తేల్చేదాకా పోరాడుతాం – 8న యూనివర్సిటీల్లో ర్యాలీలు – 12న కరీంనగర్‌లో బహిరంగ సభ – 13న సమ్మె షురూ – 17న నిరసన దీక్షలు, ర్యాలీలు – 18న రహదారుల దిగ్బంధం
తేల్చేదాకా పోరాడుతాం – నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
- 8న యూనివర్సిటీల్లో ర్యాలీలు
- 12న కరీంనగర్‌లో బహిరంగ సభ
- 13న సమ్మె షురూ
- 17న నిరసన దీక్షలు, ర్యాలీలు
- 18న రహదారుల దిగ్బంధం
- అక్టోబర్‌లో ‘చలో హైదరాబాద్’
- ‘తెమ్జా’ మీట్ ది ప్రెస్‌లో కోదండరాం
‘‘రెండు ప్రాంతాల మధ్య విభజన రేఖ ఏర్పడింది. ఇది అన్ని వర్గాల మధ్య వచ్చేసింది. రాజకీయ అధిపత్యాన్ని తెచ్చుకోవడం, నిలబెట్టుకోవడం కోసం సీమాంధ్ర పార్టీలు తెలంగాణను అడ్డకుంటున్నాయి. తెలంగాణపై కేంద్రం తేల్చే వరకు పోరాడుతాం. అక్టోబర్‌లో అన్ని జిల్లాలతో కలిసి చలో హైదరాబాద్‌ను నిర్వహిస్తాం..’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. నేడు తెలంగాణ చారివూతక సందర్భంలో ఉందని, రాష్ట్రం సాధించే వరకు ఉద్యమించి, లక్ష్యం చేరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ ఎలక్షిక్టానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్(తెమ్జా) నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కోదండరాం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న : రాజీనామా చేయని ప్రజావూపతినిధులకు చెప్పుల దండలు వేయాలని అన్నారు కదా.. ఇది ఎంఐఎం వారికీ వర్తిస్తుందా..?
కోదండరాం: తెలంగాణ ఏర్పాటు కోసం 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేశాయి. ఈ సమయంలో తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈ రెండు పార్టీలదే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన బాధ్యత వహించాలి. రాష్ట్ర ఏర్పాటు శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్‌కే ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ కూడా రాజీనామాలు చేసి కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలి. అప్పుడే ప్రక్రియ వేగవంతం అవుతుంది. చెప్పులదండల విషయంలో వక్రీకరణ జరిగింది. హయత్‌నగర్ మీటింగ్‌లో.. రాజీనామాలు చేయని వారిని ఊళ్లలోకి రానివ్వొద్దని మాత్రమే అన్నా.
అదే సమయంలో తెలంగాణ వ్యతిరేకుల చిత్రపటాలకు చెప్పుల దండలు వేయాలన్న దాన్ని కొందరు వక్రీకరించి కలిపేశారు. ఇవి రెండు వేరు వేరు. ఇక ఎంఐఎం ఎప్పుడు కూడా తెలంగాణ కోసం ఉద్యమించలేదు. అదే సమయంలో ఏనాడూ తెలంగాణ తెస్తామని ఆ పార్టీ చెప్పలేదు. మా ఒత్తిడి పూర్తిగా తెలంగాణ ఇస్తామని, తెస్తామని చెప్పిన కాంగ్రెస్, టీడీపీలపైనే. రాజీనామాలు చేయాలని అడిగే హక్కు మాకు ఉంది.
ప్రశ్న : ఉద్యమాల రూపం ఏ విధంగా ఉండబోతోంది?
కోదండరాం: ఈనెల 6న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, 8న యూనివర్సిటీల్లో ర్యాలీలు, 12న కరీంనగర్‌లో బహిరంగ సభ ఉంటుంది. 13న సమ్మె ప్రారంభం అవుతుంది. 17న తెలంగాణ విలీన కార్యక్షికమం సందర్భంగా నిరసన దీక్షలు, ర్యాలీలు, 18న జాతీయ రహదారుల దిగ్బంధం, 22న రైల్‌రోకో, 23న కలెక్టరేట్ల ముట్టడి ఉంటుంది. కలెక్టరేట్ల ముట్టడికి ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పకుండా రావాలి. అక్టోబర్‌లో అన్ని జిల్లాలతో కలిపి భారీ ఎత్తున ‘చలో హైదరాబాద్’ కార్యక్షికమం నిర్వహిస్తున్నాం. ఈ దఫా ఉద్యమంతో తేల్చుకుంటాం. తేల్చే వరకు పోరాటం.
ప్రశ్న: మిగతా సంస్థలు, సంఘాలను కలుపుకుని పనిచేయడంలో జేఏసీ ఎందుకు కృషి చేయడం లేదు?
