కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
సకల జనుల సమ్మెకు సంఘీభావంగా ఈనెల 19వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో కరెంటు బిల్లుల వసూళ్ళను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఎలక్షిక్టిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ(టీజాక్) ప్రకటించింది. ఈనెల 20వ తేదీన తెలంగాణ చౌరస్తా (మింట్‌కాంపౌండ్)లో ‘కరంటోళ్ళ శంఖారావం’ కార్యక్షికమాన్ని నిర్వహించాలని టీజాక్ నిర్ణయించింది. ఇకపై సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు టీజాక్ కో ఆర్డినేటర్ కె.రఘు తెలిపారు. కరెంటు బిల్లు చెల్లించకున్నా కరెంటు నిలుపుదల చేయబోమని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంటోళ్ళ శంఖారావం పేరుతో భారీ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్షికమానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ఇతర రాజకీయపార్టీల అగ్రనేతలు, వివిధవూపభుత్వ శాఖల జేఏసీ నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి, కార్మిక సంఘాల నాయకులు, తెలంగాణ కళాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
Related posts:
- పయ్య కదలదు.. తొవ్వ సాగదు, సీమాంధ్ర దారులన్నీ క్లోజ్, నేడు, రేపు క్యాబ్స్ కూడా బంద్, సకలం దిగ్బంధం
- సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
- సమ్మతో సత్తా చాటిన తెలంగాణ బంద్ – తొలి రోజు సమ్మెలో 4.5 లక్షల ఉద్యోగులు – లాయర్లు.. టీచర్లు.. విద్యార్థుల పోరుదారి – ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగులు –
- నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం
- Zee 24 Gantalu telugu live news channel tv, Zee 24 Gantalu telugu online tv, watch Zee 24 Gantalu telugu online, watch Zee 24 Gantalu telugu live, Zee 24 Gantalu telugu live for free, Zee 24 Gantalu telugu News Live
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.