తెలంగాణ సాధనే ద్యేయంగా తెలంగాణలో బేజేపీ యాత్ర మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని మాగనూరు మండలం కృష్ణ గ్రామంలో యాత్రను బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ యాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా బేజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ది సాధ్యమని తమ పార్టీ నమ్ముతుందని చెప్పారు. తెలంగాణ కోసం బేజేపీ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. బేజేపీ అధికారంలోకి వస్తే వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వెంటనే కేసులు ఎత్తి వేయాలని నితిన్ గడ్కరీ డిమాండ్ చేశారు. తెలంగాణ పేరుతో కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెసు వైఖరితోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెసు నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకుంటున్నది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన లక్ష్యంలో భాగంగానే యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Related posts:
-
తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు
-
సింగరేణి కార్మికులపై నిర్బంధం ఆపండి- సింగరేణి కార్మికులకు మద్దతుగా యాత్ర – టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన తెలంగాణ అఖిలపక్షం –
-
కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
-
సీమాంధ్రుల కుట్రలకు తలొగ్గుతున్న కేంద్రం – పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి – అవినీతి నల్లధనంను వెలికి తీయాలి – అధిక ధరలను తగ్గించాలి
-
ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
Tags: featured
Category: News, Telangana
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.