త్వరలో డీఎస్పీ – 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ రద్దు లేనట్లే! – 2012 నుంచి డీఎడ్ అభ్యర్థులకే ఎస్‌జీటీ పోస్టులు

| September 7, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

త్వరలో డీఎస్పీ – 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ రద్దు లేనట్లే!
- ఉపధ్యాయ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం యథావిధిగా అమలు
- రాబోయే డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ విధానం ఉండదు
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి మోడల్ స్కూల్స్ ప్రారంభం
- 2012 నుంచి డీఎడ్ అభ్యర్థులకే ఎస్‌జీటీ పోస్టులు
- మంత్రి పార్థసారథి వెల్లడి
- టెట్ ఫలితాలు విడుదల

డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానం రద్దు వర్తించదని సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి చెప్పకనే చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో… 2008 డీఎస్సీ అభ్యర్థులకు అప్రెంటిస్ విధానం రద్దు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు తాను భావిచంటంలేదన్నారు. భవిష్యత్తు డీఎస్సీల ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులకు మాత్రం అప్రెంటిస్ విధానం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని యథావిధిగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షా (టెట్) ఫలితాలను పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయంలో ఆదివారం ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో కొత్త డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం చేపట్టనున్నట్లు ప్రకటించారు. 2008 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు 2010లో పోస్టుంగులు ఇచ్చినందున, ప్రస్తుత ఖాళీల వివరాలు, నియామకపు ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఎన్‌సీఈఆర్టీ నిబంధనల ప్రకారం… 2012 జనవరి నుంచి జరగబోయే డీఎస్సీ నియామకాల్లో ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హలని మంత్రి వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నవోదయ, కేంద్రీయ పాఠశాలల మాదిరిగా మోడల్ స్కూళ్ళను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 737 మోడల్ స్కూళ్ళకుగాను సుమారు 7,000 మంది ఉపాధ్యాయులు అవసరమని, కేంద్రీయ పాఠశాలల్లో మాదిరిగానే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

టెట్ ఫలితాలు విడుదల: గత జులై 31న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా సంస్థల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు టెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహించే రాష్ట్రాల్లో ఆంధ్రవూపదేశ్ మూడో రాష్ట్రమని చెప్పారు. జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధిస్తేనే టెట్‌లో అర్హత సాధించినట్లు పరిగణిస్తారని, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్లని చెప్పారు. వచ్చే డిసెంబర్ లేదా 2012 జనవరిలో మళ్ళీ టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఫలితాలను http:aptet.cgg. gov.in, www.namasthe telan gaana.com వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలంటే పేపర్-1, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే పేపర్-2, 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే రెండు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్షికమంలో రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు ఎన్. శివశంకర్, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

పేపర్-1, పేపర్-2లలో టెట్ పరీక్షకు హాజరైన,
అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు :

 

source from Namaste Telangana

 

Related posts:

  1. నల్లధనంపై 20 నుంచి యాత్ర : రాందేవ్
  2. 25 లక్షల కొత్త రేషన్ కార్డులు – 5 లక్షల మందికి పింఛన్లు – 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ధి
  3. 13న రాజీనామా చేయనున్న కొండా సురేఖ
  4. సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
  5. జగన్, విజయమ్మ రాజీనామా ఏది ? -శంకర్ రావు

Tags:

Category: Education, Educational News/Announcements

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


2 × four =



Recent Posts



car rental services warangal, kazipet, hanamkonda


Free Blood Donors Hyderabad, warangal
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.