తెగించి పోరాడుతాం
తెంగాణ రాష్ట్రం వచ్చే వరకు తెగించి పోరాడుతామని చివరి రక్తం పొట్టు ఉన్నంత వరకు ఉద్యమాన్ని విరమించేదిలేదని జెఎసి నాయకులు రఘు అన్నాడు. శుక్రవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్యాంపస్‌లో వరంగల్ జిల్లా ఎన్‌పిడిసిఎల్ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన కరంటోల్ల శంకారామం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెఎసి నాయకులు రఘు మాట్లాడుతూ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముఖ్యమంత్రి సీమాంధ్ర మంత్రులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని కేవలం బొగ్గు ఉత్పత్తి కావడం లేదని కుట్ర పన్నుతున్న సీమాంధ్ర ప్రభుత్వం శ్రీశైలం జలవిద్యుత్‌ను పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోవడం లేదని రఘు ప్రశ్నించారు.
కేవలం సింగరేణి ఉద్యోగస్తుల సమ్మె ప్రజలకు చెబుతూ బొగ్గు రావడం లేదు కాబట్టే కరెంట్‌ఇవ్వలేకపోతున్నట్లు కుట్ర పూరితమైన వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని రఘు హెచ్చరించారు. వ్యవసాయ రంగాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పంత తమదన్నట్లుగా ముద్ర వేసే విధంగా వ్యవహరిస్తే కరంటోల్ల శక్తి ఏంటో ఇక ముందు చూపిస్తామని ఆయన అన్నారు. గతంలో కరెంట్ బంద్ చేస్తే దానికి బదులు మళ్లీ కరెంట్ ఇచ్చేవాల్లమని కాని నేడు ముఖ్యమంత్రి 7 గంటల కరెంట్‌ను 6 గంటలకు తగ్గిస్తు కుట్ర చేస్తూ సమ్మెను నిర్వీర్యం చేయడాన్ని ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
గత 11 రోజులుగా తెలంగాణ ప్రాంతంలో గ్రామాల్లో, పట్టణాల్లో గంటల కొద్ది కరెంట్ కోత విధిస్తున్నారు కాని హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వాటర్స్‌కు ఎందుకు కరెంట్ కట్ చేయడం లేదని రఘు ముఖ్యమంత్రిని రఘు ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి చేసే జిమ్మిక్కులు 177 జివో పేరుతో నో వర్క్, నో పే పేరుతో జీతాలు ఇవ్వమని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికి అసలు జీతాలు తీసుకోకుండానే నెలల తరబడి జీతాలు తీసుకోకుండా అవరమైతే రోజుకు 2 గంటలు ఎక్కువ పనిచేసి తెలంగాణ ప్రాంత రైతులను కరెంట్ కోత నుంచి మినహాయిస్తామని సీమాంధ్రలో ఉన్న కర్మాగారాలకు బొగ్గు లేకపోతే ఎందుకు ఆగిపోవడంలేదని కాని తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు మాత్రం బొగ్గు తవ్వడంలేదని అందుకుగాను కరెంట్ ఇవ్వలేమని చెబుతున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజలను మోసం చేసే కుట్రలు విడనాడాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని టిడిపి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లారా ముఖ్యమంత్రి మోస పూరిత మాటలు ఎందుకు వ్యతిరేకించడం లేదని రఘు ప్రశ్నించాడు.
శుక్రవారం తెలంగాణ జిల్లాల నుంచి కదిలి వచ్చిన 7 వేల మంది విద్యుత్ ఉద్యోగుల భారీ ర్యాలీ నగర ప్రజలను ఎంతగానో చైతన్యపర్చిందని చెప్పవచ్చు. ఇదే స్పూర్తితో నగర ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా వరంగల్ జిల్లా ప్రజలు తమ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 4 జిల్లాల నుంచి 7వందల మంది హెల్పర్ నుంచి సిఇ వరకు పాల్గొన్నారు.
Related posts:
- తేల్చేదాకా పోరాడుతాం – 8న యూనివర్సిటీల్లో ర్యాలీలు – 12న కరీంనగర్‌లో బహిరంగ సభ – 13న సమ్మె షురూ – 17న నిరసన దీక్షలు, ర్యాలీలు – 18న రహదారుల దిగ్బంధం
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ సమరయోధుడు మృతి
- తెలంగాణ ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా? – సర్కారుకు గద్దర్ సవాల్
- కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.