నల్లధనంపై 20 నుంచి యాత్ర : రాందేవ్
నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు రప్పించాలని కోరుతూ తాను చేపడుతున్న మలిదఫా యాత్ర సెప్టెంబర్ 20 నుంచి ఉత్తరవూపదేశ్‌లోని ఝాన్సీ నుంచి ప్రారంభమవుతుందని యోగాగురు రాందేవ్ బాబా ప్రకటించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టం ఉల్లంఘించారని ఆయన ట్రస్టులపై కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను విచారణకు ఆదేశించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అవినీతి ఉద్యమంలో పాల్గొనకుండా తనను అడ్డుకోవడానికే కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తన ట్రస్టులో విదేశీ నిధులున్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను నడుపుతున్న ట్రస్టులకు ఇతర కంపెనీలతో సంబంధం లేదని… పతంజలి యోగా ట్రస్టు ఓ కంపెనీ కాదని, ఇది 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తోందని పేర్కొన్నారు. తనకు సొంత బ్యాంక్ అకౌంట్, తన పేర గజం స్థలం కూడా లేదని స్పష్టం చేశారు. హజారే నిరాహార దీక్షను విరమించాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థించనని అన్నారు. అవినీతి పోరులో తాను సగం విజయం సాధించానని హజారే అంటున్నారని, కానీ ఆయన విజయం వైపు మొదటి అడుగులు వేస్తున్నారని అన్నారు.
Source from Namaste Telangana
Related posts:
- జగన్, విజయమ్మ రాజీనామా ఏది ? -శంకర్ రావు
- Zee 24 Gantalu telugu live news channel tv, Zee 24 Gantalu telugu online tv, watch Zee 24 Gantalu telugu online, watch Zee 24 Gantalu telugu live, Zee 24 Gantalu telugu live for free, Zee 24 Gantalu telugu News Live
- Telangana T-News Live, online teangana live tv, t news for telangana tv channel, telangana tv channel
- సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
Category: Latest News, Top News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.