25 లక్షల కొత్త రేషన్ కార్డులు – 5 లక్షల మందికి పింఛన్లు – 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ధి
రేషన్ కార్డులు కొత్తగా 25 లక్షల – 5 లక్షల మందికి పింఛన్లు
- అక్టోబర్ నుంచి ఇందిర జలవూపభ
- రచ్చబండ రెండో దశకు రూ. 2,700 కోట్లు
- స్త్రీ నిధికి రూ. 1,000 కోట్లు
- 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ధి
- మంత్రుల సమావేశంలో నిర్ణయాలు
ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో దాదాపు 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం అత్యవసరంగా ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని జగన్ వర్గం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, వాటిని ఎదుర్కొనేందుకు సీఎం కిరణ్‌కుమార్‌డ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రైతులు, మహిళల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్షికమాలు రూపొందించాలని నిర్ణయంచినట్లు తెలిసింది. రూ, 1,800 కోట్లతో 36 లక్షల మంది రైతులు, 50 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
రాబోయే 45 రోజుల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ‘ఇందిర జలవూపభ’, ‘రచ్చబండ రెండో దశ’ కార్యక్షికమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా 25 లక్షల మందికి రేషన్‌కార్డులు, 5 లక్షల మందికి పింఛన్లు అందించాలని నిర్ణయించారు. రైతులకు సంబంధించి రూ, 1,191 కోట్లతో రుణాలు, పంటల బీమా, వడ్డీ మాఫీ, పావలా వడ్డీ రుణాలు అందిస్తారు. వీటిలో 7.48 లక్షల మందికి 2010 ఖరీఫ్‌కు సంబంధించి రూ. 765 కోట్ల పంటల బీమా పరిహారం, 20 లక్షల మంది రైతులకు రూ. 352 కోట్లు, 2010 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వడ్డీమాఫీ, 9.6 లక్షల మంది రైతులకు 2009-10 పావలా వడ్డీ కింద రూ. 73 కోట్ల రుణం అందించనున్నారు.
రూ. 600 కోట్లతో 50 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటిలో పావలా వడ్డీకింద రూ.300 కోట్లు, ‘స్త్రీ శక్తి’ భవనాల నిర్మాణం కోసం రూ.300 కోట్లు, వీటితో పాటు రూ. 1,000 కోట్లతో ‘స్త్రీ నిధి’ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా అక్టోబర్‌లోనే రూ .2,700 కోట్లతో ‘రచ్చబండ’ రెండోదశ కార్యక్షికమాన్ని చేపడుతారు. ఈ కార్యక్షికమంలో 36 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. 6 లక్షల ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు మహీధర్‌డ్డి, విజయరామారాజు, విశ్వరూప్, వట్టి వసంతకుమార్, పార్థసారథి, కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్య వరవూపసాద్, కాసు కృష్ణాడ్డి, దానం నాగేందర్, గీతాడ్డి, సునీతా లక్ష్మాడ్డి, డీకే అరుణ, గల్లా అరుణ కుమారి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఏరాసు ప్రతాప్‌డ్డి, టీజీ వెంక ముఖేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు సామర్థ్యం పెంచుకోవాలి
వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసే ధాన్య పరిమాణాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌డ్డి ఆదేశించారు. దీనికి అనుగుణంగా గోదాముల వసతిని సమకూర్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ముఖ్యంగా వరిసాగు ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. ఖరీఫ్-2012 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ, మిల్లుల లెవీపై కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి సునీతా లక్ష్మాడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 2 కోట్ల గోనె సంచుల సరఫరాకు ఆర్డర్ ఇచ్చామని అధికారులు సీఎంకు తెలిపారు.
ఆధార్ అక్రమాలపై విజిపూన్స్ : శ్రీధర్‌బాబు
ఆధార్ కార్డుల జారీలో అక్రమాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా విజిపూన్స్ సిబ్బందిని నియమిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సచివాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైతే.. ఇకముందు ఆ సంస్థలు దేశవ్యాప్తంగా ఎక్కడ వ్యాపారం చేయకుండా బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు.
ఇందిర జలవూపభ ద్వారా 10 లక్షల బోరుబావులు
ఇందిర జలవూపభ పథకం ద్వారా 2014 నాటికి రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన పది లక్షల ఎకరాల్లో బోరుబావులు వేసి అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలిపారు. ప్రస్తుతం భూగర్భ జల శాఖలో జియాలజిస్టుల కొరత ఉందని అవుట్‌సోర్సింగ్ ద్వారా వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకోసం నాబార్డు రూ. 802.50 కోట్లు అందిస్తుందని, మిగిలిన రూ. 909.55 కోట్లను ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తామని కిరణ్‌కుమార్‌డ్డి తెలిపారు. రాష్ట్రంలోని 895 మండలాలకు చెందిన 16,472 గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 211 నియోజక వర్గాల్లో అక్టోబర్ 2 వ తేదీన ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
అదనపు చెల్లింపులకై ఒత్తిడి
పెరిగిన ధరల ప్రకారం కాంట్రాక్టు పనులకు అదనపు చెల్లింపులు చేయాలని జలయజ్ఞం గుత్తేదార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మంగళవారం జలయజ్ఞం గుత్తేదార్లు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిని కలిశారు. అదనపు చెల్లింపులు చేయక పోతే ప్రాజెక్టు పనులు కొనసాగించడం కష్టమని వారు నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో పాటు భూసేకరణలో జరిగిన జాప్యం వల్ల పనులు పలు ప్రాజెక్టుల పనులు పెండింగ్‌లో పడ్డాయి. నీటి పారుదల ప్రాజెక్టుల పనులు పూర్తి కాక పోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని వారు ఆరోపించారు. ధరలను సవరించక పోతే తాము టెండర్లలో పాల్గొనబోమని కాంట్రాక్టర్లు హెచ్చరించడంతో టెండర్ల గడువును ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు పొడిగించవలసి వచ్చింది. కాంట్రాక్టర్ల సమస్యపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
source from Namaste Telangana
Related posts:
- కరోడ్‌పతి కేబినెట్ -కమల్‌నాథ్ టాప్ (రూ.263 కోట్లు) -చివరన ఆంటోనీ (రూ.1.82 లక్షలు) -ప్రధాని ఆస్తి రూ.5 కోట్లు -చేతిలో చిల్లిగవ్వలేదన్న మొయిలీ
- గాలి ఉత్థానపతనాలివి! – కానిస్టేబుల్ కొడుకు కోట్లకు పడగలెత్తాడు – పది లక్షల పెట్టుబడి.. ఐదేళ్లలో 3వేల కోట్లయిన మంత్రం! – వడ్డీకాసులవాడికి రూ.45కోట్ల విలువైన కిరీటం
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ సమరయోధుడు మృతి
- తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
- 13న రాజీనామా చేయనున్న కొండా సురేఖ
Category: Latest News, News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.