రాజయ్య రాజీనామా
వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు రాజయ్య మళ్లీ రాజీనామా చేశారు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేయడం ఇది మూడోసారి. తన రాజీనామాను ఆమోదించకపోతే శాసనసభ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని, దాన్ని ఆమోదించాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలంతా సమ్మె చేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో తాను పదవిలో కొనసాగడం భావ్యం కాదని రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే తాను రాజీనామా చేశానని ఆయన అన్నారు. తాను ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని, శాసనసభకు కూడా వెళ్లబోనని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రకటన కోసం తాము ఈ నెలాఖరు వరకు నిరీక్షిస్తామని, ఆ తర్వాత బహిరంగ ప్రదేశంలోనే ప్రజల ముందు ఆమరణ దీక్షలకు దిగుతామని ఆయన చెప్పారు. కార్మికులు సమ్మెలో పాల్గొంటూ వేతనాలు కూడా తీసుకోవడం లేదని, తాను కూడా రాజీనామా చేసి విధులకు హాజరు కాకపోవడం మంచిదని అనుకున్నానని ఆయన అన్నారు
Related posts:
- 13న రాజీనామా చేయనున్న కొండా సురేఖ
- జగన్, విజయమ్మ రాజీనామా ఏది ? -శంకర్ రావు
- తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దం..
- తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.