One lakh Jobs opening in Telangana state for Government schools

| July 18, 2014 | 0 Comments
  • Tweet
  • SumoMe
  • Tweet

తెలంగాణ రాష్ట్రంలో 118 ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుత లెక్కలను బట్టి మొత్తం 1,07,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు సచివాలయం మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం 5,21,608 పోస్టులు కేటాయించారు. ఆయా పోస్టుల వివరాలను క్యాడర్ల వారీగా తెలంగాణ ఆర్థిక శాఖ జులై 15న‌ వెల్లడించింది. ఒక్కో శాఖలోనూ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పోస్టులు, అప్పట్లో ఖాళీలు ఎన్నేసి ఉన్నదీ తెలిపింది. వీటిలో తెలంగాణకు లభించిన హెడ్‌క్వార్టర్‌, క్షేత్ర స్థాయి పోస్టులు, తిరిగి వాటిలో ఖాళీలను వివరించింది.

షేత్ర స్థాయి పోస్టులు ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని, కేవలం రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఉద్యోగులను, రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఖాళీలను మాత్రమే ఉభయ రాష్ట్రాలకు విభజిస్తారని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆర్థిక శాఖ ఇప్పుడు వెల్లడించిన పోస్టుల వివరాలు ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. పూర్తి వివరాలు తెలంగాణ ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగుల తుది కేటాయింపులు పూర్తయ్యాక తెలంగాణ పోస్టులు, ఖాళీల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇక ఉమ్మడి సచివాలయంలో మంజూరైన పోస్టులు 5,217 ఉండగా వాటిలో 1,875 ఖాళీగా ఉన్నాయి. తెలంగాణకు ఈ మొత్తం పోస్టుల్లో 1,202, ఖాళీల్లో 510 కేటాయించారు.

త్వరలో గ్రూప్స్ I, II & IV నోటిఫికేషన్

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీపీఎస్సీ) ఏర్పాటుకు నిన్న మంత్రి మండలి నిర్ణయం తెసుకోవడం తో  18 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికతకు ఇప్పటి వరకు ఉన్న నిబంధనను మార్చి కొత్త నిబంధన తీసుకురానుంది. బోధన రుసుముల కోసం రూపొందిస్తున్న స్థానికత నిబంధనను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలను తప్పనిసరి చేయనున్నట్లు తెలిసింది. టీపీఎస్సీని అతి త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నియమావళి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి టీపీఎస్సీ ఏర్పాటు గురించి తెలిపారు. దీనిపై అతిత్వరలో తుది ఉత్తర్వులు రానున్నాయి. తర్వాత కేంద్ర ఆమోద ప్రక్రియ ఉంటుంది. జులైలోనే కేంద్ర ఆమోదం లభించి టీపీఎస్సీ అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. టీపీఎస్సీ ఏర్పడిన వెంటనే ఉద్యోగ నియామకాలు జరపాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు.

Tags:

Category: BEd Colleges, Business News, Careers, City News, Colleges, Education, Educational News/Announcements, Govt Jobs, Historical Places, IT Jobs, Latest News, National News, News, Opening Govt Jobs in Telangana State, Other Jobs, Services, State News, Technology News, Telangana e-Papers, Telangana History, Warangal Forts, Warangal Lakes, Warangal News, Warangal Temples, Warangal Wildlife

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


four + = 12





Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.