You are here: Home » Telangana » News
Category: News
తెలంగాణ కోసం కదం తొక్కిన మహిళలు
గణపురం: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మేము సైతం అంటూ సుమారు రెండు వేల మంది మహిళలు రోడ్డెక్కారు. శుక్రవారం స్వర్ణభారతి మహిళా సమాఖ్యకు చెందిన 200 సంఘాల సభ్యులు బోనాలను నెత్తిన పెట్టి బతుకమ్మ పాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా దేవాలయం నుండి పెట్రోల్ బంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎన్‌టీఆర్ విగ్రహం సమీపంలో మానవహారం ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే పిండి వంటలు చేసి పిల్లలకు పంపిణీ చేశారు. మహిళలు నృత్యాలతో [...]
September 24, 2011 | More
తెలంగాణా వచ్చేవరకు ఆందోళనలు ఆగవు
సకల జనుల సమ్మె రోజు రోజుకు విస్తరిస్తుంది. 11వ రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా ర్యాలీలు ప్రదర్శనలు, బైకుల ర్యాలీలు జరిగాయి. ఖమ్మం పట్టణంలో తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సర్వీసు సంఘం జిల్లా ర్యాలీని ఫెవిలియన్ గ్రౌండ్ నుంచి బయులుదేరి కలెక్టర్ కార్యలయం వరకు పాదయాత్ర నిర్వహించి మైనార్టీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ రోజు దీక్ష శిబిరాన్ని జెఎసి ఛైర్మన్ కూరపాటి రంగరాజు ప్రారంభించారు. మైనార్టి జిల్లా నాయకుడు యండి జహిరలీ [...]
September 24, 2011 | More
తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని పాలకుర్తి ఎమ్మెల్యే, టిటి డిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి స్పష్టం చేశారు. శుక్రవారం పాలకుర్తిలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టిటిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా జరిగింది. దీక్షా శిభిరానికి మహిళలు బోనాలు, బతుకమ్మలతో హిందు యక్షగానం, గాయని మధుప్రియ కళా ప్రదర్శనతో తెలంగాణ ప్రజల సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిధిగా హాజరై [...]
September 23, 2011 | More
తెగించి పోరాడుతాం
తెంగాణ రాష్ట్రం వచ్చే వరకు తెగించి పోరాడుతామని చివరి రక్తం పొట్టు ఉన్నంత వరకు ఉద్యమాన్ని విరమించేదిలేదని జెఎసి నాయకులు రఘు అన్నాడు. శుక్రవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్యాంపస్‌లో వరంగల్ జిల్లా ఎన్‌పిడిసిఎల్ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన కరంటోల్ల శంకారామం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెఎసి నాయకులు రఘు మాట్లాడుతూ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముఖ్యమంత్రి సీమాంధ్ర మంత్రులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వడానికి మేము [...]
September 23, 2011 | More
తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే
హైదరాబాద్, మేజర్ న్యూస్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే తాము చచ్చిపోయినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభసభ్యుడు కె.కేశవరావు అన్నారు. తెలంగాణ కోసం దేనికైనా సిద్దమన్నారు. మళ్లీ రాజీనామాలకు వెనకాడమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తు న్నానని చెప్పారు. సిడబ్ల్యుసి పదవిని సైతం చెత్తబు ట్టలో వేశానని ఆయన పేర్కొన్నారు. సకలజనుల సమ్మెతో తెలంగాణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలం గాణ టీచర్లు శుక్రవారం గన్‌పార్క్‌వద్ద చేపట్టిన ఆందోళనకు [...]
September 23, 2011 | More
దిగొచ్చిన శ్రీనివాస్
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ యువకుడు శ్రీనివాస్ దిగొచ్చాడు. దాంతో పది గంటల ఉత్కంఠకు తెర పడింది. రాజీనామాలు చేసి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తన వద్దకు రావాలని, లేకుంటే కిందికి దూకుతానంటూ హైదరాబాదులోని కోఠీలో గల ఓ హోర్డింగ్‌పైకి ఎక్కి శ్రీనివాస్ అనే యువకుడు బెదిరిస్తూ వచ్చాడు. చేతిలో పెట్రోల్ ఉన్న డబ్బాను కూడా పట్టుకున్నాడు. అతన్ని కిందికి దింపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు హోర్డింగుపైకి ఎక్కిన శ్రీనివాస్ రాత్రి [...]
September 22, 2011 | More
Maintaining that people of Telangana are disappointed with Congress leaders from the region for not participating in the ongoing general strike in support of separate statehood demand, the Telangana Congress MPs will meet in Hyderabad on Thursday to discuss the issue. “People are disappointed that we are not participating in the strike. The Telangana Congress [...]
మంత్రుల ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న టీ- ఉద్యోగులు
హైదరాబాద్ : సచివాలయంలో మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, శ్రీధర్‌బాబుల ప్రెస్‌మీట్‌ను తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణన్యాయదులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
September 22, 2011 | More
రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ
హైదరాబాద్ : రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ సాధ్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తాను ఎవరినో ప్రలోభపెట్టడానికి సచివాలయానికి రాలేదని ఆయన పేర్కొన్నారు. ఒక్క రూపాయికి కిలో బియ్యం పథకంపై సమీక్ష కోసమే ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. తాము సమ్మె చేస్తుంటే, మీరెందుకు విధులకు హాజరవుతున్నారని టీ-ఉద్యోగులు శ్రీధర్‌బాబును ప్రశ్నించడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
September 22, 2011 | More
తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్ నేతలు
తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్ నేతలు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేశవరావు ఇంట్లో గురువారం తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. అనంతరం స్టీరింగ్ కమిటీ నేతలు మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 26న తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. ఇదే తమ ఢిల్లీ చివరి పర్యటన అని వారు తెలిపారు. [...]
September 22, 2011 | More