‘మృత’ సముద్రం ఇక అదృశ్యం ?

లండన్:ప్రపంచంలోనే అత్యంత ఉప్పునీటి సరస్సుగా, సుందరమైన తీర ప్రాంతాలతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న డెడ్ సీ (మృత సముద్రం ) త్వరలోనే ఎండిపోనుందా..? మృత సముద్రం ఉనికిని కోల్పోయే స్థితిలో ఉందా..? అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. జెరుసలేం యూనివర్శిటీకి చెందిన పర్యావరణ శాస్తవ్రేత్తల బృందం చేసిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మృతసముద్రంలోని అవక్షేపాన్ని పరీక్షించిన శాస్తవ్రేత్తలు డెడ్‌సీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, తీవ్ర వర్షభావ పరిస్థితుల్లో దాని ఉనికి కష ్టమేనని వెల్లడించారు.
నీటి మట్టం తగ్గిపోవడం, కొత్త నీరు చేరకపోవడం, అంతేకాకుండా పరిసర ప్రాంతాల పర్యావరణంలో వచ్చిన మార్పులు డెడీసీ ఎండిపోవడానికి కారణమవుతున్నాయని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ‘డెడ్ సీ పరిసర ప్రాంతాల్లో వాతావరణలో కలిగిన సహజ మార్పులు, మానవుని ప్రేరిపిత మార్పులు విపత్తుకు దారితీస్తున్నాయి ’ అని శాస్తవ్రేత్తల బృందానికి నేతృత్వం విహంచిన ప్రొఫెసర్ మోటీ స్టైయిన్ పేర్కొన్నారు.
డెడ్‌సీలో సముద్ర మట్టానికి 425 మీటర్ల లోపల ఉప్పు నీరు మందమైన పొరలుగా ఏర్పడినట్లు శాస్తవ్రేత్తలు గుర్తించారు. 2010లో జరిపిన ప్రయోగా ప్రకారం మృత సముద్రం లక్ష ఇరవై వేల ఏళ్ల క్రితం కూడా ఎండిపోయిందని, ఐతే అప్పట్లో కొత్త నీరు తిరిగి చేరడంతో మళ్లీ అది జీవం పోసుకుందని డెయిలీ గ్రాఫ్ తెలిపింది. ఐతే ఈ సారి అలాంటి పరిస్థితులు కనిపింపిచడం లేదని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం నీటి సరఫరా ఆగిపోవడంతో.. అది తిరిగి పునరజ్జీవం పొందడం సాధ్యం కాదని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడినట్లు డెయిలీ గ్రాఫ్ ప్రచురించింది. మిడిల్ ఈస్ట్‌లోని ఇజ్రాయిల్,జోర్డాన్ దేశాల 67 కిలోమీటర్ల పొడవు, 18 కిలోమీటర్ల వెడల్పుతో వి డెడ్ సీ విస్తరించింది.
Related posts:
Category: News, World News




Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.