ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే..!
మన శరీరానికి ఆధారం ఎముకలు. అలాంటి ఎముకల్లో సమస్యలుంటే మాత్రం ఆరోగ్యానికి దెబ్బేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
* ఎముకలకు విటమిన్ డి క్యాల్షియం అందాలి: ఎముకల ఆరోగ్యం కోసం గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే తగిన క్యాల్షియం లభిస్తుంది. అలాగే తాజా పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా విటమిన్ ‘డి’ లభిస్తుంది.
* నట్స్ అండ్ సీడ్స్: పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, నట్స్ తీసుకుంటే ఎముకలకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదాహరణకు ఒక బాదంపప్పులో 75మి.గ్రాల క్యాల్షియం ఉంటుంది. అలాగే నువ్వుల్లో 37 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
* కూరగాయలు: రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, స్వీట్ పొటాటోస్, దోసకాయ వంటివి తీసుకుంటే ఎముకలకు కావాల్సిన ‘ఎ’ విటమిన్ లభిస్తుంది.
* విటమిన్-కె లభించాలంటే ఏం చేయాలి: కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ‘కె’ లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి.
* వ్యాయామం తప్పనిసరి: వాకింగ్, ఎరోబిక్స్, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి.
Category: Health Tips, Services
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.