రిలయన్స్ బ్యాంక్
ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం నాడు ఏకబిగిన రిలయన్స్ కేపిటల్, రిలయన్స్ మ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లకు చెందిన నాలుగు కంపెనీలకు వార్షిక సర్వసభ్య సమావేశాలు (ఏజీఎం)లు నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి త్వరలోనే బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. మ్యూచువల్‌ఫండ్, జనరల్ ఇన్సురెన్సు, టెలికం టవర్ వ్యాపారాల్లోని వాటాలను విక్రయిస్తామని చెప్పారు. టెలికం యూనిట్ ఆర్.కామ్‌లో వాటాను పెంచబోతున్నట్లు చెప్పారు.
రూ.45వేల కోట్ల ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు
రిలయన్స్ ఇన్‌ఫ్రా దేశవ్యాప్తంగా 27 ప్రాజెక్టులకు రూ.45,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోందని వాటిలో 20 ప్రాజెక్టుల నుంచి 2012 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ కూడా నమోదు చేయబోతోందని అనిల్‌చెప్పారు. తమ కంపెనీ రోడ్లు, మెట్రో, సిమెంట్, విద్యుత్‌ఉత్పత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిందని చెప్పారు.అడాగ్ గ్రూపునకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించే అవకాశాలున్నాయని అనిల్ అంబానీ మంగళవారం నాడు చెప్పారు. రిలయన్స్ కేపిటల్ వాటా దారుల సమావేశంలో అనిల్ అంబానీ ఈ విషయం చెప్పారు. తాము ఏర్పాటు చేయబోయే బ్యాంకు పేరును రిలయన్స్ బ్యాం కుగా పేరు పెడతామని చెప్పారు. బోనస్ షేర్లు కానీ, ప్రత్యేక డివి డెండ్ చెల్లించే ఆలోచన ఏమైనా ఉందా అని వాటాదారులు ప్రశ్నిం చగా.. మీ ప్రతిపాదనను బోర్టు చర్చించి నిర్ణయిస్తామని ఆయన అన్నారు.
మంగళవారం నాడు రిలయన్స్ క్యాపిటల్ షేరు 5శాతం లాభపడి రూ.411.40 వద్ద ట్రేడ్ అయింది. అనిల్ అంబాని రిల యన్స్ కేపిటల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. తమ కంపెనీ ఇప్పటి వరకు సాధించిన వృద్ధిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు తమ కంపె నీలకు చెందిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఆ లాభాన్ని 13 లక్షల వాటాదారులకు పంచుతామని అనిల్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ లైఫ్ ఇన్సురెన్సులో 26 శాతం వాటాను జపాన్‌కు చెందిన నిప్పాన్ లైఫ్‌కు రూ.3,000 కోట్లకు విక్రయించారు.
రిలయన్స్ కేపిటల్ కూడా నిప్పాన్ లైఫ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఫైనాన్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో అడుగుపెట్టబోతోందని … అలాగే వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు ప్రైవేట్ ఈక్విటీ బిజినెస్‌లో కాలుమోపబోతున్నామని అనిల్ అన్నారు. 2005లో చిన్న ఫైనాన్సియల్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రస్తుతం అతి పెద్ద ఫైనాన్షియల్ కంపెనీగా అవతరించిందన్నారు. రిలయన్స్ కేపటిల్ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ దీని నికర ఆస్తులు రూ.8,000 కోట్లు కాగా… 2 కోట్ల మంది కస్టమర్లున్నారని, దేశవ్యాప్తంగా 8,000 కార్యాలయాలతో 18,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఫైనాన్స్ వ్యాపారంలో ఆలస్యంగా ప్రవేశించినా… లీడర్‌షిప్ స్థానానికి ఎగబాకామని ఈ వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నా తట్టుకుని నిలబడ్డామని అనిల్ వివరించారు.
No related posts.
Category: Others
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.