
తెలంగాణ కోసం నవంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష – దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం:కోమటిరెడ్డి
తెలంగాణ కోసం నవంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. తన దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానానికి సిద్దమని తెలిపారు. తెలంగాణ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.