మరోసారి ఆమరణ దీక్షకు కేసీఆర్ సిద్ధం
ప్రత్యేక తెలంగాణరాష్ట్ర సాధన కోసం అవసరమైతే మరోమారు ఆమరణ దీక్ష చేప టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కే తారకరామారావు తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆమరణ దీక్షను విరమింపజేసేందుకు బుధవారం ఖమ్మం వెళ్తూ సూర్యాపేటలో విలేకరులతో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ దీక్షపై జేఏసీలో చర్చించామని, ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దీక్షకు సైతం వెనుకాడే పరిస్థితి లేదని చెప్పారు. 37 రోజులుగా లక్షలాది ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కుట్రతో అడ్డంకులు సృష్టిస్తోందని, అయినప్పటికీ వాటిని తట్టుకుంటూ ఉద్యమాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఆగ్రనేత అద్వానీ రథయావూతలో భాగంగా తెలంగాణపై చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు జాతీయ పార్టీలైన సీపీఐ, బీజేపీ , బీఎస్పీలు మద్దతు పలుకుతున్నాయని, కాంగ్రెస్ మినహా మిగిలిన పక్షాలన్నీ అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
ఫలితాన్ని సాధించే దిశగా సకల జనుల సమ్మె కొనసాగుతోందని, సమ్మె సెగతో కేంద్రం చర్చలకు సిద్ధమవడమే దీనికి నిదర్శనమన్నారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేసే బదులు కాంగ్రెస్ పార్టీకి చెందిన 40మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే తెలంగాణ తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేకే ఇంట్లో టిఫిన్..వివేక్ ఇంట్లో భోజనం..
జిల్లాలో తెలంగాణవాదం లేదనే వారి కళ్లు తెరిపించారని ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసించారు. 2009లో కేసీఆర్ ఖమ్మం గడ్డ మీది నుంచే కేంద్రానికి తెలంగాణ కేక వినిపించారని, అలాంటి ఘన చరివూతను ఇప్పుడు కూనంనేని సాంబశివరావు సొంతం చేసుకున్నారని కొనియాడారు. కూనంనేనిని పరామర్శించిన తర్వాత నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 36 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నా మాకేమీ నష్టంలేదు, మీకే నష్టమని వ్యాఖ్యలు చేస్తున్న కిరణ్‌కుమార్‌డ్డిని సీఎం అని ఎలా చెప్పుకోగలమని ప్రశ్నించారు. ప్రతి సందర్భంలోనూ మీ-మా అని విభేదించి మాట్లాడే ఆయనను సీఎంగా అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. సమ్మెతో నాలుగు కోట్ల జనం ఒక్కసారిగా ముఖ్యమంవూతికి తొడపాశం పెట్టినట్లుందన్నారు.
చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది.. చెప్పకపోతే మానం పోతుందన్నంత దయనీయంగా సీఎం పరిస్థితి మారిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పొద్దున లేవగానే హాట్ హాట్‌గా ప్రెస్‌మీట్లు పెట్టి జనాన్ని గందరగోళానికి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కేకే ఇంట్లో టిఫిన్, ఎంపీ వివేక్ ఇంట్లో భోజనంతో ఉద్యమాన్ని ముగిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమ్మె వంద శాతం విజయవంతమైందని, కాంగ్రెస్ దద్దమ్మల వల్లే తెలంగాణ ఆగిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలను తరిమికొట్టడమే నినాదంగా మారాలని పిలుపునిచ్చారు. ఇకపై ఎవరో ఏదో చేస్తారని వేచి చూడొద్దని ఆనాడు కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో సకలజనులు ఒక్కటై పోరాటం చేయడం వల్లే డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూల ప్రకటన వెలువడిందని, అదే స్ఫూర్తితో పోరాడుదామని సూచించారు.
source from namaste telangana
Related posts:
- తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్ నేతలు
- స్వామిగౌడ్‌ను పరామర్శించిన కేసీఆర్
- సింగరేణి కార్మికులపై నిర్బంధం ఆపండి- సింగరేణి కార్మికులకు మద్దతుగా యాత్ర – టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన తెలంగాణ అఖిలపక్షం –
- సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
- రాష్ట్రం వచ్చే దాకా సమ్మె – నేడు అర్ధనగ్న ప్రదర్శనలు – రేపు ర్యాలీలు, ధర్నాలు – 5న మానవహారాలు – 6న జమ్మిచెట్టు ముందు ప్రార్థనలు
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.