నేటి నుంచి సకల జనుల సమ్మె- సమాయత్తం చేసిన భారీ సభ – దిశానిర్దేశం చేసిన నేతలు – 14, 15 తేదీల్లో సినిమాహాళ్లు బంద్ – 18న జాతీయ రహదారుల దిగ్బంధం – టీఆర్‌ఎస్ జన గర్జన దిగ్విజయం

| September 13, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

విప్లవాల పురిటిగడ్డ వేదికగా.. తెలంగాణ సకల జనం గర్జించింది! కపట సమైక్యవాదుల దోపిడీ కుట్రలు ఇంకానా.. ఇకపై సాగవంటూ గాండ్రించింది! దశాబ్దాలుగా దగా పడిన నాలుగున్నర కోట్ల గుండెల్లో రగులుతున్న సెగ ఢిల్లీకి తగిలేలా ఉవ్వెత్తున ఎగసిపడింది! సకల జనుల సమ్మెకు నగారా మోగించింది! ఉద్యమాల ఖిల్లాలో జనం ఉప్పెనైంది! కాలినడకపై కొందరు.. బళ్లు కట్టుకుని మరికొందరు.. లారీల్లో ఇంకొందరు… వేలు.. లక్షలుగా తెలంగాణ పల్లెలన్నీ కరీంనగర్ బాట పట్టాయి! ఎటు చూసినా గులాబీ వనంతో కరీంనగర్ ఉద్యమ గుబాళింపులతో శోభిల్లింది! లక్షలాది మంది తెలంగాణ ఉద్యమక్షిశేణులు చేసిన జై తెలంగాణ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి!

కపట సమైక్యవాదులకు గుబులు పుట్టింది! సకల జనుల సమ్మెతో తెలంగాణ రావడం తథ్యమని విశ్వాసం కల్పించింది! చరివూతాత్మకంగా సాగనున్న తెలంగాణ సకల జనుల సమ్మెకు ఒక్క రోజు ముందు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జనగర్జన.. దిగ్విజయమైంది! చిన్నారులు మొదలు.. వృద్ధుల దాకా.. నెత్తురు మండే యువకులు మొదలు.. ఉద్యమాన్ని ఉరకపూత్తించే మేధావుల దాకా..! సకల జేఏసీలు, సకల సంఘాలు ఏకమయ్యాయి… తెలంగాణను నాన్చుతున్న ఢిల్లీ కోటపై దండెత్తాయి! పోరు బిడ్డలకు దారి చూపిన నేతలు.. దగా పడిన తెలంగాణ దైన్యాన్ని మరోమారు చెప్పారు.

పెల్లుబుకుతున్న పోరుజ్వాలను ఢిల్లీకి గురి పెట్టారు! సకల జనుల సమ్మె విజయవంతానికి పిలుపునిచ్చారు. బస్సు పయ్య కదలొద్దు.. సింగరేణిలో బొగ్గు పెళ్ల పెగలొద్దు.. రైలు కదలొద్దు.. బడి గంట మోగొద్దు.. అంటూ దిశా నిర్దేశం చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పదునైన వాగ్బాణాలు విసురుతూ.. చెర్నాకోల దెబ్బల్లాంటి విమర్శలతో సీమాంవూధ నేతల వాదాలను దెబ్బతీశారు! సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై ఈగవాలినా తెలంగాణ అగ్గిబరాట అవుతుందని హెచ్చరించారు. ప్రాక్టీస్ ముగిసిందన్న రాజకీయ జేఏసీ చైర్మన్ ఇక యుద్ధమే మిగిలి ఉందని తేల్చి చెప్పారు. మనకు నీళ్లు నిధులు ఇవ్వని సర్కారు మనదికానే కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వాన్ని నడవనీయవద్దని పిలుపునిచ్చారు. మన అధికారం మనకు కావాలంటూ కొట్లాడాలని ఉద్భోదించారు. తుపాను ముందు ప్రశాంతత ఈ జనగర్జన అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు అభివర్ణించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిచ్చి, ఆమోదం పొందేలా చూడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలనుకోవడం ఇక ప్రభుత్వం వల్లకాదని సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్షికసీ రాష్ట్ర నేత సూర్యం స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలు తమకు తెలంగాణ ప్రజలిచ్చివేనని, ఆ ప్రజల కోసం వీటిని త్యాగం చేయడానికి వెరవబోమని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామి గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థుల బలిదానాలకంటే తమ ఉద్యోగాలు ఎక్కువేమి కాదని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

Source from Namaste Telangana

Related posts:

  1. తేల్చేదాకా పోరాడుతాం – 8న యూనివర్సిటీల్లో ర్యాలీలు – 12న కరీంనగర్‌లో బహిరంగ సభ – 13న సమ్మె షురూ – 17న నిరసన దీక్షలు, ర్యాలీలు – 18న రహదారుల దిగ్బంధం
  2. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
  3. నల్లధనంపై 20 నుంచి యాత్ర : రాందేవ్
  4. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా? – సర్కారుకు గద్దర్ సవాల్
  5. తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం

Tags: , , , ,

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


five − = 1



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Dr. A. Sudhakar (Laparoscopic & (M.S.) Gen. Surgen), siri Pharmacy, Beside Sridevi Mall Busstand Road, Hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
car rental services warangal, kazipet, hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.