మీ సాయం నిలిపింది ఓ ప్రాణం..

| December 27, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

ఫ్రెండ్స్‌…

మీ సాయం..మీ అవధులు లేని దాతృత్వం..ఓ ప్రాణాన్ని ఈ ప్రపంచంలోకి సగర్వంగా తీసుకొచ్చింది..దేవుడు సగం ప్రాణం పోస్తే మీ దయాగుణంతో మీ ఆశీర్వాదాలతో ఆ పాపకు నిండు నూరేళ్ల ఆయుష్షునిచ్చారు..పుట్టిన ఎనిమిది రోజులకే గుండె ఆపరేషన్..అది కూడా అరుదైన ఆపరేషన్…ఖర్చు ఎనిమిది లక్షలు..తండ్రి ఓ సాధారణ కెమెరామన్..ఏం చేసేది..అతని దుఃఖాన్ని ఎలా ఆపేది..? అప్పుడు ముందుకొచ్చింది మా సేవ్‌ ఎ లైఫ్‌ ఫౌండేషన్…సందేహిస్తూనే మీ సాయం కోరుతూ ఓ పోస్ట్‌ పెట్టాను..అద్భుతం..ఆశ్చర్యం..మీ మానవతా స్పందన వెల్లువైంది..సాయంత్రం కల్లా దాదాపు 30 వేలు…మా ఉత్సాహం ఇనుమడించింది..మరునాటి అన్ని ప్రముఖ పత్రికల్లో వార్తలు వేయించాం..రాష్ట్ర ప్రజ అపూర్వంగా స్పందించింది..అద్భుతంగా విరాళాలు వితరణ చేశారు..50 వేలు..10 వేలు..రెండు వందలు..ఇలా వారు స్పందించిన విధానం కంటతడి పెట్టించింది..మూడు లక్షలు రెండు రోజుల్లో…ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి..ఆ డబ్బు ఆ బంగారు కొండను బతికించింది..ఇప్పుడు ఆ తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది..మీ ఆశీర్వాదాలతో మరింత వేగంగా కోలుకుంటోంది..కేర్ ఆసుపత్రిలో..

థాంక్యూ ఫ్రెండ్స్‌…నిజంగా మీలాంటి మిత్రులున్నందుకు గర్వంగా పీలవుతున్నాను..

ఈ రోజే డిప్యూటీ సిఎం రాజనర్సింహ చేతుల మీదుగా ఆ పాప తండ్రి చంద్రకాంత్‌ కు మూడు లక్షల రూపాయల చెక్‌ అందజేశాం…జనవరి 10 వ తేదీలోపు వచ్చే మరిన్ని విరాళాలతో మరో చెక్ ఇస్తాం..

మానవత్వం గెలిచింది..మనిషి గెలిచాడు..మనసు గెలిచింది..

మరోసారి లక్ష కోట్ల సార్లు థాంక్యూ ఫ్రెండ్స్‌….

Support Save A Life Foundation

If anyone want to donate funds from with in India through checks or online transfers please send your amount to under given bank detailsSAVE A LIFE FOUNDATION KHIRATABAD HYDERABAD
Account No: 590402010003475 
Name of the Bank: Union Bank of India
IFSC code:UBINO559041
Banjarahills Branch, Hyderabad,
Andhra Pradesh, INDIA
Bank Phone: 040-23421886, 040-66666619, 9010807788http://www.savealifefoundation.in/

Tags: , ,

Category: Latest News, News, Services

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


2 × two =

Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.