వేయిస్తంభాల గుడికి ప్రభుత్వం నిధులు మంజూరు
కాకతీయుల కాలంనటి వేయిస్తంభాల దేవాలయానికి మహార్దశ తీసుకొచ్చేందుకు అధికారులు నడుం బిగించారు. అద్భుత శిల్పాకళా సంపదను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ఆలయం ముందున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. కాకతీయుల కీర్తీకే వన్నే తెస్తున్న హన్మకొండ వేయిస్తంభాల గుడికి మహార్దశ పట్టనుంది. అద్భుత శిల్పాకళకు వేదికగా ఉన్న ఈ కట్టడానికి పర్యాటక ప్రాధాన్యం తెచ్చేందుకు సర్కారు నడుంబిగించింది. పర్యాటకులు,భక్తులు సౌకర్యార్థం విస్తరణ పనులు చేపట్టారు. బాటసారులు,వాహనదారుల ఆలయాన్ని స్పష్టంగా చూసేవిధంగా రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. గుడి సమీపంలో ఉన్న ఇళ్లు, షాపులకు నష్టపరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు జిల్లా అధికారుల చొరవతో రోడ్డు విస్తరణ పనులు కొలిక్కి వచ్చాయి.
దీంతో కొన్నేళ్లుగా రగులుతున్న రోడ్డు వెడల్పు వివాదం తెరపడి మొత్తానికి అన్ని ఇళ్లను కూల్చివేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శివరాత్రి లోపు పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వేయిస్తంభాల గుడి నిర్మాణానికి వాడిన రాళ్లను పోలిన రాళ్లతో విస్తరణ పనులకు వాడడం ద్వారా అలనాటి కట్టడానికి మరింత శోభ చేకూర్చుతున్నారు.
ఏది ఏమైనప్పటికి వేయిస్తంబాల దేవాలయ రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేస్తే దేవాలయానికి కొత్త సొగసులు ఏర్పడటమేకాక పర్యాటకులకు కనువిందుగా ఉంటుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Related posts:
- ఆర్టీసీ సమ్మెపై కుట్ర పన్నుతున్న ప్రభుత్వం
- రగులుతున్న తెలంగాణ – 50 బస్సుల అద్దాలు ధ్వంసం.. నకిరేకల్ సీఐ తలకు గాయాలు – శాంతియుత ఉద్యమంలో సీమాంధ్రుల చిచ్చు
- 25 లక్షల కొత్త రేషన్ కార్డులు – 5 లక్షల మందికి పింఛన్లు – 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ధి
- ముమ్మరం కానున్న సీబీఐ దర్యాప్తు -ఇకపై వ్యక్తిగతంగా పిలిపించి విచారణలు -మూడో దశలో అరెస్టులు
- తెలంగాణవాదులపై రెచ్చిపోయిన మంత్రి – దళితునిపై దానం దాదాగిరి. – నిరసన తెలిపినందుకు లాఠీతో వీరంగం…దానంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
Category: News, Warangal News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.