తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోయినట్లే
హైదరాబాద్, మేజర్ న్యూస్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే తాము చచ్చిపోయినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభసభ్యుడు కె.కేశవరావు అన్నారు. తెలంగాణ కోసం దేనికైనా సిద్దమన్నారు. మళ్లీ రాజీనామాలకు వెనకాడమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తు న్నానని చెప్పారు. సిడబ్ల్యుసి పదవిని సైతం చెత్తబు ట్టలో వేశానని ఆయన పేర్కొన్నారు. సకలజనుల సమ్మెతో తెలంగాణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలం గాణ టీచర్లు శుక్రవారం గన్పార్క్వద్ద చేపట్టిన ఆందోళనకు ఆయన సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామాలు చేయాలని టీచర్లు కోరడంపై కెకె తీవ్రంగా స్పందించారు. తమకు ఎవరూ చెప్పక్కర్లేదని ఆయన అన్నారు.
అవసరమైతే అన్ని పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి ఉద్యమంలోకి రావాలని కోరు తామని ఆయన స్పష్టంచేశారు. సమ్మెతో ప్రత్యేక రాష్ట్రం రాదని సిఎం చెబుతు న్నారని, సకలజనుల సమ్మెతో తెలంగాణ ఎలా రాదో తాము చూస్తామని ఆయ న అన్నారు. ఉద్యమ నేతల్లో ఐక్యత వల్లే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Related posts:
- సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
- వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
- రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ
- ‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.