కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! -ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం
-సమ్మెతో ఉద్యోగులు సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు
-ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
-టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్
యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ సంకుచితంగా వ్యవహరించడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతోందని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రత్యేక రాష్ట్రానికి బదులు తెలంగాణ ప్రాంతీ య మండలి ఏర్పాటు చేస్తుందనో, లేక విదర్భ, గుర్ఖాలాండ్ మాదిరిగా నిధుల ప్యాకేజీ ప్రకటిస్తారనేది కేవలం దుష్ర్పచారమేనని వాటిని నమ్మవద్దని చెప్పారు. తెలంగాణ ఇవ్వమని కేం ద్రం ఏనాడూ ప్రకటించకపోవడాన్ని గుర్తించాలని సూచించా రు. మంగళవారం వరంగల్‌లోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం లో పార్టీ ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఓట్లూ, సీట్లూ రావేమోననే భయంతోనే, కాంగ్రెస్ సం కుచితంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్మా కంటే పెద్ద చట్టం ప్రయోగించినా ఉద్యోగులు భయపడరని చెప్పారు. 13 నుంచి జరిగేది సమరశంఖారావమని అభివర్ణించారు. ఉద్యోగులు తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారని ప్రశంసించారు.
వారి మనసుల్లో ఉన్నది బాబు, జగన్‌లే
ఎర్రబెల్లి దయాకరరావు, కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి మనసుల్లో తెలంగాణ లేదని వినోద్‌కుమార్ ఆరోపించారు. ఎర్రబెల్లి మనసులో చంద్రబాబు, సురేఖ మనసులో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జెండాలు పక్కనబెట్టి ఎన్నికకు వెళ్లి తెలంగాణ కోసమే గెలిచామని నమ్మబలికి మళ్లీ చంద్రబాబు గూటికే పోయే వ్యక్తి ఎర్రబెల్లి అని విమర్శించారు. దమ్మూ, ధైర్యం ఉంటే చంద్రబాబు చేత తెలంగాణ ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతోన్న కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతికి తెలంగాణ మీద ప్రేమే ఉంటే జగన్‌తో స్పష్టమైన ప్రకటన చేయించాలి, లేదంటే జగన్ కోసమే రాజీనామా చేస్తున్నామని ధైర్యంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజీనామాలకు తెలంగాణ ముసుగు వేసుకోవద్దని వారికి హితవు పలికారు. జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జి.విజయరామారావు, చందూలాల్, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, ముత్తిడ్డి యాదగిరిడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండలపార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
source from Namaste Telangana
Related posts:
- 13న రాజీనామా చేయనున్న కొండా సురేఖ
- ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి – ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం – రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
- ‘గాలి’తో నాకు సంబంధం లేదు:జగన్
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.