్నాయి.
సోమవారం నుంచి విద్యుత్ జేఏసీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. విద్యుత్ బిల్లులు కట్టించుకోమని ఆ జేఏసీ ప్రకటించింది. సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ నిరవధికంగా మూత పడనున్నాయి. పాఠశాలల బంద్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయుల జేఏసీ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం పిలుపునిచ్చాయి. ఇంజనీరింగ్, వృత్తి కళాశాలలతో సహా తెలంగాణలోని అన్ని కాలేజీలు రెండు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను పొడిగించే అవకాశం కూడా ఉందని వారు ప్రకటించారు. జంట నగరాల శివార్లలో ఉన్న ప్రైవేట్ సంస్థలు, ఔషధ కంపెనీ కార్మికులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వల్ల ఇప్పటి వరకు రూ.5వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. తెలంగాణలో సకల జనుల సమ్మె ఉధృత రూపం దాల్చుతున్న సమయంలో ప్రభుత్వం ఈ ప్రాంతంలో పోలీసు బలగాలను భారీగా మోహరిస్తోంది.
ఎక్కడెక్కడ.. ఎవరెవరు
- ఆదిలాబాద్ జిల్లా భోరజ్-మాంవూడగడ: టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా జేఏసీ చైర్మన్ మామిడి నారాయణ, న్యూడెమొక్షికసి నేత నైనాల గోవర్ధన్
- మెదక్ జిల్లా జహీరాబాద్ సరిహద్దు : టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత టీ హరీష్‌రావు, ఎంపీ విజయశాంతి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌డ్డి
- నల్లగొండ,రంగాడ్డి సరిహద్దు కొత్తగూడ: రాజకీయ జేఏసీ చైర్మన్
కోదండరాం, పీవోడబ్ల్యు నేత సంధ్య, ఇతర స్థానిక నాయకులు
- నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి: బీజేపీ నాయకులు సీహెచ్ విద్యాసాగర్‌రావు, చింతా సాంబమూర్తి,స్థానిక నాయకులు
- ఎల్‌బీ నగర్ రహదారిపై: బీజేపీ నేతలు బండారు దత్తావూతేయ, వెంకట్‌డ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఇంచార్జీ కాచం సత్యనారాయణ
- మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చౌరస్తా : టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌డ్డి, నిరంజన్‌డ్డి, బీజేపీ నేతలు నాగూరావు నామాజీ, అశోక్‌కుమార్‌యాదవ్, న్యూడెమొక్షికసి నేతలు గోవర్ధన్, దివాకర్
- నల్లగొండ జిల్లా కోదాడ: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, దాస్యం వినయ్‌భాస్కర్, న్యూడెమొక్షికసి నేత సూర్యం
- ఆదిలాబాద్ జిల్లా వాంకిడి: ఎమ్మెల్యేలు గడ్డం అరవిందడ్డి,నల్లాల ఓదేలు
- నిజామాబాద్ జిల్లా సాలూర: మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌డ్డి, జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ, ఇతర స్థానిక నాయకులు
- నాగ్‌పూర్ రహదారిపై: బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, స్థానిక నాయకులు
source from NamasteTelangana
Related posts:
- నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
- తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
- సింగరేణి కార్మికులపై నిర్బంధం ఆపండి- సింగరేణి కార్మికులకు మద్దతుగా యాత్ర – టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన తెలంగాణ అఖిలపక్షం –
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.