సీబీఐ ఆపరేషన్‌తో మైండ్ బ్లాంక్-గాలి అరెస్టుతో మారిన జగన్ స్వరం- కాంగ్రెస్‌తో కాళ్ల బేరానికి యోచన!

| September 7, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

సీబీఐ ఆపరేషన్‌తో మైండ్ బ్లాంక్ – గాలి అరెస్టుతో మారిన జగన్ స్వరం – కాంగ్రెస్‌తో కాళ్ల బేరానికి యోచన!

కాంగ్రెస్‌లోకి తాను రానంటూనే యూపీఏకు మద్దతిస్తానని ప్రకటన
సీఎన్ఎన్ ఇంటర్వ్యూ ద్వారా సంకేతాలు
కాంగ్రెస్ పెద్దలతో రాయబార యత్నాలు
ఓ వ్యాపారవేత్త లాబీయింగ్
అపాయింట్‌మెంట్ ఇవ్వని ప్రణబ
ఆయన మద్దతు మాకు అవసరం లేదు: అభిషేక్ సింఘ్వీ
ములాయం, ఫరూక్ మినహా జాతీయ నేతలంతా జగన్‌కు దూరం

జగన్ మెల్ల మెల్లగా మెత్తబడుతున్నారా? కాంగ్రెస్‌తో కాళ్ల బేరానికి సిద్ధమయ్యారా? ఇప్పటికే ఆ దిశగా రాయబారాలు మొదలుపెట్టారా? ఢిల్లీలో ఆయన వేస్తున్న అడుగులు, జరుగుతున్న పరిణామాలు, పంపుతున్న సంకేతాలను చూస్తే… ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే లభిస్తుంది. గాలి జనార్దన రెడ్డిని కటకటాల వెనక్కి పంపడం, తన అక్రమాల గుట్టుమట్లన్నీ సీబీఐ అధికారులకు చిక్కడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.

‘గాలి’ పాసుపోర్టులను స్వాధీనం చేసుకోవడం.. ఆయన ఆస్తులను జప్తు చేసే దిశగా సీబీఐ అడుగులు వేస్తుండటంతో.. తర్వాతి వంతు జగన్‌దే అనే వాదన ఊపందుకుంది. దీంతో.. కాంగ్రెస్‌తో కాళ్ల బేరానికి రాక తప్పదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా రాయబారం నడిపేందుకు జగన్‌కు సన్నిహితుడైన ఒక వ్యాపార వేత్త కాంగ్రెస్ కురు వృద్ధుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని మంగళవారం కలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ… ఆయన ప్రయత్నం ఫలించలేదు.

మరో వైపు… జగన్ జాతీయ మీడియా ద్వారా ‘కాంగ్రెస్‌కు భవిష్యత్ స్నేహ హస్తం’ సాచారు. స్థానిక మీడియాతో మాట్లాడితే తనపై ఉన్న అక్రమాస్తుల కేసు గురించి తామర తంపరగా ప్రశ్నలు వస్తాయన్న ఆందోళనతో.. ఆయన జాతీయ మీడియాను ఆశ్రయించారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చానెల్ సీఈవో రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు. తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి ‘సరెండర్’ అవుతాననే సంకేతాలను పంపారు.

ఈ ఇంటర్వ్యూలో సోనియాని గానీ.. కాంగ్రెస్‌ను గానీ తీవ్రంగా విమర్శించకుండా ఆచితూచి మాట్లాడారు. కాంగ్రెస్‌లో మళ్లీ చేరబోనంటూనే.. సోనియా నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ఇస్తానని జగన్ చెప్పారు. యూపీఏతో ఎలాంటి ఒప్పందానికైనా తాను సిద్దమేనన్నారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని విమర్శించినందుకు బీజేపీ నేత సుష్మాకు కృతజ్ఞతలు చెబుతానని తెలిపారు. అదే సమయంలో ఆ పార్టీతో ఎప్పుడూ పొత్తు కుదుర్చుకునే ప్రసక్తి లేదని రాజ్‌దీప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ స్పష్టం చేయడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ అయినా మాకు అభ్యంతరం లేదు
తాను మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం కల్ల అని కూడా కడప ఎంపీ ప్రకటించారు. అంతలోనే 2014 ఎన్నికల తరువాత.. “రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం. వ్యవసాయం వంటి కీలక మంత్రిత్వ శాఖలు తీసుకుంటాం” అని ప్రకటించారు. కాగా.. సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో.. తనకు గాలి జనార్దన్ రెడ్డితో సంబంధమే లేదని కూడా జగన్ అన్నారు.

