Free Blood Donors Hyderabad, warangal

తెలంగాణ సాయుధ పోరులో ‘రాజన్న’

| October 27, 2011 | 0 Comments


తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆనాటి సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రం ‘రాజన్న’. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్నారు. రజాకార్ల, భూస్వాముల ఆగడాలపై సమరశంఖం పూరించిన తెలంగాణ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ‘రాజన్న’గా ఆయన ఈ చిత్రంలో కనిపించనున్నారు. స్వీయనిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యస్.యస్.రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని పోరాట సన్నివేశాల్ని యస్.యస్.రాజమౌళి పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పాట మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నాగార్జున చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన నాలుగు యదార్థ సంఘటనలను ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది.

విజయేంద్రప్రసాద్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. రాజమౌళి పర్యవేక్షణలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధానాకర్షణగా వుంటాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఎనిమిదేళ్ల పాప ఏని అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పాప పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి స్వాతంవూతోద్యమ కాలం నాటి వాతావరణాన్ని సృష్టించాం. రాజన్న చిత్రాన్ని చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చింది. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దేశభక్తిని రగిలిస్తూ, పోరాట స్ఫూర్తిని చాటే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాల్ని జరుపుతున్నాం. ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ మూడో వారంలో ఈ చిత్రాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in

No related posts.

Tags:

Category: Cinema News

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply



Recent Posts



Web Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Free Blood Donors Hyderabad, warangal