అమరుల త్యాగం వృథాకానీయం

| August 1, 2013 | 0 Comments
  • Tweet
  • Tweet

-ఇది అమరుల పోరాట విజయం.. సీమాంధ్ర మీడియా సంయమనం పాటించాలి

-తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమవుతాం.. గన్‌పార్క్‌లో టీజేఎఫ్ ప్రతిజ్ఞ

ALLAMsir
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సబ్బండ వర్ణాల ప్రజల పోరాటాల విజయం. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల్ని గుండెల్లో దాచుకుని, వారి ఆశయాల కోసం పాటుపడతామని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ప్రతిజ్ఞ చేసింది. బుధవారం ఉదయం గన్‌పార్క్‌కు చేరుకున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం 1969 ఉద్యమం, 2009 నుంచి కొనసాగుతున్న మలిదశ ఉద్యమంలోఅసువులు బాసిన అమరుల త్యాగ ఫలమని కొనియాడుతూ, వారికి నివాళులర్పించారు. ‘జోహారులు.. జోహారులు.. అమరులకు జోహార్.. వీరులకు జోహార్, వీరులారా వందనం.. విద్యార్థి అమరులారా వందనం పాదాలకు’ అంటూ ఉద్యమగీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా టీజేఎఫ్ నేతలు ప్రసంగిస్తూ వివిధ పత్రికలు, టీవీల్లో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు ఈ త్యాగఫలాన్ని కాపాడుకుంటూ.. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయాలని కోరారు. ఇరుప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టకుండా మీడియా సంయమనం పాటించాలని, విభజనను ఇరు ప్రాంతాల వికాసానికి దారితీసేలా అందరూ చర్చించాలని టీజేఎఫ్ ఈ సందర్భంగా కోరింది.తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో సబ్బండ వర్ణాల ప్రజలతో కలిసి భుజం భుజం కలిపి నడిచిన కలాలన్నీ ఇక ముందు కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం పునరంకితమవుతాయని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రకటించారు.

TJF

పాత్రికేయుల ప్రతిజ్ఞ: అమరవీరుల స్మారక స్తూపం వద్ద టీజేఎఫ్ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ‘తెలంగాణ నేల తల్లి బిడ్డలమైన మనం తెలంగాణ కోసం నిలబడి కలబడి గెలిచాం. అంతర్గత వలస ఆధిపత్యం నుంచి, సీమాంధ్ర పాలన నుంచి స్వీయ అస్తిత్వ పోరాటంతో తెలంగాణ ప్రకటన రెండోసారి సాధించుకోవడంలో జర్నలిస్టులుగా మన వంతు పాత్ర పోషించాం. పోరాటంలో అన్ని శక్తులతో కదంకదం కదిపి కలం పదును చాటాం. ఇది తెలంగాణ ఉద్యమంలో 1969లో తుపాకీ గుండ్లకు, ఆంధ్ర పాలకుల దౌష్ట్యానికి బలైన 369 మంది వీరులు, మలి ఉద్యమంలో 1100 మంది వీరుల బలిదానాల ఫలితం. జయశంకర్ సార్ స్ఫూర్తి, ఈ నేలమీద విద్యార్థులు, బుద్ధిజీవులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, టీచర్లు, కార్మికులు, సబ్బండ వర్ణాలు చేసిన అసమాన పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఈ కల సాకారమైంది. మన పాత్ర ముగియలేదు. భవిష్యత్ తెలంగాణ కోసం, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేవరకు పోరాటం కొనసాగిద్దాం. అమరవీరులను గుండెల్లో దాచుకుందాం. బంగారు తెలంగాణ నిర్మించుకుందాం. జై తెలంగాణ. జైజై తెలంగాణ’ అని నినదించారు. కార్యక్షికమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, సుధ, బందగీ, హెచ్‌వైటీవీ సీఈవో శైలేష్‌డ్డి, టీజేఎఫ్ ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి క్రాంతి, రమణ, దక్కన్ క్రానికల్ పొలిటికల్ ఎడిటర్ గౌరీశంకర్, పీవీ శ్రీనివాస్, వాసు, కోటిడ్డి, వేణుగోపాలస్వామి, చైతన్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

source: http://www.namasthetelangaana.com/News/article.aspx?Category=1&subCategory=2&ContentId=265002

Tags: అమరుల త్యాగం వృథాకానీయం

Category: News, Technology News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


eight × = 40







Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.