నిజానికి ఎన్నికల్లో గాలిసోదరులకు వ్యతిరేకంగా తన తండ్రి వైఎస్ ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. “బీజేపీ సిద్ధాంతం వేరు.. మా సిద్ధాంతం వేరు. నా సమస్యలన్నీ నేను మాట పై కట్టుబడినందుకే వచ్చాయి. బీజేపీతో నేను ఎలాంటి పొత్తు పెట్టుకోదలుచుకోలేదు. ఎన్నికలకు ముందైనా, ఆ తర్వాతైనా సరే. ఇకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నాం.

భగవంతుడి దయ ప్రకారం మాకు జాతీయ స్థాయిలో తగిన సంఖ్యాబలం వస్తే మమతా బెనర్జీ కావచ్చు. ములాయం కావచ్చు శరద్ పవార్ కావచ్చు.. చివరకు కాంగ్రెస్ పార్టీ అయినా మాకు అభ్యతరం లేదు. మా సంఖ్యాబలం ఆధారంగా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖను మేం కోరుకుంటాం. యూపీఏ ప్రభుత్వమైనా, మరే ప్రభుత్వమైనా మేం మద్దతిస్తాం. బీజేపీ మాత్రం మాకు ఆమోదయోగ్యం కాదు. కాంగ్రెస్‌కు తిరిగి వచ్చే ప్రసక్తి లేదు” అని జగన్ చెప్పారు.

జగన్‌కు ములాయం, ఫరూక్ హితబోధ!
అయితే.. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో ఆయన కాళ్లబేరానికి రావడాన్ని సూచిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 2014 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని దశలో.. రాష్ట్రంలో మెజారిటీ శాసనసభా స్థానాలు, లోక్‌సభ స్థానాలు తామే గెలుచుకుంటామని.. రాష్ట్ర శ్రేయస్సు కోసం బీజేపీ మినహా కేంద్రంలోని ఇతర ప్రభుత్వాలకు మద్దతును ఇస్తామని జగన్ ప్రకటించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్న అభిపాయ్రం వ్యక్తమవుతోంది.

కేంద్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మాత్రమే బలంగా ఉన్నాయి. తృతీయ కూటమి ఉన్నా కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తి దానికి లేదు. “ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను తాను సమర్థిస్థానని చెప్పడం ద్వారా.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా చైర్మన్‌గా ఉన్న యూపీఏకు మద్దతిస్తానని జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది” అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండడం.. జగన్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి కొత్త కొత్త ఆధారాలను సీబీఐ సేకరిస్తుండటంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం వైఎస్ తనయుడ్ని వెంటాడుతోందని ఆయన సన్నిహితులు తెలిపారు. భారతి సిమెంట్స్ అధిపతిగా ఉన్న జగన్ సతీమణి భారతిని కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న జగన్ నివాసంలోని ఫర్నీచర్ కొనుగోలు నుంచి ఇతర అంశాల వరకూ ఆమెను ఆరా తీశారు.

