బాధ్యతలు స్వీకరించిన గండ్ర
ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణాడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఆయన శాసన సభ ప్రాంగణంలో స్పీకర్ తనకు కేటాయించిన చాంబర్‌లో చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో చీఫ్ విప్‌గా పనిచేసిన మల్లుభట్టి విక్రమార్క్‌కు కేటాయించిన చాంబర్‌నే గండ్రకు ఇచ్చారు. గండ్ర బాధ్యతల స్వీకరణ కార్యక్షికమానికి ఆయన నియోజకవర్గంతో పాటు వరంగల్ జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వరంగల్ జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపీ హర్షకుమార్‌తో పాటు గండ్రకు సన్నిహితంగా ఉండే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు కూడా అసెంబ్లీకి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఆరేపల్లి మోహన్, ఐ అనిల్, తూర్పు జయవూపకాష్‌డ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, పేర్ని నాని, రుద్రరాజు పద్మరాజు కూడా ఈ కార్యక్షికమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గండ్ర వెంకటరమణాడ్డి సీఎల్పీ వద్ద మీడియాతో మాట్లాడుతూ శాసన సభలో వివిధ పార్టీల నేతలను రెండు రోజుల్లో కలుస్తామని చెప్పా రు. ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో చర్చ జరిగే విధంగా చూస్తామన్నారు. సభా సమావేశాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సభలో ప్రజలు కోరుకునే విధంగా, నిర్మాణాత్మకమైన చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పా రు. తమ పార్టీ సభ్యులతో పాటు సభలో ఇతర పార్టీల సభ్యులందర్ని సమన్వయం చేసుకుని సభ సజావుగా జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. తనతో పాటు విప్‌లుగా నియమితులైన వారు సీఎం కిరణ్, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోద రాజనరసింహలను కలిసినట్లు ఆయన తెలిపారు.
Related posts:
- రాజయ్య రాజీనామా
- పయ్య కదలదు.. తొవ్వ సాగదు, సీమాంధ్ర దారులన్నీ క్లోజ్, నేడు, రేపు క్యాబ్స్ కూడా బంద్, సకలం దిగ్బంధం
- సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
- నేటి నుంచి ప్రైవేటు పాఠశాలల నిరవధిక బంద్, నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్
- తెగించి పోరాడుతాం
Category: News, State News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.