‘యుద్ధం’ మొదలైంది – తెలంగాణే ఏకైక లక్ష్యం – ఉద్యోగ సంఘాల శంఖరావం – సమ్మె ఉపసంహరించుకోవాలి లేదంటే ‘నో వర్క్ నో పే’ తప్పదు – మంత్రి దానం హెచ్చరిక
‘యుద్ధం’ మొదలైంది. సకల జనుల సమ్మె శంఖారావాన్ని పూరించేందుకు అన్ని రంగాలు ఉద్యోగులు, ప్రజలు ఏకమయ్యారు. దశాబ్దాల ‘తెలంగాణ’ పోరాటాన్ని అంతిమ దశకు చేర్చేందుకు ఉద్యోగ సంఘాలు సర్వశక్తులనూ ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. ఎన్ని నిర్బంధాలు, కష్టాలు ఎదురైనా సరే తెలంగాణ కోసం కదనకుతూహలంతో సమ్మెలో దూకేందుకు ఉద్యోగులు సర్వం సిద్ధమయ్యారు. ఎస్మాలకు భయపడేది లేదని, తాటాకు చప్పుళ్లకు బెదరబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు.. ఉద్యోగుల సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు సర్కారు వ్యూహాలు రచిస్తోంది. ఎదురుదాడి అస్త్రాలకు పదును పెడుతోంది.
‘నో వర్క్ నో పే’, ‘ఎస్మా’లతో భయపె యత్నిస్తోంది. ఇందులో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌డ్డితో ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇందులో నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. ఈ భేటీ అనంతరం మంత్రి దానం నాగేందర్ విలేకరులతో మాట్లాడుతూ..‘ఉద్యోగులు సమ్మె నోటీసును విరమించుకోవాలి. లేదంటే జీవో 177ను నిలిపివేసినా దానిని అమలు చేయడంపై పునరాలోచన చేస్తాం. కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. 11 గంటల తర్వాత విధులకు రాకుంటే సమ్మెలో ఉన్నట్లుగానే పరిగణించాలని, అత్యవసర సర్వీసులలో విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని, ఇతరులపై నో వర్కు నో పే, ఇతర నిబంధనలన్నీ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇందులో భాగంగానే ఆగమేఘాల మీద సోమవారంనాడు ‘హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు’ను అత్యవసర సర్వీసుల పరిధిలోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొంటే ఎదురయ్యే పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నతాధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అత్యవసర సేవలు నిలిచిపోకుండా ఆయా విభాగాల్లో పోలీసులు, పారా మిలటరీ బలగాల సేవలను ఉపయోగించుకోవాలని సర్కారు నిశ్చయించింది. సకల జనుల సమ్మెతో రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికపుడు కేంద్రానికి తెలుపుతూ…అదనపు పారా మిలటరీ బలగాలను రాష్ట్రానికి రప్పించేందుకు అవసరమైన చర్యలను కూడా ప్రారంభించింది.
జీవో 177లో ఏముంది ?
సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులను లొంగదీసుకునేందుకుు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన జీవో నెం.177ను జారీ చేసింది. సమ్మెలో పాల్గొనడం, బంద్‌లు నిర్వహించడం, పెన్‌డౌన్, చాక్‌డౌన్, టూల్ డౌన్, సహాయ నిరాకరణ వంటి వాటిల్లో భాగస్వామ్యం అయ్యే ప్రభుత్వ ఉద్యోగులపై చర్య తీసుకునేందుకు వీలుగా ఈ జీవోను రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రిజిస్టర్‌లలో సంతకాలు చేసి విధులు నిర్వహించకుండా ఉండడం కూడా నేరంగా పరిగణిస్తారు.
source from Namaste Telangana
No related posts.
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.