ఇలా తనపై సీబీఐ దర్యాప్తు లోతుగా సాగుతున్న సమయంలో.. గాలి జనార్దనరెడ్డిని సీబీఐ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం జగన్‌ను కలవరానికి గురి చేసింది. ‘గాలి’ అరెస్టు కావడం, తాను రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నా ములాయం సింగ్, ఫరూక్ అబ్దుల్లా తప్ప జాతీయ స్థాయి నేతలెవరూ తనను కలుసుకోవడానికి సిద్ధపడకపోవడంతో జగన్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిసింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రభావం ఢిల్లీలో తీవ్రంగా ఉండడం.. జగన్ వ్యవహారం గురించి ముందే సమాచారం ఉండడంతో .. ఆయన్ను కలిసేందుకు జాతీయ నేతలు సుముఖతను వ్యక్తం చేయడం లేదు.

ఇలా తాను చక్రబంధంలో ఇరుక్కుంటున్న తరుణంలో.. యూపీఏకు మళ్లీ దగ్గరవుతానంటూ జాతీయ మీడియా ద్వారా సంకేతాలు పంపే ప్రయత్నాన్ని వైఎస్ తనయుడు చేశారు. కాగా.. ములా యం, ఫరూక్ కూడా కాంగ్రెస్‌తో పెట్టుకోవడం మంచిది కాదని జగన్‌కు హితవు పలికినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జగన్ కటకటాల వెనుక చేరే రోజు ఆసన్నమవుతున్న కొద్దీ.. నీరుకారిపోతున్నట్లు కనపడుతోందని ఆయన సన్నిహిత వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి.

మాకు అక్కర్లేదు: సింఘ్వీ
కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్‌ను క్షమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిస్తానంటూ జగన్ చెప్పిన మాటలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తేలికగా కొట్టిపారేశారు. “జగన్ మద్దతు మాకు అవసరమేలేదు. ఆయన మద్దతు కావాలని మేం అడగలేదు. గడియారంలో ముల్లులా ఒక స్థిరత్వం లేకుండా అటూ ఇటూ ఊగిసలాడే చపలచిత్తులం మేం కాదు” అని అభిషేక్ సింఘ్వీ అన్నారు. జగన్ పార్టీ మూడేళ్ల తర్వాత కూడా మనుగడలో ఉండి.. ఎన్నికల్లో సీట్లు సాధిస్తుందని జగన్ కలలు కంటున్నారని కాంగ్రెస్‌కు చెందిన మరో నేత దుయ్యబట్టారు.

కాగా.. నిన్నటివరకు కాంగ్రెస్‌లో ఉండి.. ఇప్పుడు పార్టీని వదిలి.. కాంగ్రెస్‌ను దూషిస్తున్న వారిని బీజేపీ సమర్థిస్తోందని సింఘ్వీ ధ్వజమెత్తారు. జగన్ పై కేసులకు కాంగ్రెస్సే కారణమని బీజేపీ ఆరోపిస్తోందని విమర్శించారు. మొత్తానికి.. అక్రమాస్తుల కేసులో సీబీఐ సాలెగూడులో ఇరుక్కుని బయటకు రావడం కష్టసాధ్యమని నిర్ధారించుకున్నాకే.. యూపీఏకు మద్దతు ఇస్తానంటూ జగన్ కొత్త రాగం ఆలపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

source from Andhra jyothi

Related posts:

  1. ‘గాలి’తో నాకు సంబంధం లేదు:జగన్
  2. గాలి ఉత్థానపతనాలివి! – కానిస్టేబుల్ కొడుకు కోట్లకు పడగలెత్తాడు – పది లక్షల పెట్టుబడి.. ఐదేళ్లలో 3వేల కోట్లయిన మంత్రం! – వడ్డీకాసులవాడికి రూ.45కోట్ల విలువైన కిరీటం
  3. ముమ్మరం కానున్న సీబీఐ దర్యాప్తు -ఇకపై వ్యక్తిగతంగా పిలిపించి విచారణలు -మూడో దశలో అరెస్టులు
  4. జగన్, విజయమ్మ రాజీనామా ఏది ? -శంకర్ రావు
  5. సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి – ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం – రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు

Category: City News, News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


4 − two =





Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Free Blood Donors Hyderabad, warangal
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Free Blood Donors Hyderabad, warangal
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.