రాజకీయ ‘లఫంగీలు’

| October 23, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

“అర్ధరాత్రి ఎవరినీ అడగకుండా కర్ణాటక మొయిలీ,తమిళనాడు చిదంబరం , తెలంగాణా ఇస్తామంటారా !వాళ్ళెవరు ఇవ్వడానికి ?….నాకు ఆంధ్ర,తెలంగాణారెండు కళ్ళు . ఆంధ్రావాళ్ళు సమైక్యాంధ్ర అనాలి,తెలంగాణావాళ్ళు జై తెలంగాణాఅనాలి….కాదు,కాదు నేను తటస్థం.”
చంద్రబాబు

“నేను సామాజిక తెలంగాణా కావాలనుకొన్నాను. కానీ ఇప్పుడు మా వాళ్ళు సమైక్యాంధ్ర అంటున్నారు, కనుక సమైక్యాంధ్ర కావాలి. … లేదు లేదు అధిష్టానం ఏదంటే అదే.”
చిరంజీవి

“తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని, నేను
ప్రూవ్ చేస్తాను.యాబై శాతం కంటే ఎక్కువ తెలంగాణా
ప్రజలు సమైక్యాంధ్ర కోరు కొంటున్నారు. తెలంగాణా వస్తే అభివృద్ది ఆగి పోతది.”
లగడపాటి

“తెలంగాణాను కానివ్వం.ఎవరడిగితే వాళ్ళకు
రాష్ట్రం ఇచ్చేస్తారా? జిల్లాకో రాష్ట్ర మివ్వ మనండి.”
కావూరి

“తెలంగాణా ఇవ్వడం అంత సులభం కాదు. ఆంధ్ర వాళ్ళు తలచుకుంటే తెలంగాణా వాళ్ళు ఎక్కడుంటారు.”
రాయపాటి

“కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు. తెలంగాణా ఒక వేర్పాటువాదం, రాజ్యాంగ విరుద్ధం.”
గాదె వెంకటరెడ్డి

“తెలంగాణవాదం సరైంది కాదు. అసలు తెలంగాణా వాడెవడో ముందు చెప్పాలి.నేను కూడా తెలంగాణా వాడినే.మాకు రాయల – తెలంగాణా కావాలి.”
జే సి దివాకర్ రెడ్డి

“తెలంగాణావాదులు దేశ ద్రోహులు. వారినందరినీ అండమాన్ దీవులలో బంధించాలి. మేం హైదరాబాద్ ను విడిచేది లేదు.”
టి జి వెంకటేష్

“తెలంగాణా అంత ముఖ్యం కాదు. తెలంగాణా వచ్చినా రాక పోయినా, ఆకాశం విరిగి పడేదేమి లేదు. విద్యార్థులు
ఉద్యమం పేరిట డబ్బులు వసూలు చేసుకొంటున్నారు.”
జయ ప్రకాష్ నారాయణ్

“నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను.తెలంగాణా కావాలని అడగడం సమంజసం కాదు.”
జైపాల్ రెడ్డి

“తెలంగాణ కొరకు ఏదైనా త్యాగం చేస్తాను.కానీ ప్రజలకొరకు ప్రభుత్వంలో పని చేస్తుంటాను.మంత్రి పదవి వదలలేను”
జానారెడ్డి

“తెలంగాణా పై మా వ్యూహాలు మాకున్నాయి.సి ఎం ను కాదని ఏ పని చెయ్యను. మంత్రి పదవి లో ఉండి ప్రజల సేవ చేస్తాను ”
శ్రీధర్ బాబు

“తెలంగాణా కొరకు ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధం.అందుకే మేము ప్రభుత్వంలో ఉన్నాము. తెలంగాణా కొరకు పోరాడుతూనే ఉంటాము.”.
బి.సారయ్య

“ఆంధ్ర ప్రదేశ్ ఎప్పటిలాగానే ఉండాలి.రాష్ట్రం విడ దీస్తే
రాయల – తెలంగాణా కావాలి.లేకపోతే బి జే పి వచ్చి సెక్యులరిజం దెబ్బ తింటుంది.”
అసదుద్దీన్ ఒవైసీ

