దిగొచ్చిన శ్రీనివాస్
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ యువకుడు శ్రీనివాస్ దిగొచ్చాడు. దాంతో పది గంటల ఉత్కంఠకు తెర పడింది. రాజీనామాలు చేసి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తన వద్దకు రావాలని, లేకుంటే కిందికి దూకుతానంటూ హైదరాబాదులోని కోఠీలో గల ఓ హోర్డింగ్‌పైకి ఎక్కి శ్రీనివాస్ అనే యువకుడు బెదిరిస్తూ వచ్చాడు. చేతిలో పెట్రోల్ ఉన్న డబ్బాను కూడా పట్టుకున్నాడు. అతన్ని కిందికి దింపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు హోర్డింగుపైకి ఎక్కిన శ్రీనివాస్ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కిందికి దిగి వచ్చాడు. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గద్దర్ మధ్యవర్తిత్వం వహించడంతో, తల్లి బతిమాలడంతో శ్రీనివాస్ కిందికి దిగి వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ హోర్డింగ్ వంద అడుగుల ఎత్తు ఉంది.
శ్రీనివాస్ హోర్డింగ్‌పైకి ఎక్కి దూకుతానని బెదిరించడంతో హైదరాబాదులోని కోఠీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణకు చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వచ్చి రాజీనామాలు చేస్తామని హామీ ఇస్తేనే తాను కిందికి దిగుతానని అతను పట్టుబడుతున్నాడు. శ్రీనివాస్‌తో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి కూడా ఫోన్లో మాట్లాడారు. హోర్డింగుపైనుంచి దిగి రావాలని ఆయన శ్రీనివాస్‌కు సూచించారు. పలువురు తెలంగాణ నాయకులతో పాటు టీవీ చానెళ్లు విజ్ఞప్తి చేసినా అతను వినడం లేదు. అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమకు శ్రీనివాస్ ఒక్కడే కొడుకని చెప్పుకుంటూ దిగిరావాలని అతన్ని కోరారు.
Related posts:
-
తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
-
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
-
బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ
-
‘తెలంగాణ పోరాటంలోనూ గెలిచి తీరుతాం’
-
పయ్య కదలదు.. తొవ్వ సాగదు, సీమాంధ్ర దారులన్నీ క్లోజ్, నేడు, రేపు క్యాబ్స్ కూడా బంద్, సకలం దిగ్బంధం
Tags: featured
Category: News, Telangana
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.