కోదండరాం: ఐక్యతా ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. విడివిడిగా పనిచేస్తున్నా లక్ష్యం తెలంగాణే కనుక ఏకరూపిత ఉద్యమాల కోసం అందరూ కలిసికట్టుగానే పనిచేస్తున్నారు.
ప్రశ్న: వికిలిక్స్ ఇటీవల తెలంగాణపై కొన్ని కేబుల్స్‌ను బయటపెట్టింది. అదే సమయంలో కొన్ని దేశాల్లో వారం రోజులు ఉద్యమిస్తే విప్లవాలు వస్తున్నాయి. ఇక్కడెందుకు సమయం పడుతోంది…?
కోదండరాం: వికిలిక్స్ కేబుల్స్‌పై అధ్యయనం చేస్తున్నాం. ఆంధ్రపెట్టుబడిదారులు జూదరి స్వభావంతో ఉన్నాయి. కాంట్రాక్టులు పొంది కష్టం తెలియకుండా ఆస్తులు కూడబెట్టుకున్నారు. సినిమా, విద్య, వైద్యం, హోటళ్లు ఇలా కొన్ని రంగాల్లో వీరి ఆధిపత్యం ఉంది. దీన్ని వదులుకోలేకపోతున్నారు. అధికారం కోసమే తెలంగాణకు అడ్డుపడుతున్నారు. 750 కోట్లతో అయిపోయే రాజీవ్ రహదారిని 1500కోట్లకు పెంచుకున్నారు. ఎల్లంపల్లి టెండర్లలోనూ ఇలాగే చేశారు. ఇలాంటివి వదులుకోలేకే తెలంగాణకు అడ్డం పడుతున్నారు.
ప్రశ్న : తెలంగాణ సాధనకు ఇప్పటికే అనేక రకాల పోరాటాలు సాగాయి. వాటి స్థాయిలోనే సమ్మె పోరాటాలుంటాయా..? లేక వాడివేడి పెరుగుతుందా..? మిలియన్ మార్చ్‌లాంటివేమన్నా చేపడతారా?
కోదండరాం: తప్పకుండా పెరుగుతుంది. మా వ్యూహాలు మాకుంటాయి. అన్నింటినీ చెప్పలేం కదా.. ఆంధ్ర పెట్టుబడిదారులు చేసే కుట్రలను అడ్డకునేందుకు మాకూ వ్యూహాలుంటాయి. గతంలో జరిగిన మిలియన్ మార్చ్ మినిమార్చ్ అన్నాం. ఇలాంటి కార్యక్షికమాల్లో భాగంగానే అక్టోబర్‌లో అన్ని జిల్లాల ‘చలో హైదరాబాద్’ కార్యక్షికమాన్ని రూపొందిస్తున్నాం.
మార్మోగిన తెలంగాణ నినాదాలు
ఒకవైపు తెలంగాణ ఎలక్షిక్టానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్(తెమ్జా)లోని ఒక వర్గం వారు అసోసియేషన్ తమదేనని, తాము లేకుండా కొందరు ఈ మీట్ ది ప్రెస్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని సమావేశం మధ్యలోనే కోదండరాం దృష్టికి తెచ్చారు. దీనిపై తర్వాత మాట్లాడుదామని ఆయన అన్నా వినకుండా ‘జై తెలంగాణ’ అంటూ వారు నినాదాలు చేశారు. వారి నినాదాలకు పోటీగా నిర్వాహక జర్నలిస్టులు కూడా ‘జై తెలంగాణ’ అంటూ పోటీ నినాదాలు ఇవ్వడంతో సమావేశం వాడివేడిగా మారింది. చీలిక వర్గ జర్నలిస్టులు కొంత సేపు నినాదాలు చేసి చివరికి అక్కడి నుంచి నిష్ర్కమించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఎన్ని సంఘాలు పుట్టినా రాజకీయ జేఏసీ మద్దతు ఇస్తుందని, సహకారం అందిస్తుందని చెప్పారు. విభేదాలను పరిష్కరించుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. ఈ సమావేశంలో తెమ్జా కన్వీనర్ ఎంవీ రమణ, కో కన్వీనర్ వాసు, నాయకులు క్రాంతి, వాసు, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.
source from Namaste Telangana
Related posts:
- ఓడి బానిసలవుదామా? నిలిచి గెలుద్దామా? ఫిర్ ఏక్ ధక్కా.. ఏ ధక్కా బిగడ్‌నా నహీ
- సమ్మెకు దిగుతాం మిలియన్ మార్చ్ తరహాలో – సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి తాళాలు పడతాయి – ఎయిర్‌పోర్టును స్తంభింపజేస్తాం – రాజీనామాలపై కాంగ్రెస్, టీడీపీప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
- తెలంగాణ రాకుంటే బతకన్తిరా! సీమాంధ్ర పాలకులు పాతాళంలోకి తొక్కేస్తరు -ఐక్యంగా లేకుంటే దెబ్బతింటాం
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.