Free Blood Donors Hyderabad, warangal

11-11-11 న ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’

| October 27, 2011 | 0 Comments


‘స్నేహగీతం’ ఫేమ్‌ మధుర శ్రీధర్‌ తన రెండో చిత్రంగా మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లి. సమర్పణలో ప్రవాసాంధ్రులు డా|| మున్నా వెంకటకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’కి దర్శకత్వం వహించారు. సునీల్‌కశ్యప్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని 11.11.11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ… ‘సినిమాలన్నీ మూస పద్ధతిలోనే ఉంటున్నాయి. కొత్త కథలతో కొత్తదనంతో తెలుగులో సినిమాలు రావడం లేదు అనేవారికి మా ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’ ఖచ్చితంగా సమాధానం అవుతుంది. కంప్యూటర్‌ డిజైనర్‌గా చేసే వరంగల్‌ అబ్బాయికి ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేసే వైజాగ్‌ అమ్మాయికి మధ్య జరిగే అందమైన ప్రేమకథే ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’. నేటి కార్పోరేట్‌ సంస్కృతిలో పెళ్ళికి ముందే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వుండాల్సి వస్తే పరిస్ధితులు ఎలా వుంటాయి? ఆపై జరిగే పరిణామాలు ఏమిటి? అనేది పూర్తిస్ధాయి ఎంటర్‌టైనర్‌తో రూపొందించాము. వచ్చే నెల 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సునీల్‌కశ్యప్‌ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ అన్ని రేడియో స్టేషన్లలో టాప్‌ 10లో వున్నాయి. స్టార్‌హంట్‌ ద్వారా సెలక్ట్‌ అయిన హీరో అరవింద్‌, హీరోయిన్‌ నిఖిత అద్భుతంగా నటించగా శరత్‌బాబు, జయసుధ, ముఖ్యపాత్రలు పోషించారు. అన్నారు

Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in

No related posts.

Tags:

Category: Cinema News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply



Recent Posts





Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com
Free Blood Donors Hyderabad, warangal