నేటి నుంచి ప్రైవేటు పాఠశాలల నిరవధిక బంద్, నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్
సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ ప్రైవేటు పాఠశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 15 వేల ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నట్లు ‘తెలంగాణ రికగై్నజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ టెస్మా) అధ్యక్షుడు కందాల పాపిడ్డి, కార్యదర్శి రాంచదర్ ఆదివారం ప్రకటించారు. సుమారు 1.50 లక్షల మంది ప్రైవేటు టీచర్లు, 10 లక్షల మంది విద్యార్థులు సకల జనుల సమ్మెలో పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడులకు తాళాలు వేసి సమ్మెలో పాల్గొంటున్నారు. సోమవారం నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కూడా సమ్మెలో పాల్గొననుండటంతో తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలన్నింటికి తాళాలు పడినట్లయింది.
సకల జనుల సమ్మెకు మద్దతుగా సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని వృత్తి విద్యా కాలేజీలు బంద్ పాటించనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కాలేజీలు రెండు రోజులపాటు బంద్ పాటించనున్నట్లు ‘కన్సార్షియం ఆఫ్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ తెలంగాణ చైర్మన్ డాక్టర్ కె.సునీల్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సమ్మెకు సీమాంధ్ర యాజమాన్యంలో ఉన్న కాలేజీలు కూడా తమ మద్దతు ప్రకటించి స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు మరోసారి సమావేశమై నిరవధికంగా బంద్ పాటించే అంశంపై చర్చించనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రదీప్, బీఈడీ కాలేజీల సంఘం అధ్యక్షులు ప్రభాకర్‌డ్డి, ఫార్మసీ కాలేజీల ప్రధాన కార్యదర్శి రాందాస్ తెలిపారు.
Related posts:
- నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
- పయ్య కదలదు.. తొవ్వ సాగదు, సీమాంధ్ర దారులన్నీ క్లోజ్, నేడు, రేపు క్యాబ్స్ కూడా బంద్, సకలం దిగ్బంధం
- సమ్మతో సత్తా చాటిన తెలంగాణ బంద్ – తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు – లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి – ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు –
- కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
- తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.