“కర్నూలు,అనంతపూరు కలిపి రాయల – తెలంగాణా ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు.”
ఉత్తమకుమార్ రెడ్డి

“ఆంధ్రోల్లతోన కలిసి పని చెయ్యాలి.వాళ్ళను కాదని తెలంగాణా అడగడం మంచిది కాదు. ఎవరో, ఏందో చెప్తే ఎందుకు చేస్తాం. సి ఎం ఏది చెపితే అది చేస్తాం.”
రాజనర్సింహ, నాగేందర్,ముఖేష్

“తెలంగాణావాదులు దుర్మార్గులు. వాళ్ళను జైళ్లలో పెట్టాలి.తుపాకులతో కాల్చి చంపాలి.”
దేవినేని ఉమ

“కే సి ఆర్, కోదండరామ్ లు తాలిబాన్లు. వాళ్ళు బయట ఉంటె ప్రమాదం.వాళ్ళను జైళ్లలో పెట్టాలి.”
అనం వివేకా

“తెలంగాణా అడగడం సరికాదు.కావాలంటే తెలంగాణా వద్దని, మేము ఆత్మాహుతులు చేస్తాము.”
పయ్యావుల కేశవ్

“తెలంగాణా సమస్య జటిలమైనది. ఎవరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళు సమ్మె చేసుకోవాలి. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోము.”
శైలజానాథ్

“మాకు హైదరాబాద్ లో వాటా ఇవ్వాలి.కొత్త రాజధాని కట్టుకోవడానికి ఒక లక్ష కోట్ల రు.లు కావాలి.”
హరి రామ జోగయ్య

“తెలంగాణా ఉద్యమం సరి కాదనడం లేదు.కానీ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సమ్మె చేసుకొంటే మంచిది.”
బొత్స సత్యనారాయణ

“కే సి ఆర్ అడిగితే చెంగు రంగా అని తెలంగాణా ఇచ్చెయ్యాలా ! ఎవరో అడిగితే దేశాన్ని ముక్కలు చెయ్యాలా?”
రేణుకా చౌదరి

“కే సి ఆర్ తెలంగాణా రావద్దని ఉద్యమం చేస్తున్నాడు. తెలంగాణా వచ్చేవరకు మేం చేస్తే తప్ప ఎవ్వరూ పోటీ చెయ్య గూడదు.మా పార్టీకి తప్ప ఏ పార్టీకి చిత్త శుద్ది లేదు.”
ఎర్రబెల్లి దయాకర్ రావు

“ఏదో ఆ పూటకు తెలంగాణా అంటే ఒకే అన్నాము. అంత మాత్రానికి తెలంగాణా ఇస్తామంటే ఊరు కొంటామా? అన్ని పార్టీల ఆంధ్ర వాళ్ళమంతా కలిసి అడ్డు కుంటాము.”
నన్నపనేని రాజకుమారి

“మేమెందుకు రాజీనామా చెయ్యాలె.కోదండరామ్ ను, స్వామి గౌడ్ ను చెయ్యమనండి.తెలంగాణా వస్తది.సోనియమ్మ ఇస్తే తీసుకుంటం.ఇయ్యమని ఆమెను పరేషాన్ చెయ్యం.”
సర్వే సత్యనారయణ

“ఆంధ్రులు తెలంగాణా కొరకు ఎంతో చేశారు.మెజారిటీ రాష్ట్ర ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు.కాబట్టి తెలంగాణా ఉద్యమం అనవసరం.”
కోడెల శివప్రసాద్

source from simplytelangana

Related posts:

  1. The Voice of Telangana | Telangana Gunde chappudu
  2. రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ
  3. సీబీఐ ఆపరేషన్‌తో మైండ్ బ్లాంక్-గాలి అరెస్టుతో మారిన జగన్ స్వరం- కాంగ్రెస్‌తో కాళ్ల బేరానికి యోచన!
  4. Client Side Script Debugging in ASP.NET

Tags: , , ,

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


7 × = fourteenRecent PostsWeb Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
Siri Stone Crushers, Ladella, Warangal, Produce & Supply of 20mm, 40mm, 12mm & Dust
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.